Holkar Stadium
-
ఆస్ట్రేలియాతో రెండో వన్డే.. టీమిండియా ఫ్యాన్స్‌కు బ్యాడ్ న్యూస్!
వన్డే ప్రపంచకప్‌కు ఆస్ట్రేలియాతో జరగుతున్న వన్డే సిరీస్‌లో టీమిండియా బోణీ కొట్టింది. ఈ సిరీస్‌లో భాగంగా మొహాలీ వేదికగా జరిగిన తొలి వన్డేలో 5 వికెట్ల తేడాతో భారత్ ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో ఆల్‌రౌండ్ షోతో టీమిండియా అదరగొట్టింది. ఈ విజయంతో వన్డేల్లో నెం1 జట్టుగా భారత్ అవతరించింది. ఇక ఈ సిరీస్‌లో భాగంగా రెండో వన్డే ఆదివారం(సెప్టెంబర్ 24) ఇండోర్‌లోని హోల్కర్ క్రికెట్ స్టేడియంలో జరగనుంది. ఈ మ్యాచ్‌లో గెలిచి సిరీస్‌ను 2-0తో సొంతం చేసుకోవాలని భారత్ భావిస్తోంది. అయితే టీమిండియా ఆశలపై వరుణుడు నీళ్లు జల్లే అవకాశం ఉంది. ఈ మ్యాచ్ జరిగే సమయంలో ఉరుములు మెరుపులతో కూడిన వర్షం పడే ఛాన్స్ ఉందని అక్కడ వాతావరణ శాఖ వెల్లడించింది. ఆదివారం రోజు మొత్తం ఆకాశం మేఘావృతమై ఉంటుందని పలు నివేదికలు వెల్లడించాయి. తుది జట్లు(అంచనా) భారత్: శుభమన్ గిల్, రుతురాజ్ గైక్వాడ్, శ్రేయాస్ అయ్యర్, కేఎల్ రాహుల్(కెప్టెన్), ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్, రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్, ప్రసిద్ద్ కృష్ణ, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ షమీ ఆస్ట్రేలియా: డేవిడ్ వార్నర్, మిచెల్ మార్ష్, స్టీవెన్ స్మిత్, మార్నస్ లాబుషేన్, కామెరాన్ గ్రీన్, జోష్ ఇంగ్లిస్(వికెట్ కీపర్), మార్కస్ స్టోయినిస్, మాథ్యూ షార్ట్, పాట్ కమ్మిన్స్(కెప్టెన్), సీన్ అబాట్, ఆడమ్ జంపా చదవండి: ICC Rankings: చరిత్ర సృష్టించిన టీమిండియా.. ప్రపంచంలోనే రెండో జట్టుగా -
'ఇండోర్ పిచ్ అత్యంత నాసిరకం'
ఇండోర్ వేదికగా ముగిసిన మూడో టెస్టులో ఆస్ట్రేలియా టీమిండియాపై 9 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. కేవలం రెండున్నర రోజుల్లోనే ముగిసిన మ్యాచ్‌లో ఉపయోగించిన పిచ్‌పై అన్ని వైపుల నుంచి విమర్శలు వస్తున్నాయి. ఆది నుంచి స్పిన్నర్లకు అనుకూలించిన పిచ్‌పై 30 వికెట్లు కేవలం రెండురోజుల్లోనే కూలాయి. ఇందులో 26 వికెట్లు ఇరుజట్ల స్పిన్నర్లు తీయగా.. మిగతా