పాక్కు మరో ఘోర పరాభవం తప్పదా! | Pakistan will win today otherwise it is third whitewash | Sakshi
Sakshi News home page

పాక్కు మరో ఘోర పరాభవం తప్పదా!

Published Sun, Sep 4 2016 2:28 PM | Last Updated on Mon, Sep 4 2017 12:18 PM

పాక్కు మరో ఘోర పరాభవం తప్పదా!

పాక్కు మరో ఘోర పరాభవం తప్పదా!

ఇంగ్లండ్ పర్యటనలో భాగంగా టెస్టుల్లో ఆతిథ్య జట్టుకు ధీటుగా జవాబిచ్చిన పాకిస్తాన్ వన్డే సిరీస్ లో మాత్రం ఘోర వైఫల్యాలను చవిచూస్తోంది.

ఇంగ్లండ్ పర్యటనలో భాగంగా టెస్టుల్లో ఆతిథ్య జట్టుకు ధీటుగా జవాబిచ్చిన పాకిస్తాన్ వన్డే సిరీస్ లో మాత్రం ఘోర వైఫల్యాలను చవిచూస్తోంది. టెస్ట్ సిరీస్ 2-2తో సమమైన విషయం తెలిసిందే. అయితే వన్డేల్లో వరుస ఓటములతో పాక్ రోజురోజుకు దిగజారిపోతోంది. నేడు(ఆదివారం) ఇంగ్లండ్, పాక్ మధ్య ఐదో వన్డే కార్డిఫ్ లో జరగనుంది. అయితే ఇప్పటికే ఐదు వన్డేల సిరీస్ను 4-0 తో కోల్పోయిన పాక్ కనీసం చివరి వన్డేలోనైనా నెగ్గి పరువు నిలుపుకోవాలని భావిస్తోంది.

ప్రతి వన్డేలోనూ ఇంగ్లండ్ ఆటగాళ్లు చెలరేగి ఆడుతుండటంతో వరుస విజయాలతో ఆతిథ్య జట్టు ముందుకెళ్తుంటే పాక్ మాత్రం ఆటతీరును మెరుగు పరుచుకోవడం లేదు. ఒకవేళ ఈ చివరి వన్డేలోనూ ఓటమిపాలైనతే ఐదు వన్డేల సిరీస్లో పాక్ జట్టుకు ఇది మూడో వైట్ వాష్ అవుతుంది. పాక్ వన్డే చరిత్రలో ఐదు వన్డేల సిరీస్లో రెండు జట్లు పాక్ను క్లీన్ స్వీప్ చేశాయి. 1988లో వెస్టిండీస్ చేతిలో తొలిసారి, ఆస్ట్రేలియా చేతిలో 2010లో ఒకసారి పాక్ వైట్ వాష్ కు గురైంది. నేటి వన్డేలో గెలవని పక్షంలో పాక్ జట్టు వన్డే చరిత్రలో మూడోసారి ఘోర పరాభవాన్ని చవిచూడక తప్పదు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement