T20 WC 2021 ENG Vs WI: 6 వికెట్ల తేడాతో ఇంగ్లండ్‌ ఘన విజయం | T20 World Cup 2021: ENG Vs WI Match Live Updates And Highlights | Sakshi
Sakshi News home page

T20 WC 2021 ENG Vs WI: 6 వికెట్ల తేడాతో ఇంగ్లండ్‌ ఘన విజయం

Published Sat, Oct 23 2021 6:41 PM | Last Updated on Sat, Oct 23 2021 10:08 PM

T20 World Cup 2021: ENG Vs WI Match Live Updates And Highlights - Sakshi

6 వికెట్ల తేడాతో ఇంగ్లండ్‌ ఘన విజయం
వెస్టిండీస్‌పై విజయం సాధించి టి20 ప్రపంచకప్‌ 2021లో ఇంగ్లండ్‌ తొలి అడుగు వేసింది. 56 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లండ్‌ 4 వికెట్లు కోల్పోయి టార్గెట్‌ను చేధించింది. ఇంగ్లండ్‌ జట్టులో బట్లర్‌ 24 పరుగులతో నటౌట్‌గా నిలిచి జట్టుకు విజయాన్ని అం​దించాడు. విండీస్‌ బౌలర్లలో అకేల్‌ హోసిన్ రెండు వికెట్లు పడగొట్టాడు.    అంతకు ముందు టాస్‌ ఓడి భ్యాటింగ్‌కు దిగిన వెస్టిండీస్‌ ఇంగ్లండ్‌ బౌలర్ల ధాటికి కేవలం 55 పరుగులకే కూప్ప కూలిపోయింది. విండీస్‌ బ్యాటింగ్‌లో ఒక్క క్రిస్‌ గేల్‌ తప్ప ఒక్కరు కూడా సింగిల్‌ డిజిట్‌ స్కోర్‌ ధాట లేకపోయారు. ఇంగ్లండ్‌ బౌలర్లలో రషీద్‌ నాలుగు వికెట్లు పడగొట్టగా,  టైమల్ మిల్స్‌ ,మొయిన్ అలీ చెరో రెండు వికెట్లు , క్రిస్ వోక్స్‌, జోర్డాన్‌ చెరో వికెట్‌ సాధించారు.

రెండో వికెట్‌ కోల్పోయిన ఇంగ్లండ్‌.. బెయిర్‌స్టో(9) ఔట్‌
56 పరుగల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లండ్‌ రెండు వికెట్లు కోల్పోయింది. రవి రంపాల్ బౌలింగ్‌లో జాసన్ రాయ్‌(11) క్రిస్‌ గేల్‌కు క్యాచ్‌ ఇచ్చి పెవిలియన్‌కు చేరగా, అకేల్‌ హోసిన్ బౌలింగ్‌లో జానీ బెయిర్‌స్టో రిటర్న్‌ క్యాచ్‌ ఇచ్చి వెనుదిరిగాడు. 5 ఓవర్లు ముగిసేసరికి 2 వికెట్ల నష్టానికి ఇంగ్లండ్‌ 34 పరుగులు చేసింది. ప్రస్తుతం క్రీజులో బట్లర్‌(11), మొయిన్ అలీ(3) పరగులతో క్రీజులో ఉన్నారు.

కూప్పకూలిన వెస్టిండీస్‌.. 55 పరగులకే ఆలౌట్‌
టి20 ప్రపంచకప్‌ 2021లో భాగంగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో  కేవలం 55 పరుగులకే ఆలౌటై వెస్టిండీస్‌ ఘోర పరాభావాన్ని మూటకట్టుకుంది. టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన కరీబీయన్లు ఇంగ్లండ్‌ బౌలర్ల ధాటికి విలవిల్లడారు. 14.2 ఓవర్లలో 55 పరుగులకే వెస్టిండీస్‌ కూప్ప కూలిపోయింది. విండీస్‌ బ్యాటింగ్‌లో ఒక్క క్రిస్‌ గేల్‌ తప్ప ఒక్కరు కూడా సింగిల్‌ డిజిట్‌ స్కోర్‌ ధాట లేకపోయారు. ఇంగ్లండ్‌ బౌలర్లలో రషీద్‌ నాలుగు వికెట్లు పడగొట్టగా,  టైమల్ మిల్స్‌ ,మొయిన్ అలీ చెరో రెండు వికెట్లు , క్రిస్ వోక్స్‌, జోర్డాన్‌ చెరో వికెట్‌ సాధించారు.

పీకల్లోతు కష్టాల్లో విండీస్‌..42 పరుగులకే 6 వికెట్లు
ఇంగ్లండ్‌ బౌలర్ల ధాటికి వెస్టిండీస్‌ బ్యాటర్‌లు విలవిలాడుతున్నారు. కేవలం 42 పరుగలుకే 6 వికెట్లు కోల్పోయి విండీస్‌ పీకల్లోతు కష్టాల్లో పడింది. వరుస క్రమంలో బ్రావో (5), పూరన్‌(1) వికెట్లు కోల్పోయింది.  10 ఓవర్లు ముగిసేసరికి 6 వికెట్ల నష్టానికి వెస్టిండీస్‌ 44 పరుగులు చేసింది. ప్రస్తుతం క్రీజులో పొలార్డ్‌(4),రసెల్‌(0)పరుగులుతో ఉన్నారుఇంగ్లండ్‌ బౌలర్లలో టైమల్ మిల్స్‌ ,మొయిన్ అలీ చెరో రెండు వికెట్లు పడగొట్టగా, క్రిస్ వోక్స్‌, జోర్డాన్‌ చెరో వికెట్‌ సాధించారు.

