
బంగ్లాకు బయలుదేరిన భారత జట్టు
మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్ కోసం భారత జట్టు శుక్రవారం బంగ్లాదేశ్‌కు బయలుదేరి వెళ్లింది. 15 మంది సభ్యుల జట్టుకు సురేశ్ రైనా నాయకత్వం వహిస్తున్నాడు.
కోల్‌కతా: మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్ కోసం భారత జట్టు శుక్రవారం బంగ్లాదేశ్‌కు బయలుదేరి వెళ్లింది. 15 మంది సభ్యుల జట్టుకు సురేశ్ రైనా నాయకత్వం వహిస్తున్నాడు. ధోని, రోహిత్, కోహ్లిలకు విశ్రాంతి ఇవ్వడంతో రైనాకు జట్టు పగ్గాలు అప్పగించారు.
కొంత మంది జట్టు సభ్యులు గురువారం సాయంత్రమే కోల్‌కతా చేరుకున్నారని జట్టు మేనేజర్ సత్య ప్రసాద్ యాచింద్ర తెలిపారు. భారత్, బంగ్లాల మధ్య ఈనెల 15, 17, 19న మూడు మ్యాచ్‌లు జరగనున్నాయి.