క్లీన్‌స్వీప్ లక్ష్యం | India target series whitewash in Holkar's debut Test | Sakshi
Sakshi News home page

క్లీన్‌స్వీప్ లక్ష్యం

Published Fri, Oct 7 2016 11:27 PM | Last Updated on Mon, Sep 4 2017 4:32 PM

క్లీన్‌స్వీప్  లక్ష్యం

క్లీన్‌స్వీప్ లక్ష్యం

సిరీస్ ఇప్పటికే గెలిచాం... ప్రపంచ నంబర్‌వన్ ర్యాంక్ కూడా మన దగ్గరే పదిలంగా ఉంది... ఇక తర్వాతి లక్ష్యం... క్లీన్‌స్వీప్. స్వదేశంలో భారత జట్టు ప్రతి సీజన్‌లో ఒక్క సిరీస్‌నైనా క్లీన్‌స్వీప్ చేయడం ఆనవాయితీగా వస్తోంది. ఈసారి సుదీర్ఘ సీజన్‌లో తొలి సిరీస్‌లోనే అన్ని మ్యాచ్‌లు గెలిస్తే... ఈ ఆత్మవిశ్వాసంతో తర్వాత ఇంగ్లండ్ భరతం పట్టొచ్చు. ఇదే లక్ష్యంతో భారత్ మూడో టెస్టు బరిలోకి దిగుతోంది.
 
ఉపఖండంలో సిరీస్‌లు గెలవకపోయినా... డ్రాలు చేసుకోవడం న్యూజిలాండ్‌కు బాగా తెలిసిన విద్య. అయితే ఈసారి భారత్‌లో మాత్రం అది సాధ్యం కాలేదు. వరుసగా రెండు టెస్టుల్లోనూ కివీస్ భారత్‌కు ఏ మాత్రం పోటీ ఇవ్వలేకపోయి0ది. కనీసం ఆఖరి టెస్టులో గెలవకపోయినా డ్రా చేసుకున్నా న్యూజిలాండ్‌కు మంచి ఫలితమే అనుకోవాలి. ఇప్పుడు ఆ జట్టు ఆలోచన కూడా ఇదే.  
 
నేటి నుంచి మూడో టెస్టు
భారత జట్టులో రెండు మార్పులు
న్యూజిలాండ్ కెప్టెన్ విలియమ్సన్ ఫిట్  

 
 ఉ. గం. 9.30 నుంచి
 స్టార్ స్పోర్ట్స్ -1లో ప్రత్యక్ష ప్రసారం

 
ఇండోర్: ఓ వైపు బీసీసీఐలో లోధా కమిటీ ప్రతి పాదనల గందరగోళం... కేసులు... చీవాట్లు... ఇలా దేశంలో క్రికెట్ పరిపాలన ఆటను మించి చర్చగా మారిన నేపథ్యంలో... మరోసారి అభిమానుల దృష్టిని క్రికెట్ వైపు మళ్లించేందుకు కోహ్లి సేన సిద్ధమైంది. హోల్కర్ స్టేడియంలో నేటి నుంచి జరిగే ఆఖరి టెస్టులో న్యూజిలాండ్‌తో భారత్ తలపడనుంది. ఇప్పటికే 2-0తో సిరీస్‌ను గెలిచిన భారత్... ఆఖరి మ్యాచ్‌లోనూ గెలిస్తే క్లీన్‌స్వీప్‌తో విజయాన్ని పరిపూర్ణం చేసుకోవచ్చు. ప్రస్తుత ఫామ్, పిచ్ పరిస్థితులు చూస్తుంటే ఇది లాంఛనమే అనిపిస్తోంది. అయితే పోరాటానికి మారుపేరుగా భావించే న్యూజిలాండ్‌ను తక్కువ అంచనా వేయడానికి వీళ్లేదు.

 గంభీర్ రెండేళ్ల తర్వాత...: వరుసగా ఒక్కో మ్యాచ్‌కు ఒక్కో ఓపెనర్ గాయంతో తప్పుకోగా మూడో టెస్టులో భారత్ కొత్త ఓపెనింగ్ జం టను ఆడిస్తోంది. శిఖర్ ధావన్ స్థానంలో గంభీర్ తుది జట్టులోకి వస్తున్నాడు. ఇంగ్లండ్‌లో 2014లో చివరిసారి టెస్టు ఆడిన ఈ ఢిల్లీ స్టార్ రెండేళ్ల తర్వాత పునరాగమనం చేస్తున్నాడు. నిజానికి అతనికిది పెద్ద అవకాశం. ఈ మ్యాచ్‌లో బాగా ఆడితే తిరిగి జట్టులో స్థానం నిలబెట్టుకోవచ్చు. మరో ఓపెనర్ విజయ్‌తో పాటు పుజారా కూడా ఫామ్‌లో ఉన్నాడు. కోల్‌కతాలో కోహ్లి, రోహిత్ శర్మ ఆడిన విధానంతో భారత బ్యాటింగ్ లైనప్ పూర్తి పటిష్టంగా కనిపిస్తోంది. సాహాతో పాటు అశ్విన్, జడేజా కూడా ఫామ్‌లో ఉన్నారు. ఇక బౌలింగ్‌లో భువనేశ్వర్ గాయం కారణంగా అతని స్థానంలో ఉమేశ్ యాదవ్ తుది జట్టులోకి రావచ్చు. ఒకవేళ పిచ్ స్వభావం దృష్ట్యా మూడో స్పిన్నర్ కావాలనుకుంటే మాత్రం అమిత్ మిశ్రా తుది జట్టులోకి వస్తాడు. ఎవరికై నా ఆఖరి నిమిషంలో గాయం అయితే తప్ప శార్దుల్ ఠాకూర్, జయంత్ యాదవ్‌లకు ఈసారి అవకాశం లేనట్లే. షమీ రివర్స్ స్వింగ్ ఈ మ్యాచ్‌లోనూ కీలకం కావచ్చు. ఓవరాల్‌గా అన్ని విభాగాల్లోనూ పటిష్టంగా ఉన్న భారత్ మరోసారి ఫేవరెట్‌గానే బరిలోకి దిగుతోంది.

కివీస్ కెప్టెన్ వచ్చేశాడు: న్యూజిలాండ్ జట్టులో అందరికంటే నిలకడగా ఆడే బ్యాట్స్‌మన్, స్పిన్‌ను సమర్థంగా ఎదుర్కోగల ఆటగాడు కెప్టెన్ విలియమ్సన్. కోల్‌కతా టెస్టుకు గాయం కారణంగా అతను దూరమవడం జట్టుపై ప్రభావం చూపించింది. మూడో టెస్టులో బరిలోకి దిగుతున్నట్లు విలియమ్సన్ చెప్పాడు. లాథమ్, రోంచీ మినహా ఈ సిరీస్‌లో మిగిలిన బ్యాట్స్‌మన్ ఎవరూ ఆకట్టుకోలేదు. ముఖ్యంగా సీనియర్ క్రికెటర్లు గప్టిల్, రాస్ టేలర్ జట్టుకు భారంగా మారారు. ఈసారైనా బాధ్యతగా ఆడకపోతే ఈ ఇద్దరి టెస్టు కెరీర్‌కే ప్రమాదం వస్తుంది. స్పిన్ ఆల్‌రౌండర్ సాన్‌ట్నర్ తన బాధ్యతలను సమర్థంగా నిర్వహిస్తున్నాడు.  తనతో పాటు జీతన్ పటేల్, సోధి రూపంలో ఈ మ్యాచ్‌లోనూ న్యూజిలాండ్ ముగ్గురు స్పిన్నర్లను ఆడించే అవకాశం ఉంది. పరిస్థితులు, భారత్ ఫామ్ చూస్తే మ్యాచ్‌ను కాపాడుకోవాలంటే న్యూజి లాండ్ శక్తికి మించి కష్టపడాలి.
 