33 పరుగులకే 4 వికెట్లు డౌన్‌.. కష్టాల్లో వెస్టిండీస్‌
ఇంగ్లండ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో కేవలం 35 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయి వెస్టిండీస్‌ కష్టాల్లో పడింది.  వరుస క్రమంలో హెట్‌మైర్‌(9) ,క్రిస్ గేల్‌(13) వికెట్లను విండీస్‌ కోల్పోయింది. మొయిన్ అలీ బౌలింగ్‌లో హెట్‌మైర్‌ పెవిలియన్‌కు చేరగా, టైమల్ మిల్స్‌ బౌలింగ్‌లో క్రిస్ గేల్‌ మలాన్‌కు క్యాచ్‌ ఇచ్చి వెనుదిరిగాడు. 7 ఓవర్లు ముగిసేసరికి 4 వికెట్ల నష్టానికి వెస్టిండీస్‌ 33 పరుగులు చేసింది.

రెండో  వికెట్‌ కోల్పోయిన వెస్టిండీస్‌.. సిమన్స్‌(3) ఔట్‌
ఇంగ్లండ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో వెస్టిండీస్‌ ఆరంభంలోనే  ఓపెనర్ల వికెట్‌ కోల్పోయింది. మొయిన్ అలీ బౌలింగ్‌లో సిమన్స్‌(3) పరుగులకే లివింగ్‌స్టోన్‌కు క్యాచ్‌ ఇచ్చి పెవిలియన్‌కు చేరాడు.4 ఓవర్లు ముగిసేసరికి 2 వికెట్ల నష్టానికి వెస్టిండీస్‌ 19 పరుగులు చేసింది. 

తొలి వికెట్‌ కోల్పోయిన వెస్టిండీస్‌.. లూయిస్‌(6) ఔట్‌
టి20 ప్రపంచకప్‌ 2021లో భాగంగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో వెస్టిండీస్‌ తొలి వికెట్‌ కోల్పోయింది. లూయిస్‌(6) పరుగులకే క్రిస్ వోక్స్‌ బౌలింగ్‌లో మొయిన్ అలీకు క్యాచ్‌ ఇచ్చి పెవిలియన్‌కు చేరాడు. 2 ఓవర్లు ముగిసేసరికి వికెట్‌ సష్టానికి వెస్టిండీస్‌ 9 పరుగలు చేసింది. ప్రస్తుతం క్రీజులో లెండిల్ సిమన్స్‌(3), క్రిస్ గేల్‌(0) పరుగులుతో ఉన్నారు.



దుబాయ్‌: టి20 ప్రపంచకప్‌ 2021లో భాగంగా నేటి నుంచి సూపర్‌ 12 దశ మ్యాచ్‌లు ప్రారంభమయ్యాయి. రెండో మ్యాచ్‌లో భాగంగా ఇంగ్లండ్‌, వెస్టిండీస్‌లు తల పడతున్నాయి. ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన ఇంగ్లండ్‌ ఫీల్డింగ్‌ ఎంచుకుంది. ఇక టి20 ల్లో ఇరు జట్లు 18 మ్యాచ్‌ల్లో ముఖాముఖి తలపడగా.. 11 మ్యాచ్‌లు కరీబీయన్లు నెగ్గగా.. కేవలం ఏడు మ్యాచ్‌ల్లో మాత్రమే ఇంగ్లండ్ గెలిచింది. రెండు సార్లు ఛాంపియన్‌గా నిలిచిన వెస్టిండీస్‌ ఈ మ్యాచ్‌లో హాట్‌ ఫేవరేట్‌గా బరిలోకి దిగుతుంది.

కానీ రెండు వార్మప్‌ మ్యాచ్‌ల్లోను ఓటమి చెంది విండీస్‌ కాస్త ఢీలా పడింది. ఇక ఇంగ్లండ్‌ విషయంకు వస్తే.. బట్లర్‌, రాయ్‌, మలన్‌, బెయిర్‌ స్టో లాంటి విధ్వంసక బ్యాటర్లు ఉండడం ఆ జట్టుకు కలిసొచ్చే అంశం. 2016లో టీ20 వరల్డ్‌కప్‌ ఫైనల్లో ఇంగ్లండ్‌పై  కార్లోస్ బ్రాత్‌వైట్ ఆఖరి ఓవర్‌లో వరుసగా నాలుగు సిక్సర్లు కొట్టి వెస్టిండీస్‌ని గెలిపించిన సంగతి తెలిసిందే.

ఇంగ్లండ్‌జాసన్ రాయ్‌, జోస్ బట్లర్‌, డేవిడ్ మలన్, జానీ బెయిర్‌స్టో, మొయిన్ అలీ, లివింగ్‌స్టోన్‌, ఇయాన్ మోర్గాన్‌ (కెప్టెన్), క్రిస్ వోక్స్‌, జోర్డాన్‌, రషీద్‌, , టైమల్ మిల్స్‌

వెస్టిండీస్‌: ఎవిన్ లూయిస్‌, లెండిల్ సిమన్స్‌, క్రిస్ గేల్‌, నికోలస్ పూరన్‌, హెట్‌మెయర్, పొలార్డ్‌, రసెల్‌, బ్రావో, అకేల్‌ హోసిన్, మెక్‌కాయ్‌, రవి రంపాల్

చదవండి: 2007 టి20 వరల్డ్‌కప్‌ ఫైనల్‌ గుర్తుందిగా.. తాజాగా ముగ్గురు మాత్రమే

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement