పుజారాను వాడేదెలా? | Cheteshwar Pujara in, Raina dumped from Indian ODI side | Sakshi
Sakshi News home page

పుజారాను వాడేదెలా?

Published Sat, Feb 22 2014 12:09 AM | Last Updated on Sat, Sep 2 2017 3:57 AM

పుజారాను వాడేదెలా?

పుజారాను వాడేదెలా?

ఇటీవలి కాలంలో విదేశాల్లో భారత్ ఎప్పుడు వన్డే సిరీస్ ఓడిపోయినా... అందరికీ వెంటనే పుజారా గుర్తొస్తున్నాడు. బౌన్సీ వికెట్లపై టాప్ ఆర్డర్‌లో సాంకేతికంగా ఉన్నతంగా ఆడే క్రికెటర్ అవసరమనే వ్యాఖ్య వినిపిస్తోంది.

 వన్డేల్లో టాప్ ఆర్డర్ కిటకిట
 కానీ ప్రపంచకప్‌కు అవసరం
 చతేశ్వర్ కోసం త్యాగం చేసేదెవరు?
 
 రాహుల్ ద్రవిడ్ తర్వాత అదే స్థాయిలో సాంకేతికంగా ఉన్నతంగా ఆడే ఆటగాడు పుజారా. అందుకే టెస్టుల్లో ద్రవిడ్ రిటైర్‌మెంట్ లోటు కనపడలేదు.
 
 కానీ వన్డేలకు వచ్చే సరికి పుజారా శైలి భారత జట్టుకు సరిపోదనేది సెలక్టర్ల భావన. కానీ న్యూజిలాండ్‌లో వన్డేల్లో ధోనిసేన ఆట చూసిన తర్వాత... ప్రపంచకప్ నిలబెట్టుకోవాలంటే జట్టులో మార్పులు కావాలని అర్థమైంది. దీంతో ఆసియాకప్ కోసం పుజారాను జట్టులోకి ఎంపిక చేశారు. కానీ తనని ఏ స్థానంలో ఆడిస్తారనేదే పెద్ద ప్రశ్న.
 
 సాక్షి క్రీడావిభాగం
 ఇటీవలి కాలంలో విదేశాల్లో భారత్ ఎప్పుడు వన్డే సిరీస్ ఓడిపోయినా... అందరికీ వెంటనే పుజారా గుర్తొస్తున్నాడు. బౌన్సీ వికెట్లపై టాప్ ఆర్డర్‌లో సాంకేతికంగా ఉన్నతంగా ఆడే క్రికెటర్ అవసరమనే వ్యాఖ్య వినిపిస్తోంది. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌లలో వచ్చే ఏడాది ప్రపంచకప్ జరగనుంది. ధోనిసేన ఇందులో డిఫెండింగ్ చాంపియన్‌గా బరిలోకి దిగుతుంది. ఈ నేపథ్యంలో టైటిల్‌ను నిలబెట్టుకోవాలంటే బౌన్సీ వికెట్లపై నిలకడగా ఆడగల టాప్‌ఆర్డర్ బ్యాట్స్‌మన్ కావాలి. కాబట్టి పుజారా పేరు మళ్లీ తెరమీదకు వచ్చింది. బంగ్లాదేశ్‌లో జరిగే ఆసియాకప్ కోసం ఎంపిక చేసిన భారత జట్టులో చతేశ్వర్‌కు స్థానం దక్కింది.
 
  ఆడింది రెండు వన్డేలే...
 కెరీర్ ఆరంభం నుంచి పుజారాకు టెస్టుల్లో స్థానం విషయంలో ఢోకా లేదు. కానీ వన్డేల దగ్గరకు వచ్చేసరికి తనని పట్టించుకోవడం లేదు. గతంలో ఒకట్రెండు సిరీస్‌లకు ఎంపిక చేసినా బెంచ్‌కు పరిమితం చేశారు. ధోనితో పాటు కొందరు కీలక ఆటగాళ్లు గత ఏడాది జింబాబ్వే పర్యటనకు వెళ్లకుండా విశ్రాంతి తీసుకున్నారు. దీంతో ఆ సిరీస్‌లో పుజారాకు రెండు వన్డేలు ఆడే అవకాశం వచ్చింది. అయితే రెండు మ్యాచ్‌ల్లో కలిపి కేవలం 13 పరుగులు మాత్రమే చేశాడు. దీంతో ఆ తర్వాత అవకాశం రాలేదు. దేశవాళీ క్రికెట్‌లో సుమారు 55 సగటుతో పరుగుల వరద పారించినా... భారత వన్డే జట్టులో స్థానం సుస్థిరం చేసుకోలేకపోయాడు. అయితే న్యూజిలాండ్‌లో భారత జట్టు ఒక్క వన్డే కూడా గెలవకపోవడంతో పుజారా గురించి మళ్లీ సెలక్టర్లు ఆలోచించారు.
 
  ఆసియాకప్‌లో ఆడిస్తారా?
 ప్రస్తుతం భారత తుది జట్టును పరిశీలిస్తే ఎక్కడా ఖాళీ కనిపించడం లేదు. ఓపెనర్లుగా ధావన్, రోహిత్... ఫస్ట్‌డౌన్‌లో కోహ్లి... ఆ తర్వాత రహానే, దినేశ్ కార్తీక్, రాయుడులతో ఆరు స్లాట్లు నిండిపోయాయి. ఒకవేళ పుజారాను పరీక్షించాలనుకుంటే రాయుడు, రహానేలలో ఒకరిని ఆపి పుజారాను తుది జట్టులోకి తేవాలి. ఒకవేళ తెచ్చినా కోహ్లి కాస్త వెనక్కి జరిగి మూడో స్థానంలో ఆడించాలి. ఇప్పుడు కెప్టెన్ కూడా అయిన విరాట్... ఈ మేరకు మార్పులు చేసుకుని పుజారాకు అవకాశం ఇస్తాడో లేదో చూడాలి.
 
  నెమ్మదిగా ఆడటం ప్రతికూలం
 వన్డేల్లో పుజారాకు సెలక్టర్లు స్థానం కల్పించడానికి కూడా కారణం ఉంది. తన బ్యాటింగ్ శైలి ప్రకారం కాస్త నెమ్మదిగా పరుగులు చేస్తాడు. ముఖ్యంగా స్లాగ్ ఓవర్లలో వేగంగా ఆడలేదు. అయితే ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ గడ్డలపై వేగం కంటే టెక్నిక్ ముఖ్యం. గతంలో ద్రవిడ్, లక్ష్మణ్ వన్డేల్లో ఇది నిరూపించారు. అయితే పుజారాను జట్టులోకి తీసుకుంటే టాప్ ఆర్డర్‌లోనే ఆడించాలి.
 
 కనీసం 10 నుంచి 35 ఓవర్ల మధ్యలో తను క్రీజులో ఉంటే సింగిల్స్ బాగా వస్తాయి. వికెట్లు కాపాడుకోవచ్చు. అంటే తనని టాప్ ఆర్డర్‌లో ఆడించాలి. ఓపెనర్లుగా ధావన్, రోహిత్... ఫస్ట్‌డౌన్‌లో కోహ్లి. ఈ ముగ్గురూ నిలకడగానే ఆడుతున్నారు. కాబట్టి పూజారాను టాప్ ఆర్డర్‌లో ఆడించలేరు. ఇక నాలుగో స్థానంలో రహానే కుదురుకుంటున్నాడు. ఇంతకు మించి ఆలస్యంగా బ్యాటింగ్‌కు వచ్చిన పుజారా వల్ల జట్టుకు పెద్దగా ప్రయోజనం ఉండదు. కాబట్టి మూడు లేదా నాలుగో స్థానాల్లో ఆడించాలి.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement