రికార్డుల టెస్టు మ్యాచ్!
ఇండోర్:భారత-న్యూజిలాండ్ తో జరుగుతున్న మూడో టెస్టు రికార్డుల మ్యాచ్ గా మారిపోయింది. తొలి రెండు రోజుల ఆటలో భారత క్రికెటర్ విరాట్ కోహ్లి డబుల్ సెంచరీ సాధించి ఆ ఘనతను రెండు సార్లు సాధించిన భారత కెప్టెన్ గా సరికొత్త చరిత్ర లిఖించగా, మూడో రోజు ఆటలో స్పిన్నర్ రవి చంద్రన్ అశ్విన్ ఆరు వికెట్లు సాధించి మరో రికార్డును నెలకొల్పాడు. న్యూజిలాండ్ పై టెస్టుల్లో ఐదు సార్లు ఐదు, అంతకంటే ఎక్కువ వికెట్లను సాధించిన ఏకైక భారత బౌలర్ గా అరుదైన మైలురాయిని నెలకొల్పాడు. అంతకుముందు బేడీ, సుభాష్ గుప్తే, ప్రసన్న, జహీర్ ఖాన్లు నాలుగు సార్లు మాత్రమే న్యూజిలాండ్ ఐదు వికెట్లను సాధించిన భారత బౌలర్లు.
ఇదిలా ఉండగా, అశ్విన్ ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్ లో ఆరు వికెట్లు తీయడంతో ఓవరాల్ గా 20 సార్లు ఐదు వికెట్లకు పైగా సాధించిన ఘనతను నమోదు చేశాడు. తన కెరీర్లో 39వ టెస్టు మ్యాచ్ ఆడుతున్న అశ్విన్ కంటే ముందు ఇద్దరు మాత్రమే తక్కువ సమయంలో ఆ ఘనతను అందుకున్నారు. ఈ ఘనతను అతి తక్కువ టెస్టుల్లో ఆస్ట్రేలియా మాజీ స్పిన్నర్లు బార్నెస్ (25 టెస్టుల్లో), గ్రీమ్మెట్(37 టెస్టుల్లో) లు సాధించారు.
ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్ లో న్యూజిలాండ్ 299 పరుగులకు ఆలౌటైన సంగతి తెలిసిందే. ఆ తరువాత రెండో ఇన్నింగ్స్ ఆరంభించిన భారత్ మూడో రోజు ఆట ముగిసే సమయానికి వికెట్ నష్టపోకుండా 18 పరుగులు చేసింది.
ఇక్కడ క్లిక్ చేయండి..