సాక్షి, విశాఖపట్నం : ఇక్కడ వెస్టిండీస్‌తో జరుగుతున్న రెండో వన్డేలో భారత్‌కు ఆదిలోనే ఎదురు దెబ్బ తగిలింది. తొలి మ్యాచ్‌లో సెంచరీతో ఆకట్టుకున్న ఓపెనర్ రోహిత్ శర్మ(4) క్యాచ్ ఔట్‌గా వెనుదిరిగి నిరాశ పరిచాడు. అనంతరం క్రీజులోకి వచ్చిన కెప్టెన్ విరాట్ కోహ్లి మరో ఓపెనర్ శిఖర్ ధావన్‌తో కలిసి ఆచితూచి ఆడుతున్నాడు. ఇక అంతకు ముందు టాస్ గెలిచిన భారత్ బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్‌లో ముగ్గురు స్పిన్నర్లకు కెప్టెన్ కోహ్లి మొగ్గు చూపడంతో పేసర్ కలీల్ అహ్మద్ స్థానంలో కుల్దీప్ తుది జట్టులోకి వచ్చాడు.
ఐదు వన్డేల సీరిస్‌లో ఇప్పటికే కోహ్లి సేన తొలి వన్డేలో ఘన విజయం సాధించి 1-0 ఆధిక్యంలో నిలిచిన విషయం తెలిసిందే. అదే ఊపుతో అచ్చొచ్చిన వైజాగ్‌లో మరో విజయం నమోదు చేయాలని ఉవ్విళ్లురుతోంది. కాగా తొలి మ్యాచ్‌లో భారీ స్కోర్ సాధించి విజయం చేజార్చుకున్న విండీస్ ఈ మ్యాచ్‌లో ఎలాగైనా విజయం సాధించాలనే పట్టుదలతో ఉంది. వైజాగ్‌లో భారత్‌కు మంచి రికార్డు ఉంది. ఇప్పటి వరకు ఇక్కడ జరిగిన 7 వన్డేల్లో భారత్ కేవలం ఒక్కటి మాత్రమే ఓడి 6 గెలిచింది. అయితే ఆ ఒక్క ఓటమి కూడా విండీస్‌పైనే కావడం భారత్‌కు ప్రతికూలాంశం. ఇప్పటి వరకు ఇక్కడ టాస్ గెలిచిన జట్లే ప్రతీ సారి విజయం సాధించాయి. దీంతో భారత్‌కు మరో విజయం కాయమని అభిమానులు భావిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment