సఫారీలకు ఇంగ్లండ్ షాక్ | morgan century helps handsome victory against south africa | Sakshi
Sakshi News home page

సఫారీలకు ఇంగ్లండ్ షాక్

Published Thu, May 25 2017 11:41 AM | Last Updated on Tue, Sep 5 2017 11:59 AM

సఫారీలకు ఇంగ్లండ్ షాక్

సఫారీలకు ఇంగ్లండ్ షాక్

హెడింగ్లీ: మూడు వన్డేల సిరీస్ లో దక్షిణాఫ్రికాకు ఇంగ్లండ్ షాకిచ్చింది. బుధవారం రాత్రి ఇక్కడ జరిగిన తొలి వన్డేలో ఇంగ్లండ్ 72 పరుగుల తేడాతో అద్భుతమైన విజయాన్ని సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ 340 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. ఇంగ్లండ్ ఓపెనర్ అలెక్స్ హేల్స్(61) మంచి ఆరంభానివ్వగా, జో రూట్(37) ఫర్వాలేదనిపించాడు. ఆ తరువాత కెప్టెన్ ఇయాన్ మోర్గాన్(107;93 బంతుల్లో 7 ఫోర్లు, 5 సిక్సర్లు) శతకంతో మెరిసి ఇంగ్లండ్ భారీ స్కోరుకు పునాది వేశాడు. ఇక చివర్లో మొయిన్ అలీ (77 నాటౌట్; 51 బంతుల్లో 5 ఫోర్లు, 5 సిక్సర్లు) బ్యాట్ ఝుళిపించడంతో ఇంగ్లండ్ నిర్ణీత ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 339 పరుగుల భారీ స్కోరు చేసింది.

అనంతరం బ్యాటింగ్ కు దిగిన దక్షిణాఫ్రికా 45 ఓవర్లలో 267 పరుగులకు ఆలౌటై ఓటమి పాలైంది. హషీమ్ ఆమ్లా (73),  డు ప్లెసిస్(67), ఏబీ డివిలియర్స్(45)లు రాణించినా జట్టుకు గెలిపించలేకపోయారు. వీరి మినహా మిగిలిన బ్యాటింగ్ ఆర్డర్ తీవ్రంగా నిరాశపరచడంతో సఫారీలకు ఓటమి తప్పలేదు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement