చేనేత వస్త్రాలు ధరించి కోల్‌కతా మోడల్స్ క్యాట్ వాక్
యూనివర్సిటీక్యాంపస్: ఎస్వీయూ స్టేడియంలో ఈనెల 2వ తేదీ నుంచి నిర్వహిస్తున్న రాష్ట్రస్థాయి హస్తకళా ప్రదర్శన ఆదివారం రాత్రితో ముగిసింది. రాష్ట్ర ప్రభుత్వం నాలుగు రోజుల పాటు నిర్వహిం చిన హస్తకళాప్రదర్శనకు దాదాపు రూ.3కోట్లు విని యోగించింది. కార్యక్రమం ముందు రోజు నుంచి వర్షం కురవడంతో ప్రజల ఆదరణ లేకుండా పోయింది. కార్యక్రమాన్ని ప్రారంభించాల్సిన పర్యటకశాఖ మంత్రి భూమా అఖిలప్రియతోపాటు ఇతర మంత్రులెవ్వరూ హాజరుకాలేదు. శనివారం ∙సీఎం చంద్రబాబు సందర్శన కార్యక్రమం ఉన్నా, రద్దు చేసుకున్నారు. రాష్ట్ర పర్యాటకశాఖ ఈ ప్రద ర్శనను సరైన సమయంలో నిర్వహించకపోవడం, వర్షాన్ని దృష్టిలో ఉంచుకుని తగిన ఏర్పాట్లు చేయకపోవడం వల్లే ప్రజాధనం నీళ్లపాలైందని విమర్శలు వెల్లువెత్తాయి. వ్యాపారం సైతం జరగలేదని స్టాళ్ల నిర్వాహకులు వాపోవడం కనిపించింది.
హస్తకళలకు ప్రోత్సాహం: మంత్రి సునీత
హస్తకళ, చేనేత కళాకారులను ప్రోత్సహిస్తామని మంత్రి పరిటాల సునీత పేర్కొన్నారు. హస్తకళల ప్రదర్శనను ఆదివారం రాత్రి ఆమె సందర్శించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రతి కుటుం బం రూ.10 వేల ఆదా యం సంపాదించేలా ప్రభుత్వం సంక్షేమ కార్యక్రమాలు నిర్వహిస్తోందన్నారు. స్టాల్స్‌ను సందర్శించారు. చీరను కొనుగోలు చేశారు.
అలరించిన సాంస్కృతిక కార్యక్రమాలు
స్టేడియంలో ఆదివారం రాత్రి నిర్వహించిన సాం స్కృతిక కార్యక్రమాలు అలరించాయి. గాయని సునీ త విభావరి ఓలలాడించింది. వర్షం వల్ల ఆటంకం ఏర్పడినా సాంస్కృతిక కార్యక్రమాలను కొనసాగించారు. మృదుల, కౌశిక్ యాంకరింగ్ చేశారు. ఆనంద్ బృందం కామెడీ స్కిట్ చేశారు. కోల్‌కతా చెందిన శ్రావణ్ ఆధ్వర్యంలో మోడల్స్ చేనేత వస్త్రాలు ధరిం చి క్యాట్‌వాక్ చేశారు. సినీతారలు మనారాచోప్రా, శుబ్ర అయ్యప్ప హాజరయ్యారు. కలెక్టర్ ప్రద్యుమ్న, సబ్‌కలెక్టర్ నిషాంత్‌కుమార్, పరిశ్రమలశాఖ కార్యదర్శి సాల్మన్ ఆరోఖ్యరాజు, తిరుపతి కమిషనర్ హరికిరణ్, జిల్లా జడ్జి రాంగోపాల్ తిలకించారు.
Comments
Please login to add a commentAdd a comment