
పాకిస్తాన్‌దే వన్డే సిరీస్
వెస్టిండీస్‌తో జరుగుతున్న వన్డే సిరీస్‌లోనూ పాకిస్తాన్ జోరు కొనసాగిస్తోంది. ఇప్పటికే మూడు టి20ల సిరీస్‌ను క్లీన్‌స్వీప్ చేసిన...
షార్జా: వెస్టిండీస్‌తో జరుగుతున్న వన్డే సిరీస్‌లోనూ పాకిస్తాన్ జోరు కొనసాగిస్తోంది. ఇప్పటికే మూడు టి20ల సిరీస్‌ను క్లీన్‌స్వీప్ చేసిన ఈ జట్టు ఇప్పుడు మూడు వన్డేల సిరీస్‌ను కూడా 2-0తో దక్కించుకుంది. రేపు (బుధవారం) అబుదాబిలో నామమాత్రమైన చివరి వన్డే జరుగుతుంది. వన్‌డౌన్ బ్యాట్స్‌మన్ బాబర్ ఆజమ్ (126 బంతుల్లో 123; 9 ఫోర్లు, 1 సిక్స్) వరుసగా రెండో సెంచరీతో అదరగొట్టగా... ఆదివారం జరిగిన రెండో వన్డేలో పాక్ 59 పరుగుల తేడాతో నెగ్గింది. షోయబ్ మాలిక్ (84 బంతుల్లో 90; 3 ఫోర్లు, 6 సిక్సర్లు), సర్ఫరాజ్ అహ్మద్ (47 బంతుల్లో 60 నాటౌట్; 7 ఫోర్లు) మెరుపు ఆటతీరుతో ముందుగా బ్యాటింగ్‌కు దిగిన పాక్ 50 ఓవర్లలో ఐదు వికెట్లకు 337 పరుగులు చేసింది.
విండీస్ 50 ఓవర్లలో ఏడు వికెట్లకు 278 పరుగులు చేసి ఓడింది. డారెన్ బ్రేవో (74 బంతుల్లో 61; 5 ఫోర్లు, 3 సిక్సర్లు), మార్లన్ శామ్యూల్స్ (52 బంతుల్లో 57; 4 ఫోర్లు, 2 సిక్సర్లు) మాత్రమే ఆకట్టుకున్నారు. రియాజ్‌కు రెండు వికెట్లు దక్కాయి.