నాలుగు వికెట్లు మాత్రమే పేసర్ల ఖాతాలోకి వెళ్లాయి. ఈ నేపథ్యంలో అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్(ఐసీసీ) ఇండోర్ పిచ్‌పై సీరియస్ అయింది. ఆస్ట్రేలియా, టీమిండియా మూడో టెస్టుకు ఉపయోగించిన ఇండోర్ పిచ్‌ను అత్యంత చెత్తదని ఐసీసీ పేర్కొంది. పిచ్‌ను మరి నాసిరకంగా తయారు చేశారని.. అందుకే హోల్కర్ స్టేడియానికి మూడు డీ-మెరిట్ పాయింట్లు విధిస్తున్నట్లు ఐసీసీ తెలిపింది. టెస్టుకు ఉపయోగించిన పిచ్‌పై ఐసీసీ పిచ్ అండ్ ఔట్‌ఫీల్డ్ మానిటరింగ్ ప్రక్రియ తర్వాత వచ్చిన ఫలితం ఆధారంగా ఐసీసీ ఈ నిర్ణయం తీసుకుంది. మ్యాచ్‌కు రిఫరీగా వ్యవహరించిన క్రిస్ బ్రాడ్ ఇరుజట్ల కెప్టెన్లు రోహిత్ శర్మ, స్టీవ్ స్మిత్‌లతో చర్చించిన తర్వాతే ఈ నిర్ణయం తీసుకుంది. ''పిచ్ చాలా డ్రైగా ఉంది. కనీసం బ్యాట్, బంతికి బ్యాలెన్స్ లేకుండా ఉంది. స్పిన్నర్లకు అనుకూలంగా ప్రారంభమయినప్పటికి క్రమంగా బౌన్స్ వస్తుందన్నారు. కానీ ఆ ప్రక్రియ మ్యాచ్‌లో ఎక్కడా జరగలేదు. ఎంతసేపు పిచ్ స్పిన్నర్లకు అనుకూలించిందే తప్ప సీమర్లకు కాస్త కూడా మేలు చేయలేదు. బంతి కనీసం బౌన్స్ కూడా కాలేదు. క్యురేటర్ పిచ్‌ను మరీ నాసిరకంగా తయారు చేశారు'' అంటూ రిఫరీ క్రిస్ బ్రాడ్ ఐసీసీకి సమర్పించిన నివేదికలో పేర్కొన్నారు. నివేదికను పరిశీలించిన ఐసీసీ పిచ్ అండ్ ఔట్‌ఫీల్డ్ మానిటరింగ్ ప్రాసెస్ ఇండోర్ పిచ్‌కు మూడు డీ-మెరిట్ పాయింట్లు కోత విధించింది. నివేదికను బీసీసీఐకి ఫార్వర్డ్ చేసింది. ఏమైనా అభ్యంతరాలు ఉంటే 14 రోజుల లోపు నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ అప్పీల్ చేసుకోవచ్చు. '' ఐదు అంతకంటే ఎక్కువ డీ-మెరిట్ పాయింట్లు వస్తే స్టేడియంపై నిషేధం పడుతుంది. కానీ నివేదిక ప్రకారం హోల్కర్ స్టేడియానికి మూడు డీ-మెరిట్ పాయింట్లు విధించాం. మరోసారి ఇలాంటి సీన్ రిపీట్ అయితే మాత్రం ఐదేళ్ల పాటు స్టేడియంపై నిషేధం పడే అవకాశం ఉందని'' ఐసీసీ ప్రతినిధి ఒకరు తెలిపారు. చదవండి: టీమిండియాకు సంకట స్థితి.. నాలుగో టెస్టు గెలిస్తేనే తప్పులే ఎక్కువగా.. ఎదురుదెబ్బ తగలాల్సిందే! -
ముచ్చటగా మూడో టెస్టు.. ఎన్ని రోజుల్లో ముగుస్తుందో?
