Ind Vs Aus 3rd ODI: Playing XI, Toss, Score, Updates and Highlights - Sakshi
Sakshi News home page

మూడో వన్డేలో టీమిండియా ఓటమి.. సిరీస్‌ కైవసం చేసుకున్న ఆస్ట్రేలియా

Published Wed, Mar 22 2023 12:50 PM | Last Updated on Wed, Mar 22 2023 10:18 PM

Ind Vs Aus 3rd ODI Chennai Toss Playing XI Updates And Highlights - Sakshi

మూడో వన్డేలో టీమిండియా ఓటమి.. సిరీస్‌ కైవసం చేసుకున్న ఆస్ట్రేలియా
చెన్నై వేదికగా జరుగుతున్న మూడో వన్డేలో టీమిండియా ఓటమిపాలైంది. ఫలితంగా 3 మ్యాచ్‌ల వన్డే సిరీస్‌ను ఆస్ట్రేలియా 2-1తేడాతో కైవసం చేసుకుంది. ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచి తొలుత బ్యాటింగ్‌ చేసిన ఆస్ట్రేలియా 269 పరుగులకు ఆలౌట్‌ కాగా.. ఛేదనలో తడబడిన భారత్‌ 248  పరుగులకే చాపచుట్టేసింది. ఫలితంగా ఆసీస్‌ 21 పరుగుల తేడాతో విజయం సాధించింది. 

తొమ్మిదో వికెట్‌ డౌన్‌.. ఓటమి అంచుల్లో భారత్‌
టీమిండియా 243 పరుగుల వద్ద తొమ్మిదో వికెట్‌ కోల్పోయింది.  సిక్సర్‌, ఫోర్‌ కొట్టిన అనంతరం షమీ స్టొయినిస్‌ బౌలింగ్‌లో క్లీన్‌ బౌల్డ్‌ అయ్యాడు. 

ఎనిమిదో వికెట్‌ డౌన్‌.. ఓటమి దిశగా భారత్‌
225 పరుగుల వద్ద టీమిండియా ఎనిమిదో వికెట్‌ కోల్పోయింది. జడేజా బౌలింగ్‌లో స్టోయినిస్‌కు క్యాచ్‌ ఇచ్చి జడేజా (18) ఔటయ్యాడు. టీమిండియా గెలవాలంటే 29 బంతుల్లో 45 పరుగులు చేయాలి. కుల్దీప్‌ (1), షమీ క్రీజ్‌లో ఉన్నారు. 

ఏడో వికెట్‌ కోల్పోయిన భారత్‌.. హార్ధిక్‌ ఔట్‌
218 పరుగుల వద్ద టీమిండియా ఏడో వికెట్‌ కోల్నోయింది. జంపా బౌలింగ్‌లో స్మిత్‌కు క్యాచ్‌ ఇచ్చి హార్ధిక్‌ (40) ఔటయ్యాడు. భారత్‌ ఈ మ్యాచ్‌ గెలవాలంటే 38 బంతుల్లో 52 పరుగులు చేయాల్సి ఉంది. 

వరుస బంతుల్లో వికెట్లు కోల్నోయిన భారత్‌.. స్కై మరోసారి గోల్డన్‌ డక్‌
185 పరుగుల వద్ద టీమిండియా వరుస బంతుల్లో రెండు వికెట్లు కోల్నోయింది. 36వ ఓవర్‌ తొలి బంతికి కోహ్లిని (54) ఔట్‌ చేసిన అగర్‌, ఆతర్వాతి బంతికే సూర్యకుమార్‌కు (0) క్లీన్‌ బౌల్డ్‌ చేశాడు. సూర్యకుమార్‌కు ఇది హ్యాట్రిక్‌ గోల్డన్‌ డకౌట్‌ కావడం విశేషం. హార్ధిక్‌ (28), జడేజా క్రీజ్‌లో ఉన్నారు. టీమిండియా గెలవాలంటే 88 బంతుల్లో 85 పరుగులు చేయాల్సి ఉంది. చేతిలో 4 వికెట్లు మాత్రమే ఉన్నాయి.

అక్షర్‌ పటేల్‌ రనౌట్‌
7 బంతుల వ్యవధిలో టీమిండియా 2 వికెట్లు కోల్పోయింది. భారీ షాట్‌కు ప్రయత్నించి తొలుత రాహుల్‌ ఔట్‌ కాగా.. ఆతర్వాత అక్షర్‌ పటేల్‌ (2) రనౌటయ్యాడు. కోహ్లి (48), హార్ధిక్‌ పాండ్యా క్రీజ్‌లో ఉన్నారు. 

మూడో వికెట్‌ డౌన్‌.. కేఎల్‌ రాహుల్‌ ఔట్‌
146 పరుగుల వద్ద టీమిండియా మూడో వికెట్‌ కోల్పోయింది. జంపా బౌలింగ్‌లో భారీ షాట్‌ ఆడేందుకు ప్రయత్నించి కేఎల్‌ రాహుల్‌ (32) ఔటయ్యాడు. విరాట్‌ కోహ్లి (45), అక్షర్‌ పటేల్‌ క్రీజ్‌లో ఉన్నారు. టీమిండియా గెలవాలంటే 22.1 ఓవర్లలో 124 పరుగులు చేయాల్సి ఉంది. 

నిలకడగా ఆడుతున్న కోహ్లి, రాహుల్‌
77 పరుగుల వద్ద రెండో వికెట్‌ కోల్పోయిన భారత్‌.. ఆతర్వాత మరో వికట్‌ పడకుండా జాగ్రత్తగా ఆడుతుంది. 23 ఓవర్ల తర్వాత భారత్‌ స్కోర్‌ 117/2గా ఉంది. విరాట్‌ కోహ్లి (33), కేఎల్‌ రాహుల్‌ (15) క్రీజ్‌లో ఉన్నారు. 

రెండో వికెట్‌ కోల్పోయిన భారత్‌.. గిల్‌ (37) ఔట్‌
77 పరుగుల వద్ద టీమిండియా రెండో వికెట్‌ కోల్పోయింది. ఆడమ్‌ జంపా బౌలింగ్‌లో శుభ్‌మన్‌ గిల్‌ (37) ఎల్బీడబ్యూ ఔట్‌ అయ్యాడు. కోహ్లి (8), కేఎల్‌ రాహుల్‌ క్రీజ్‌లో ఉన్నారు. 

తొలి వికెట్‌ కోల్పోయిన భారత్‌.. రోహిత్‌ (30) ఔట్‌
65 పరుగుల వద్ద టీమిండియా తొలి వికెట్‌ కోల్పోయింది. సీన్‌ అబాట్‌ బౌలింగ్‌లో మిచెల్‌ స్టార్క్‌ క్యాచ్‌ పట్టడంతో రోహిత్‌ శర్మ (30) ఔటయ్యాడు. గిల్‌ (33), విరాట్‌ కోహ్లి క్రీజ్‌లో ఉన్నారు. 

9 ఓవర్లకు భారత్‌ స్కోర్‌: 65/0
270 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా దూకుడుగా ఆడుతోంది. 9 ఓవర్లు ముగిసే సరికి భారత్‌ వికెట్‌ నష్టపోకుండా 65 పరుగులు చేసింది. క్రీజులో రోహిత్‌ శర్మ(30), శుబ్‌మన్‌ గిల్‌(33) పరుగులతో ఉన్నారు.

రాణించిన ఆసీస్‌ బ్యాటర్లు.. భారత్‌ టార్గెట్‌ 270 పరుగులు
టాస్‌ గెలిచి తొలుత బ్యాటింగ్‌ చేసిన ఆస్ట్రేలియా 49 ఓవర్లలో 269 పరుగులకు ఆలౌటైంది. ఆసీస్‌ బ్యాటర్లలో మిచెల్‌ మార్ష్‌(47), కారీ(38), హెడ్‌(33) పరుగులతో రాణించారు. ఇక భారత బౌలర్లలో హార్దిక్‌ పాండ్యా, కుల్దీప్‌ యాదవ్‌ చెరో మూడు వికెట్లు సాధించగా..అక్షర్‌ పటేల్‌, సిరాజ్‌ తలా రెండు వికెట్లు పడగొట్టారు.

43 ఓవర్లకు ఆసీస్‌ స్కోర్‌: 229/7
43 ఓవర్లు ముగిసే సరికి ఆస్ట్రేలియా 7 వికెట్లు కోల్పోయి 229 పరుగులు చేసింది.  క్రీజులో అగర్‌(8), అబాట్‌(18) పరుగులతో ఉన్నారు.

ఆరో వికెట్‌ కోల్పోయిన ఆసీస్‌
196 పరుగుల వద్ద ఆసీస్‌ ఆరో వికెట్‌ కోల్పోయింది. 25 పరుగులు చేసిన స్టోయినిష్‌.. అక్షర్‌ పటేల్‌ బౌలింగ్‌లో పెవిలియన్‌కు చేరాడు.

28.1: ఐదో వికెట్‌ కోల్పోయిన ఆస్ట్రేలియా
లబుషేన్‌ రూపంలో ఆసీస్‌ ఐదో వికెట్‌ కోల్పోయింది. కుల్దీప్‌ యాదవ్‌ బౌలింగ్‌లో గిల్‌కు క్యాచ్‌ ఇచ్చి లబుషేన్‌(28) పెవిలియన్‌ చేరాడు. ఆసీస్‌ స్కోరు: 138/5 (28.1). స్టొయినిస్‌, క్యారీ క్రీజులో ఉన్నారు.

26 ఓవర్లలో ఆసీస్‌ స్కోరు:  128-4

నాలుగో వికెట్‌ డౌన్‌
24.3:
కుల్దీప్‌ యాదవ్‌ బౌలింగ్‌లో ఆసీస్‌ స్టార్‌ డేవిడ్‌ వార్నర్‌ అవుటయ్యాడు. 31 బంతులు ఎదుర్కొన్న అతడు 23 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద హార్దిక్‌ పాండ్యాకు క్యాచ్‌ ఇచ్చి నిష్క్రమించాడు. లబుషేన్‌, అలెక్స్‌ క్యారీ క్రీజులో ఉన్నారు.

వారెవ్వా హార్దిక్‌.. మార్ష్‌ క్లీన్‌ బౌల్డ్‌
ఆస్ట్రేలియాతో మూడో వన్డేలో టీమిండియా వైస్‌ కెప్టెన్‌ హార్దిక్‌ పాండ్యా అద్భుతంగా బౌలింగ్‌ చేస్తున్నాడు. 47 పరుగులతో దూకుడుగా ఆడుతోన్న మిచెల్‌ మార్ష్‌ను హార్దిక్‌ క్లీన్‌ బౌల్డ్‌ చేశాడు. ఇప్పటివరకు టీమిండియా సాధించిన మూడు వికెట్లు కూడా హార్దిక్‌ పడగొట్టినవే కావడం గమనార్హం. 15 ఓవర్లకు ఆసీస్‌ స్కోర్‌: 87/3

రెండో వికెట్‌ కోల్పోయిన ఆసీస్‌..
ఆస్ట్రేలియా రెండో వికెట్‌ కోల్పోయింది. హార్దిక్‌ పాండ్యా బౌలింగ్‌లో.. ఆసీస్‌ కెప్టెన్‌ స్టీవ్‌ స్మిత్‌ డకౌట్‌గా వెనుదిరిగాడు. క్రీజులోకి డేవిడ్‌ వార్నర్‌ వచ్చాడు.

తొలి వికెట్‌ కోల్పోయిన ఆసీస్‌.. హెడ్‌ ఔట్‌
68 పరుగుల వద్ద ఆస్ట్రేలియా తొలి వికెట్‌ కోల్పోయింది.  33 పరుగులు చేసిన ట్రావిస్‌ హెడ్‌.. హార్దిక్‌ పాండ్యా బౌలింగ్‌లో పెవిలియన్‌కు చేరాడు. క్రీజులోకి స్మిత్‌ వచ్చాడు.

5 ఓవర్లలో ఆస్ట్రేలియా స్కోరు: 39/0
రెండు ఓవర్లు ముగిసే సరికి ఆస్ట్రేలియా వికెట్‌ నష్టపోకుండా 13 పరుగులు చేసింది. క్రీజులో మార్ష్‌(9), హెడ్‌(4) పరుగులతో ఉన్నారు.

చెపాక్‌ వేదికగా సిరీస్‌ను డిసైడ్‌ చేసే మూడో వన్డేలో తలపడేందుకు భారత్‌- ఆస్ట్రేలియా జట్లు సిద్దమయ్యాయి. ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన ఆస్ట్రేలియా తొలుత బ్యాటింగ్‌ ఎంచుకుంది. ఈ మ్యాచ్‌లో టీమిండియా ఎటువంటి మార్పులు లేకుండా బరిలోకి దిగింది. చెన్నై లోకల్‌ బాయ్‌ వాషింగ్టన్‌ సుందర్‌కు ఈ మ్యాచ్‌లో కూడా చోటు దక్కలేదు

ఇక ఆస్ట్రేలియా మాత్రం రెండు మార్పులు చేసింది. తొలి రెండు వన్డేలకు దూరంగా ఉన్న ఆసీస్‌ స్టార్‌ ఓపెనర్‌ డేవిడ్‌ వార్నర్‌.. ఈ మ్యాచ్‌కు జట్టులోకి వచ్చాడు. అదే విధంగా స్పిన్నర్‌ అగర్‌కు కూడా తుది జట్టు చోటు దక్కింది. 

తుది జట్లు
భారత్‌: రోహిత్ శర్మ (కెప్టెన్‌), శుభమన్ గిల్, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, కెఎల్ రాహుల్ (వికెట్‌ కీపర్‌), హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్

ఆస్ట్రేలియా:
డేవిడ్ వార్నర్, ట్రావిస్ హెడ్, మిచెల్ మార్ష్, స్టీవెన్ స్మిత్(కెప్టెన్‌), మార్నస్ లాబుషేన్‌, అలెక్స్ కారీ(వికెట్‌ కీపర్‌), మార్కస్ స్టోయినిస్, అష్టన్ అగర్, సీన్ అబాట్, మిచెల్ స్టార్క్, ఆడమ్ జంపా

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement