తొలిసారి వైట్వాష్.. | Hales, Root hundreds set England up for 186-run rout | Sakshi
Sakshi News home page

తొలిసారి వైట్వాష్..

Published Fri, Mar 10 2017 12:27 PM | Last Updated on Tue, Sep 5 2017 5:44 AM

తొలిసారి వైట్వాష్..

తొలిసారి వైట్వాష్..

బార్బోడాస్: ఇంగ్లండ్ తో స్వదేశంలో జరిగిన మూడు వన్డేల సిరీస్ లో వెస్టిండీస్ వైట్ వాష్ అయ్యింది. గురువారం జరిగిన చివరిదైన మూడో వన్డేలో వెస్టిండీస్ 186 పరుగుల తేడాతో ఘోర ఓటమి పాలైంది.దాంతో సిరీస్ ను విండీస్ 0-3 తో కోల్పోయింది. ఈ మ్యాచ్ లో ఇంగ్లండ్ నిర్దేశించిన 329 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో విండీస్ 39.2 ఓవర్లలో142 పరుగులకే చాపచుట్టేసి భారీ ఓటమిని మూటగట్టుకుంది.విండీస్ ఆటగాళ్లలో కార్టర్(46) మినహా ఎవరూ రాణించకపోవడంతో ఆ జట్టుకు దారుణమైన ఓటమి ఎదురైంది.

 

ఈ క్రమంలోనే ఇంగ్లండ్ వన్డే చరిత్రలో ఐదో 'అతి పెద్ద' విజయాన్ని నమోదు చేసుకుంది. వన్డే క్రికెట్ లో ఇంగ్లండ్ పై స్వదేశంలో కరీబియన్లు వైట్ వాష్ కావడం ఇదే తొలిసారి. అంతకుముందెన్నడూ స్వదేశంలో వెస్టిండీస్ జట్టు ఇంతటి దారుణమైన ఓటమిని మూటగట్టుకోలేదు. తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ 50.0 ఓవర్లలో 328 పరుగులు చేసింది. ఇంగ్లండ్ ఆటగాళ్లు జో రూట్(101), హేల్స్(110)లు శతకాలు సాధించి భారీ స్కోరు సాధించడంలో సహకరించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement