రావల్పిండి వేదికగా పాకిస్తాన్, బంగ్లాదేశ్ మధ్య ఇవాళ (ఆగస్ట్ 30) మొదలుకావాల్సిన రెండో టెస్ట్ మ్యాచ్ భారీ వర్షం కారణంగా టాస్ కూడా పడకుండానే రద్దైంది. భారీ వర్షానికి రావల్పిండి మైదానం తడిసి ముద్ద కావడంతో అంపైర్లు తొలి సెషన్ వరకు చూసి ఆతర్వాత తొలి రోజు ఆటను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ మ్యాచ్ ఐదు రోజులు ఇదే పరిస్థితి కొనసాగే అవకాశం ఉందని తెలుస్తుంది.
కాగా, రెండు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ కోసం బంగ్లాదేశ్ జట్టు పాకిస్తాన్‌లో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. ఈ సిరీస్‌లోని తొలి మ్యాచ్‌లో బంగ్లాదేశ్ సంచలన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో బంగ్లా ఆటగాళ్లు అన్ని విభాగాల్లో సత్తా చాటి పాక్‌ను వారి సొంతగడ్డపై 10 వికెట్ల తేడాతో మట్టికరిపించారు.
ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన పాక్.. తొలి ఇన్నింగ్స్‌లో 6 వికెట్ల నష్టానికి 448 పరుగులు చేసి ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసింది. అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన బంగ్లాదేశ్ 565 పరుగులు చేసి ఆలౌటైంది.సెకెండ్ ఇన్నింగ్స్‌లో బంగ్లా బౌలర్లు చెలరేగడంతో పాక్ 146 పరుగులకే ఆలౌటైంది.
Comments
Please login to add a commentAdd a comment