పాక్ చిత్తు: ఆసీస్‌దే వన్డే సిరీస్
సిడ్నీ: నిలకడ లేమితో సతమతమవుతోన్న పాకిస్థాన్ వన్డే సిరీస్‌ను కూడా ఆతిథ్య ఆస్ట్రేలియాకు సమర్పించుకుంది. సిడ్నీ వేదికగా ఆదివారం జరిగిన నాలుగో వన్డే మ్యాచ్‌లో పాక్ 86 పరుగుల తేడాతో ఆసీస్ చేతిలో ఓటమిపాలైంది. తద్వారా ఇంకో మ్యాచ్ మిగిలి ఉండగానే 1-3 తేడాతో సిరీస్ కోల్పోయింది. ఆసీస్ విసిరిన 354 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేధించేందుకు బరిలోదిగిన పాక్ 43.5ఓవర్లలో 267 పరుగులకే కుప్పకూలింది.
రెండో ఓవర్‌లోనే ఓపెనర్ అజార్ అలీ(7)ని కోల్పోయింది. మరో ఓపెనర్ షర్జీల్ ఖాన్ (74) నిలకడగా ఆడేప్రయత్నం చేశాడు. అతనికి బాబర్ ఖాన్(32), మొహమ్మద్ హఫీజ్(40), షోయబ్ మాలిక్(47)లు చక్కని తోడ్పాటు అందించారు. ఒక దశలో 183/3 స్కోరుతో పాక్ గట్టిపోటీ ఇచ్చినప్పటికీ మిడిల్ ఆర్డర్ విఫలం చెందడంతో 43.5 ఓవర్లలో 267 పరుగులకు ఆలౌట్ అయింది. ఆసీస్ బౌలర్లలో హాజిల్‌వుడ్, జంపాలు చెరో 3 వికెట్లు తీశారు. హెడ్‌క 2, స్టాక్స్ ఒక వికెట్ నేలకూల్చారు.
టాస్ నెగ్గి తొలుత బ్యాటింగ్‌కు దిగిన ఆస్ట్రేలియా.. డాషింగ్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ (119 బందుల్లో 130 పరుగులు, 11ఫోర్లు, 2సిక్సర్లు) విజృంభణతో 353 పరుగుల భారీ స్కోరు సాధించింది. మ్యాక్స్‌వెల్(78), స్టీవ్ స్మిత్(49), హెడ్(51), ఖవాజా(30) తమదైన శైలిలో పరుగులు రాబట్టారు. పాక్ బౌలర్లలో హసన్ అలీ 5 వికెట్లు పడగొట్టగా, ఆమిర్‌కు ఒక్క వికెట్ దక్కింది. వీరవిహారం చేసిన వార్నర్‌కే మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు దక్కింది.
ఇప్పటికే మూడు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌ను కోల్పోయిన పాక్, ఇప్పుడు వన్‌డేల్లోనూ ఓటమి చెందడంతో అభిమానులు అసంతృప్తికి గురయ్యారు. పాక్ టీం ప్రదర్శనపై ఇంటా, బయటా విమర్శలు చెలరేగుతున్నాయి. అయితే పాక్ చీఫ్ సెలెక్టర్ ఇంజమామ్ ఉల్ హక్ మాత్రం జట్టును వెనకేసుకొచ్చారు. తీరికలేని షెడ్యూల్ వల్లే తమ ఆటగాళ్లు అలిసిపోయారని ఇంజీ వ్యాఖ్యానించాడు.