తొలి సెమీస్‌: మోర్గాన్‌ రికార్డ్‌ | Morgan joins 5000 runs club | Sakshi
Sakshi News home page

తొలి సెమీస్‌: మోర్గాన్‌ రికార్డ్‌

Published Wed, Jun 14 2017 5:25 PM | Last Updated on Sat, Mar 23 2019 8:04 PM

తొలి సెమీస్‌: మోర్గాన్‌ రికార్డ్‌ - Sakshi

తొలి సెమీస్‌: మోర్గాన్‌ రికార్డ్‌

కార్డిఫ్‌: చాంపియన్స్‌ ట్రోఫీలో జరుగుతున్న తొలి సెమీ ఫైనల్లో మరో రికార్డు నమోదైంది. ఇంగ్లండ్‌ కెప్టెన్‌ ఇయాన్‌ మోర్గాన్‌ 5000 పరుగుల మైలురాయిని దాటాడు. ఈ ఘనత సాధించిన మూడో ఇంగ్లండ్‌ బ్యాట్స్‌మన్‌గా రికార్డు నమోదు చేశాడు. బెల్‌ 5416, కాలింగ్‌ ఉడ్‌ 5092లు మోర్గాన్‌ కన్నా ముందున్నారు.

క్రీజులో కుదురుకుంటున్నట్లు కనిపించిన మోర్గాన్‌ 33 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద హసన్‌ అలీ బౌలింగ్‌లో కీపర్‌ సర్ఫరాజ్‌కు క్యాచ్‌ ఇచ్చి వెనుదిరిగాడు. ఇంగ్లండ్‌ 148 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. క్రీజులో బెన్‌ స్టోక్స్‌, మోయిన్‌ అలీ లు పోరాడుతున్నారు. పాక్‌ బౌలర్లలో హసన్‌ అలీ(2), రుమాన్‌ రాయిస్‌ (1), షాదాబ్‌ ఖాన్‌ (1), జునైద్‌ ఖాన్‌(1)  వికెట్లు పడగొట్టారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement