హాట్ కేకుల్లా వన్డే టికెట్లు | england verses india Tickets for first ODI sold out | Sakshi
Sakshi News home page

హాట్ కేకుల్లా వన్డే టికెట్లు

Published Thu, Dec 29 2016 12:54 PM | Last Updated on Mon, Sep 4 2017 11:54 PM

హాట్ కేకుల్లా వన్డే టికెట్లు

హాట్ కేకుల్లా వన్డే టికెట్లు

పుణె:ఇంగ్లండ్ తో ఐదు టెస్టుల సిరీస్ను విరాట్ కోహ్లి నేతృత్వంలోని టీమిండియా పరాజయమే లేకుండా ముగించడంతో, ఇరు జట్ల మధ్య జరిగే  వన్డే సిరీస్కు మంచి జోష్ వస్తోంది.  దీనిలో భాగంగా మూడు వన్డేల సిరీస్లో భాగంగా పుణెలో జరిగే తొలి వన్డే మ్యాచ్ టికెట్లు అప్పుడే హాట్ కేకుల్లా అమ్ముడుపోయాయి.

 

మహారాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ పుణె అంతర్జాతీయ స్టేడియం కెపాసిటీ 37, 406. అయితే మ్యాచ్ కు ఇంకా  పక్షం రోజులుగా పైగా సమయం ఉన్నప్పటికీ, మొత్తం టికెట్లు అమ్ముడు పోవడంతో వన్డే సిరీస్ కు మంచి ఆరంభమే లభించినట్లు కనబడుతోంది. ఈనెల 15వ తేదీన టికెట్లు అమ్మకాలను ప్రారంభించగా, 27 వ తేదీకి మొత్తం టికెట్లు అమ్ముడుపోయినట్లు స్టేడియం నిర్వాహకులు తెలిపారు. ఈ స్టేడియంలో చివరిసారి 2013లో ఆస్ట్రేలియా-భారత్ జట్ల మధ్య వన్డే జరిగింది. అదే ఆ స్టేడియంలో నిర్వహించిన తొలి వన్డే కాగా, దాదాపు మూడేళ్ల తరువాత అక్కడ రెండో వన్డే జరుగనుంది.


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement