వచ్చే ఏడాది జనవరిలో ఐదు మ్యాచ్‌ల వన్డే సిరీస్ కోసం భారత జట్టు ఆస్ట్రేలియాలో పర్యటించనుంది.
మెల్‌బోర్న్: వచ్చే ఏడాది జనవరిలో ఐదు మ్యాచ్‌ల వన్డే సిరీస్ కోసం భారత జట్టు ఆస్ట్రేలియాలో పర్యటించనుంది. మూడు వారాల పాటు జరగనున్న ఈ టూర్‌లో మూడు టి20 మ్యాచ్‌లు కూడా ఆడనుంది. ఇక నుంచి కొత్త ద్వైపాక్షిక ఒప్పందం ప్రకారం టెస్టులకు, వన్డేలకు టీమిండియా ప్రత్యేకంగా ఇక్కడికి రానుంది. ఐదు వన్డేలకు పెర్త్ (జనవరి 12న), బ్రిస్బేన్ (15న), మెల్‌బోర్న్ (17న), కాన్‌బెర్రా (20న), సిడ్నీ (23న)ఆతిథ్యమివ్వనున్నాయి. అడిలైడ్ (26న), మెల్‌బోర్న్ (29న), సిడ్నీ (31)ల్లో మూడు టి20 మ్యాచ్‌లు జరుగుతాయి.
వార్మప్ మ్యాచ్‌తో లంక టూర్ మొదలు: వచ్చే నెలలో జరగనున్న లంక పర్యటనలో భారత్ ఓ వార్మప్ మ్యాచ్ ఆడనుంది. ఆగస్టు 6న ప్రేమదాస స్టేడియంలో శ్రీలంక చైర్మన్స్ ఎలెవన్‌తో టీమిండియా తలపడనుంది. ఇక ఆగస్టు 12 నుంచి 16 వరకు గాలెలో తొలి టెస్టు; 20 నుంచి 24 వరకు కొలంబోలో రెండో టెస్టు; 28 నుంచి సెప్టెంబర్ 1 వరకు పల్లెకెలెలో మూడో టెస్టు జరుగుతాయి.