పిచ్, వాతావరణం
కాన్పూర్ తరహాలోనే ఇండోర్‌లోనూ పిచ్ స్పిన్నర్లకు అనుకూలించే అవకాశం ఉంది. తొలి రెండు రోజులు బ్యాట్స్‌మన్‌కు సహకరించవచ్చు. ఇక ఐదు రోజుల్లో ఏదో ఒక సమయంలో ఒక్క సెషన్‌కై నా వరుణుడు అడ్డుపడే ప్రమాదం ఉంది. గత మూడు రోజులుగా అడపాదడపా వర్షం పడుతూనే ఉంది.
 
ఇండోర్‌లో ఇదే మొదటి టెస్టు
మధ్యప్రదేశ్ భారత్‌లో రెండో పెద్ద రాష్ట్రం. కానీ ఇప్పటివరకూ ఈ రాష్ట్రంలో ఒక్క టెస్టు మ్యాచ్ కూడా జరగలేదంటే కాస్త ఆశ్చర్యంగానే ఉంటుంది. రాష్ట్రంలోని గ్వాలియర్, ఇండోర్ రెండు స్టేడియాల్లో రెండు వన్డే డబుల్ సెంచరీలు వచ్చారుు. సచిన్ (2010,  ఫిబ్రవరి 24న దక్షిణాఫ్రికాపై) గ్వాలియర్‌లో ఈ ఘనత సాధిస్తే... ఇండోర్‌లో సెహ్వాగ్ (2011, డిసెంబరు 8న వెస్టిండీస్‌పై) డబుల్ సెంచరీ చేశాడు. సుదీర్ఘ నిరీక్షణ తర్వాత ఇండోర్‌లోని హోల్కర్ స్టేడియానికి టెస్టు హోదా లభించింది. తమ తొలి మ్యాచ్‌ను ఘనంగా నిర్వహించేందుకు రాష్ట్ర సంఘం అన్ని ఏర్పాట్లు చేసింది. హోల్కర్ స్టేడియం నగరం మధ్యలో ఉండటంతో ప్రేక్షకుల సంఖ్య భారీగా ఉండే అవకాశం కనిపిస్తోంది.

22
హోల్కర్ స్టేడియం భారత్‌లో 22వ టెస్టు వేదిక.
 
మనకు వికెట్లు రాని సమయంలో పరుగులను నియంత్రించి ప్రత్యర్థిని ఒత్తిడిలోకి పంపాలి. కెప్టెన్‌గా ఈ అంశాన్నే నేర్చుకుంటున్నా. మా క్రికెటర్లకు గాయాలైనా ప్రత్యామ్నాయ ఆటగాళ్లు సిద్ధంగా ఉన్నారు. ఇది మంచి పరిణామం. సుదీర్ఘ సీజన్ కారణంగా గాయాల బారిన పడకుండా చూసుకోవడమూ ముఖ్యమే. అందుకే వన్డేలకు కొందరికి విశ్రాంతి ఇచ్చాం.         
 -కోహ్లి, భారత కెప్టెన్
 
 భారత్‌లో టెస్టు క్రికెట్ ఆడటం పెద్ద సవాల్ అనే విషయం తెలుసు. మా ప్రదర్శన మరింత మెరుగవ్వాలి. తొలి రెండు టెస్టులకు రెండు భిన్నమైన పిచ్‌లు ఎదురయ్యారుు. అందుకే భారత్‌లో పరిస్థితులకు అలవాటు పడటం కష్టం. తొలి ఇన్నింగ్‌‌సలో 300పై చిలుకు స్కోరు చేయడం కీలకం.
 -విలియమ్సన్, కివీస్ కెప్టెన్
 
 జట్లు (అంచనా)
 భారత్: కోహ్లి (కెప్టెన్), గంభీర్, విజయ్, పుజారా, రహానే, రోహిత్, సాహా, అశ్విన్, జడేజా, షమీ, ఉమేశ్.
 న్యూజిలాండ్: విలియమ్సన్ (కెప్టెన్), లాథమ్, గప్టిల్, టేలర్, రోంచీ, సాన్‌ట్నర్, వాట్లింగ్, వేగ్నర్, జీతన్, సోధి, బౌల్ట్.
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement