వర్షాల ఎఫెక్ట్‌.. గాలి నాణ్యతలో ఢిల్లీ సరికొత్త రికార్డు | Delhi Records Cleanest Air Quality On August 8 2024 | Sakshi
Sakshi News home page

భారీ వర్షాల ఎఫెక్ట్‌.. గాలి నాణ్యతలో ఢిల్లీ సరికొత్త రికార్డు

Published Fri, Aug 9 2024 8:08 AM | Last Updated on Fri, Aug 9 2024 9:50 AM

Delhi Records Cleanest Air Quality On August 8 2024

ఢిల్లీ: నిరంతరాయంగా  కురుస్తున్న వర్షాలతో దేశ రాజధాని ఢిల్లీకి ఉపశమనం లభించింది.  గురువారం(ఆగస్టు 8) రాజధానివాసులు గత ఆరేళ్లలో ఎన్నడూ లేనంత స్వచ్ఛమైన గాలి పీల్చుకున్నారు. ఢిల్లీలో గాలి నాణ్యత గత ఆరేళ్లలో ఎప్పుడూ లేనంత స్థాయిలో పెరిగి ఆగస్టు 8న సాయంత్రం 4 గంటలకు ఎయిర్‌ క్వాలిటీ ఇండెక్స్‌(ఏక్యూఐ)లో 53గా నమోదైంది. 

ఈ విషయాన్ని సెంటర్‌ ఫర్‌  ఎయిర్‌ క్వాలిటీ మేనేజ్‌మెంట్‌(సీఏక్యూఎమ్‌) ఒక ట్వీట్‌లో తెలిపింది. భారీ వర్షాల కారణంగానే ఢిల్లీలో గాలి నాణ్యత పెరిగినట్లు వెల్లడించింది. ఎయిర్‌ క్వాలిటీ ఇండెక్స్‌ 0 నుంచి 50 మధ్య ఉంటే గుడ్‌, 50 నుంచి 100 మధ్య ఉంటే సంతృప్తికరం, 101 నుంచి 200 ఉండే ఓ మోస్తరు, 201 నుంచి 300 ఉంటే పూర్‌, 301నుంచి 400 ఉంటే వెరీ పూర్‌గా పరిగణిస్తారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement