
ఎన్‌ఏడీ జంక్షన్(విశాఖ పశ్చిమ) : వైఎస్సార్ స్టేడియంలో బుధవారం జరగనున్న రెండో వన్డేలో ఆడే భారత, వెస్టిండీస్ జట్లు సోమవారం విశాఖ చేరుకున్నాయి. కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్ల నడుమ రెండు జట్ల ఆటగాళ్లు విశాఖ విమానాశ్రయంలో అడుగు పెట్టారు. తమ అభిమాన క్రికెటర్లను చూడడానికి అభిమానులు పెద్ద ఎత్తున విమానాశ్రయానికి తరలివచ్చారు. విమానాశ్రయం నుంచి బస్సు వద్దకు చేరుకున్న భారత క్రికెటర్లను చూసి కేరింతలు కొట్టారు. వారిని సెల్‌ఫోన్లతో ఫొటోలు తీసి ఉత్సాహపడ్డారు. ప్రత్యేకించి కోహ్లీ, ధోనీ, రోహిత్ శర్మ తదితరులు కనిపించినప్పుడు అభిమానులు తెగ సందడి చేశారు. అనంతరం టీమిండియా ఆటగాళ్లు నోవాటెల్ హోటల్‌కు, వెస్టిండీస్ ఆటగాళ్లు ఫోర్ పాయింట్ హోటల్‌కు వేరువేరు బస్సుల్లో చేరుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment