కుల్దీప్ యాదవ్
నాటింగ్‌హామ్: భారత చైనామన్ బౌలర్ కుల్దీప్ యాదవ్ ఇంగ్లండ్‌తో తొలి వన్డేలో ఆరు వికెట్లు తీసి ఆకట్టుకున్నాడు. ఇంగ్లండ్ బ్యాట్స్‌మెన్‌కు కొరకరాని కొయ్యగా మిగిలిన కుల్దీప్(6/25) ఆతిథ్య జట్టును మరోసారి దెబ్బతీశాడు. ట్రెంట్‌బ్రిడ్జ్ మైదానంలో అదరగొట్టిన ఈ లెఫ్టార్మ్ స్పిన్నర్ పలు రికార్డులు తన పేరిట లిఖించుకున్నాడు. వన్డేల్లో ఒక ఇన్నింగ్స్‌లో అత్యధిక వికెట్లు తీసిన లెఫ్టార్మ్ స్పిన్నర్‌గా కుల్దీప్ సరికొత్త రికార్డు సృష్టించాడు.
వన్డేల్లో ఇంగ్లండ్‌పై అత్యుత్తమ గణాంకాలు నమోదు చేసిన స్పిన్నర్‌గానూ అరుదైన ఘనత సాధించాడు. వన్డేలో బ్రిటీష్ పిచ్‌లపై ఒక ఇన్నింగ్స్‌లో అత్యధిక వికెట్లు తీసిన తొలి స్పిన్నర్‌గా కుల్దీప్ సరికొత్త రికార్డు లిఖించాడు. ఒక ఇన్నింగ్స్‌లో అత్యధిక వికెట్లు తీసిన ఆసీస్ చైనామన్ బౌలర్ బ్రాడ్ హాగ్ రికార్డును తిరగరాశాడు. టీమిండియా తరుపున బౌలింగ్‌లో అత్యుత్తమ గణాంకాలు నమోదు చేసిన నాలుగో బౌలర్‌గా మరో ఘనత సాధించాడు. గతంలో అనిల్ కుంబ్లే(6/12), అమిత్ మిశ్రా(6/48), మురళీ కార్తీక్(6/27)లు ఈ ఘనత సాధించారు. ఈ ఫీట్ సాధించచిన నలుగురు బౌలర్లు స్పిన్నర్లు కావడం విశేషం.
,
Comments
Please login to add a commentAdd a comment