స్వదేశంలో ఇంగ్లండ్‌తో జరిగిన వన్డే సిరీస్‌లో బంగ్లాదేశ్‌కు ఓదార్పు విజయం లభించింది. ఛటోగ్రామ్ వేదికగా ఇంగ్లండ్‌తో జరిగిన మూడో వన్డేలో 50 పరుగుల తేడాతో బంగ్లాదేశ్ ఘన విజయం సాధించింది. తద్వారా వైట్‌వాష్ నుంచి బంగ్లా తప్పించుకుంది. 247 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లండ్ 43.1 ఓవర్లలో కేవలం 196 పరుగులకే కుప్పకూలింది. బంగ్లాదేశ్ బౌలర్లలో షకీబ్ 4 వికెట్లతో ఇంగ్లండ్ పతనాన్ని శాసించగా.. తైజుల్ ఇస్లాం, ఎబాడోత్ హుస్సేన్ చెరో రెండు వికెట్లు సాధించారు.
ఇంగ్లండ్ బ్యాటర్లలో జేమ్స్ విన్స్(38) పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ఇక తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ 48.5 ఓవర్లలో 246 పరుగులకు ఆలౌటైంది. బంగ్లా బ్యాటర్లలో షకీబ్ అల్‌హసన్(75), రహీం(70), షాంటో హాఫ్ సెంచరీలతో రాణించారు. ఇంగ్లండ్ బౌలర్లలో జోఫ్రా అర్చర్ మూడు వికెట్లు, సామ్ కుర్రాన్, రషీద్ తలా రెండు వికెట్లు సాధించారు.
ఇక తొలి రెండు మ్యాచ్‌ల్లో విజయం సాధించిన ఇంగ్లండ్.. మూడు వన్డేల సిరీస్‌ను 2-1 తేడాతో సొంతం చేసుకుంది. కాగా ఆల్‌రౌండ్ షోతో అదరగొట్టిన షకీబ్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా ఎంపికవ్వగా.. ఈ సిరీస్ అసాంతం అద్భుతంగా రాణించిన ఇంగ్లండ్ స్పిన్నర్ అదిల్ రషీద్‌కు ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డు వరించింది.
చదవండి: SA vs WI: దక్షిణాఫ్రికా కొత్త కెప్టెన్‌గా స్టార్ క్రికెటర్.. బవుమాపై వేటు!
Comments
Please login to add a commentAdd a comment