ఇండోర్‌లో హోల్కర్ క్రికెట్ స్టేడియం వేదికగా టీమిండియా, ఆస్ట్రేలియా మధ్య మూడోటెస్టు బుధవారం మొదలుకానుంది. ఇప్పటికే నాలుగు టెస్టుల సిరీస్‌లో భాగంగా టీమిండియా 2-0తో ఆధిక్యంలో ఉంది. తొలి రెండు టెస్టులు యాదృశ్చికంగా రెండున్నర రోజుల్లోనే ముగియడం గమనార్హం. క్యురేటర్లు పూర్తిగా స్పిన్ పిచ్‌లను తయారు చేస్తూ బౌలర్లు.. బ్యాటర్లను ముప్పతిప్పలు పెట్టేలా చేస్తున్నారు. ఇక టీమిండియా స్పిన్నర్లు అశ్విన్, జడేజాలు వికెట్ల పండగ చేసుకుంటున్నారు. రెండు టెస్టుల్లోనూ ఘన విజయాలు సాధించిన టీమిండియా డబ్ల్యూటీసీ ఫైనల్ రేసుకు మరింత దగ్గరైంది. మూడో టెస్టులోనూ గెలిచి ఫైనల్ బెర్తును ఖరారు చేసుకోవాలని భారత్ ఉవ్విళ్లూరుతుంది. ఈ విషయం పక్కనబెడితే తొలి రెండు టెస్టుల్లో భారత స్పిన్నర్లకు అనుకూలంగా ఉన్న పిచ్‌లను తయారు చేశారంటూ ఆసీస్ బహిరంగంగా విమర్శలు చేసింది. అయితే ఉపఖండపు పిచ్‌లు మాములుగానే స్పిన్నర్లకు అనుకూలిస్తాయన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో టీమిండియా స్పిన్నర్లే కాదు ఆసీస్ స్పిన్నర్లు టాడ్ మర్ఫీ, నాథన్ లియోన్లు కూడా వికెట్ల తీశారు. ఇండోర్ పిచ్‌ను పరిశీలిస్తున్న స్టీవ్ స్మిత్ ఇక ఇండోర్ పిచ్ కూడా స్పిన్నర్లకు అనుకూలంగానే ఉంటుందని పిచ్ క్యూరేటర్ ఇప్పటికే వెల్లడించాడు. '' పిచ్‌పై కాస్త గడ్డి ఉండడంతో బ్యాటింగ్‌కు సహకరిస్తుంది. కాస్త భారీగానే పరుగులు వచ్చే అవకాశం ఉంది. అయితే గడ్డి పెరిగితే మాత్రం స్పిన్నర్లు పండగ చేసుకోవడం ఖాయం. సిరీస్‌లో తొలి రెండు టెస్టుల్లో భారీ స్కోర్లు నమోదు కాలేకపోయాయని.. కానీ ఇండోర్ టెస్టులో మాత్రం పరుగులు వచ్చే అవకాశం ఉంది. అయితే మ్యాచ్ ఐదు రోజులు కొనసాగితే చివరి రెండు రోజులు మాత్రం స్పిన్నర్లకు అనుకూలంగా ఉంటుంది అని వెల్లడించాడు. అయితే వ్యక్తిగత పని నిమిత్తం స్వదేశానికి తిరిగి వెళ్లిన ఆసీసీ కెప్టెన్ పాట్ కమిన్స్ ఇంకా తిరిగి రాకపోవడంతో స్టీవ్ స్మిత్ స్టాండిన్ కెప్టెన్‌గా వ్యవహరించనున్నట్లు సమాచారం. కాగా ఇండోర్ పిచ్‌ను స్మిత్ పరిశీలించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. తొలి టెస్టులో కూడా వార్నర్‌తో కలిసి స్మిత్ పిచ్‌ను పరిశీలించడంపై సోషల్ మీడియాలో విపరీతమైన మీమ్స్, ట్రోల్స్ వచ్చాయి. తొలి టెస్టు సందర్భంగా పిచ్‌ను పరిశీలించిన వార్నర్, స్మిత్ ఇక హోల్కర్ స్టేడియంలో 2019 డిసెంబర్లో చివరిసారి బంగ్లాదేశ్, టీమిండియా మధ్య టెస్టు మ్యాచ్ జరిగింది. ఆ మ్యాచ్‌లో టీమిండియా ఇన్నింగ్స్ 130 పరుగుల తేడాతో భారీ విజయం సాధించింది. ఇదే వేదికలో ఇటీవలే న్యూజిలాండ్‌తో వన్డే మ్యాచ్ జరగ్గా.. రోహిత్, గిల్లు శతకాలతో విరుచుకుపడడంతో టీమిండియా 90 పరుగులతో గెలుపొందింది. తుది జట్టు విషయానికి వస్తే.. కేఎల్ రాహుల్‌పై వేటు పడుతుందా లేక జట్టులో కొనసాగుతాడా అనేది ఆసక్తికరంగా మారింది. ఫామ్‌లేమితో సతమతమవుతున్న రాహుల్‌ను పక్కనబెట్టాలని పెద్ద ఎత్తున డిమాండ్స్ వస్తున్నాయి. దీంతో కేఎల్ రాహుల్ స్థానంలో శుబ్‌మన్ గిల్ తుది జట్టులోకి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇది మినహా జట్టులో పెద్దగా మార్పులు లేకపోవచ్చు. Australian captain Steve Smith checking the Indore pitch. pic.twitter.com/OvPqHoT6lm — Johns. (@CricCrazyJohns) February 28, 2023 చదవండి: ప్రేయసితో ఘనంగా టీమిండియా ఆల్‌రౌండర్ పెళ్లి ఓటమి నేర్పిన పాఠం.. ప్రతీసారి 'బజ్‌బాల్' పనికిరాదు -
నేటి నుంచి మూడో టెస్టు
-
క్లీన్‌స్వీప్ లక్ష్యం
సిరీస్ ఇప్పటికే గెలిచాం... ప్రపంచ నంబర్‌వన్ ర్యాంక్ కూడా మన దగ్గరే పదిలంగా ఉంది... ఇక తర్వాతి లక్ష్యం... క్లీన్‌స్వీప్. స్వదేశంలో భారత జట్టు ప్రతి సీజన్లో ఒక్క సిరీస్‌నైనా క్లీన్‌స్వీప్ చేయడం ఆనవాయితీగా వస్తోంది. ఈసారి సుదీర్ఘ సీజన్లో తొలి సిరీస్‌లోనే అన్ని మ్యాచ్‌లు గెలిస్తే... ఈ ఆత్మవిశ్వాసంతో తర్వాత ఇంగ్లండ్ భరతం పట్టొచ్చు. ఇదే లక్ష్యంతో భారత్ మూడో టెస్టు బరిలోకి దిగుతోంది. ఉపఖండంలో సిరీస్‌లు గెలవకపోయినా... డ్రాలు చేసుకోవడం న్యూజిలాండ్‌కు బాగా తెలిసిన విద్య. అయితే ఈసారి భారత్‌లో మాత్రం అది సాధ్యం కాలేదు. వరుసగా రెండు టెస్టుల్లోనూ కివీస్ భారత్‌కు ఏ మాత్రం పోటీ ఇవ్వలేకపోయి0ది. కనీసం ఆఖరి టెస్టులో గెలవకపోయినా డ్రా చేసుకున్నా న్యూజిలాండ్‌కు మంచి ఫలితమే అనుకోవాలి. ఇప్పుడు ఆ జట్టు ఆలోచన కూడా ఇదే. • నేటి నుంచి మూడో టెస్టు • భారత జట్టులో రెండు మార్పులు • న్యూజిలాండ్ కెప్టెన్ విలియమ్సన్ ఫిట్ ఉ. గం. 9.30 నుంచి స్టార్ స్పోర్ట్స్ -1లో ప్రత్యక్ష ప్రసారం ఇండోర్: ఓ వైపు బీసీసీఐలో లోధా కమిటీ ప్రతి పాదనల గందరగోళం... కేసులు... చీవాట్లు... ఇలా దేశంలో క్రికెట్ పరిపాలన ఆటను మించి చర్చగా మారిన నేపథ్యంలో... మరోసారి అభిమానుల దృష్టిని క్రికెట్ వైపు మళ్లించేందుకు కోహ్లి సేన సిద్ధమైంది. హోల్కర్ స్టేడియంలో నేటి నుంచి జరిగే ఆఖరి టెస్టులో న్యూజిలాండ్‌తో భారత్ తలపడనుంది. ఇప్పటికే 2-0తో సిరీస్‌ను గెలిచిన భారత్... ఆఖరి మ్యాచ్‌లోనూ గెలిస్తే క్లీన్‌స్వీప్‌తో విజయాన్ని పరిపూర్ణం చేసుకోవచ్చు. ప్రస్తుత ఫామ్, పిచ్ పరిస్థితులు చూస్తుంటే ఇది లాంఛనమే అనిపిస్తోంది. అయితే పోరాటానికి మారుపేరుగా భావించే న్యూజిలాండ్‌ను తక్కువ అంచనా వేయడానికి వీళ్లేదు. గంభీర్ రెండేళ్ల తర్వాత...: వరుసగా ఒక్కో మ్యాచ్‌కు ఒక్కో ఓపెనర్ గాయంతో తప్పుకోగా మూడో టెస్టులో భారత్ కొత్త ఓపెనింగ్ జం టను ఆడిస్తోంది. శిఖర్ ధావన్ స్థానంలో గంభీర్ తుది జట్టులోకి వస్తున్నాడు. ఇంగ్లండ్‌లో 2014లో చివరిసారి టెస్టు ఆడిన ఈ ఢిల్లీ స్టార్ రెండేళ్ల తర్వాత పునరాగమనం చేస్తున్నాడు. నిజానికి అతనికిది పెద్ద అవకాశం. ఈ మ్యాచ్‌లో బాగా ఆడితే తిరిగి జట్టులో స్థానం నిలబెట్టుకోవచ్చు. మరో ఓపెనర్ విజయ్‌తో పాటు పుజారా కూడా ఫామ్‌లో ఉన్నాడు. కోల్‌కతాలో కోహ్లి, రోహిత్ శర్మ ఆడిన విధానంతో భారత బ్యాటింగ్ లైనప్ పూర్తి పటిష్టంగా కనిపిస్తోంది. సాహాతో పాటు అశ్విన్, జడేజా కూడా ఫామ్‌లో ఉన్నారు. ఇక బౌలింగ్‌లో భువనేశ్వర్ గాయం కారణంగా అతని స్థానంలో ఉమేశ్ యాదవ్ తుది జట్టులోకి రావచ్చు. ఒకవేళ పిచ్ స్వభావం దృష్ట్యా మూడో స్పిన్నర్ కావాలనుకుంటే మాత్రం అమిత్ మిశ్రా తుది జట్టులోకి వస్తాడు. ఎవరికై నా ఆఖరి నిమిషంలో గాయం అయితే తప్ప శార్దుల్ ఠాకూర్, జయంత్ యాదవ్‌లకు ఈసారి అవకాశం లేనట్లే. షమీ రివర్స్ స్వింగ్ ఈ మ్యాచ్‌లోనూ కీలకం కావచ్చు. ఓవరాల్‌గా అన్ని విభాగాల్లోనూ పటిష్టంగా ఉన్న భారత్ మరోసారి ఫేవరెట్‌గానే బరిలోకి దిగుతోంది. కివీస్ కెప్టెన్ వచ్చేశాడు: న్యూజిలాండ్ జట్టులో అందరికంటే నిలకడగా ఆడే బ్యాట్స్‌మన్, స్పిన్‌ను సమర్థంగా ఎదుర్కోగల ఆటగాడు కెప్టెన్ విలియమ్సన్. కోల్‌కతా టెస్టుకు గాయం కారణంగా అతను దూరమవడం జట్టుపై ప్రభావం చూపించింది. మూడో టెస్టులో బరిలోకి దిగుతున్నట్లు విలియమ్సన్ చెప్పాడు. లాథమ్, రోంచీ మినహా ఈ సిరీస్‌లో మిగిలిన బ్యాట్స్‌మన్ ఎవరూ ఆకట్టుకోలేదు. ముఖ్యంగా సీనియర్ క్రికెటర్లు గప్టిల్, రాస్ టేలర్ జట్టుకు భారంగా మారారు. ఈసారైనా బాధ్యతగా ఆడకపోతే ఈ ఇద్దరి టెస్టు కెరీర్‌కే ప్రమాదం వస్తుంది. స్పిన్ ఆల్‌రౌండర్ సాన్‌ట్నర్ తన బాధ్యతలను సమర్థంగా నిర్వహిస్తున్నాడు. తనతో పాటు జీతన్ పటేల్, సోధి రూపంలో ఈ మ్యాచ్‌లోనూ న్యూజిలాండ్ ముగ్గురు స్పిన్నర్లను ఆడించే అవకాశం ఉంది. పరిస్థితులు, భారత్ ఫామ్ చూస్తే మ్యాచ్‌ను కాపాడుకోవాలంటే న్యూజి లాండ్ శక్తికి మించి కష్టపడాలి. పిచ్, వాతావరణం కాన్పూర్ తరహాలోనే ఇండోర్‌లోనూ పిచ్ స్పిన్నర్లకు అనుకూలించే అవకాశం ఉంది. తొలి రెండు రోజులు బ్యాట్స్‌మన్‌కు సహకరించవచ్చు. ఇక ఐదు రోజుల్లో ఏదో ఒక సమయంలో ఒక్క సెషన్కై నా వరుణుడు అడ్డుపడే ప్రమాదం ఉంది. గత మూడు రోజులుగా అడపాదడపా వర్షం పడుతూనే ఉంది. ఇండోర్‌లో ఇదే మొదటి టెస్టు మధ్యప్రదేశ్ భారత్‌లో రెండో పెద్ద రాష్ట్రం. కానీ ఇప్పటివరకూ ఈ రాష్ట్రంలో ఒక్క టెస్టు మ్యాచ్ కూడా జరగలేదంటే కాస్త ఆశ్చర్యంగానే ఉంటుంది. రాష్ట్రంలోని గ్వాలియర్, ఇండోర్ రెండు స్టేడియాల్లో రెండు వన్డే డబుల్ సెంచరీలు వచ్చారుు. సచిన్ (2010, ఫిబ్రవరి 24న దక్షిణాఫ్రికాపై) గ్వాలియర్‌లో ఈ ఘనత సాధిస్తే... ఇండోర్‌లో సెహ్వాగ్ (2011, డిసెంబరు 8న వెస్టిండీస్‌పై) డబుల్ సెంచరీ చేశాడు. సుదీర్ఘ నిరీక్షణ తర్వాత ఇండోర్‌లోని హోల్కర్ స్టేడియానికి టెస్టు హోదా లభించింది. తమ తొలి మ్యాచ్‌ను ఘనంగా నిర్వహించేందుకు రాష్ట్ర సంఘం అన్ని ఏర్పాట్లు చేసింది. హోల్కర్ స్టేడియం నగరం మధ్యలో ఉండటంతో ప్రేక్షకుల సంఖ్య భారీగా ఉండే అవకాశం కనిపిస్తోంది. 22 హోల్కర్ స్టేడియం భారత్‌లో 22వ టెస్టు వేదిక. మనకు వికెట్లు రాని సమయంలో పరుగులను నియంత్రించి ప్రత్యర్థిని ఒత్తిడిలోకి పంపాలి. కెప్టెన్‌గా ఈ అంశాన్నే నేర్చుకుంటున్నా. మా క్రికెటర్లకు గాయాలైనా ప్రత్యామ్నాయ ఆటగాళ్లు సిద్ధంగా ఉన్నారు. ఇది మంచి పరిణామం. సుదీర్ఘ సీజన్ కారణంగా గాయాల బారిన పడకుండా చూసుకోవడమూ ముఖ్యమే. అందుకే వన్డేలకు కొందరికి విశ్రాంతి ఇచ్చాం. -కోహ్లి, భారత కెప్టెన్ భారత్‌లో టెస్టు క్రికెట్ ఆడటం పెద్ద సవాల్ అనే విషయం తెలుసు. మా ప్రదర్శన మరింత మెరుగవ్వాలి. తొలి రెండు టెస్టులకు రెండు భిన్నమైన పిచ్‌లు ఎదురయ్యారుు. అందుకే భారత్‌లో పరిస్థితులకు అలవాటు పడటం కష్టం. తొలి ఇన్నింగ్సలో 300పై చిలుకు స్కోరు చేయడం కీలకం. -విలియమ్సన్, కివీస్ కెప్టెన్ జట్లు (అంచనా) భారత్: కోహ్లి (కెప్టెన్), గంభీర్, విజయ్, పుజారా, రహానే, రోహిత్, సాహా, అశ్విన్, జడేజా, షమీ, ఉమేశ్. న్యూజిలాండ్: విలియమ్సన్ (కెప్టెన్), లాథమ్, గప్టిల్, టేలర్, రోంచీ, సాన్‌ట్నర్, వాట్లింగ్, వేగ్నర్, జీతన్, సోధి, బౌల్ట్.