ఏజెన్సీ మండలాల్లో ప్రత్యేక కంట్రోల్ రూమ్
బంగాళాఖాతంలో వాయుగుండం ప్రభావంగా జిల్లాలో బుట్టాయగూడెం, జీలుగుమిల్లి, కుక్కునూరు, వేలేరుపాడు తదితర ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు కురవడంతో వాగులు, వంకలు పొంగి లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి, జనజీవనానికి విఘాతం కలుగుతుందనే ఉద్దేశంతో ముందుగానే అప్రమత్తమై జిల్లా యంత్రాంగం కంట్రోలు రూంలను ఏర్పాటు చేసినట్లు కలెక్టరు కాటంనేని భాస్కర్ ఒక ప్రకటనలో తెలిపారు.
సాక్షి ప్రతినిధి, ఏలూరు:
బంగాళాఖాతంలో వాయుగుండం ప్రభావంగా జిల్లాలో బుట్టాయగూడెం, జీలుగుమిల్లి, కుక్కునూరు, వేలేరుపాడు తదితర ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు కురవడంతో వాగులు, వంకలు పొంగి లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి, జనజీవనానికి విఘాతం కలుగుతుందనే ఉద్దేశంతో ముందుగానే అప్రమత్తమై జిల్లా యంత్రాంగం కంట్రోలు రూంలను ఏర్పాటు చేసినట్లు కలెక్టరు కాటంనేని భాస్కర్ ఒక ప్రకటనలో తెలిపారు. ప్రస్తుతం జిల్లా అంతటా చెదురుమదురు జల్లులతో వర్షం కురుస్తున్నదని రేపటికి వర్షపు నీరు పెరిగే అవకాశం ఉన్నందున ముందస్తు చర్యగా వీఆర్‌ఓలను, వీఏఓలను, ఆయా ప్రాంతాల్లోని ఉపాధ్యాయులు అందుబాటులో ఉండాలని, ఇతర సిబ్బందిని అవసరమైతే ఆ ప్రాంతాలలో ఉండి వరద నివారణ చర్యలు తక్షణం తీసుకోవాలని, సంబంధిత అధికారులను కలెక్టర్ ఆదేశించారు. ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందకు అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని వారికి నిత్యావసర వస్తువులు కూడా సిద్ధం చేసుకోవాలన్నారు. మండలాల్లో కంట్రోల్ రూంలు ఇప్పటికే ఏర్పాటు చేసినట్లు సిబ్బంది షిప్టులు వారీగా 24 గంటలూ వరద నిరోధక చర్యలు చేపడతారని కలెక్టరు చెప్పారు.
కంట్రోల్ రూమ్ నెంబర్లు:
జీలుగుమిల్లి తహశీల్దార్ కార్యాలయం సెల్ నెంబర్‌లు 9959967184, 8464840551, బుట్టాయిగూడెం తహశీల్దార్ కార్యాలయం సెల్ నెంబర్‌లు 809627466, 9912759993, కుక్కునూరు తహశీల్దార్ కార్యాలయం సెల్‌నెంబర్ 9492362623, వేలేరుపాడు తహశీల్దార్ కార్యాలయం సెల్‌నెంబర్ 9492360603.
వర్షపాతం వివరాలు...
జిల్లాలో గత 24 గంటల్లో ఆచంట మండలంలో అత్యధికంగా 53.6 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు కాగా వీరవాసరంలో 52.6, జీలుగుమిల్లి 21.6, బుట్టాయగూడెం 24.0, పోలవరం 32.8, తాళ్ళపూడి 35.6, గోపాలపురం 27.2, కొయ్యలగూడెం 36.4, జంగారెడ్డిగూడెం 24.6, కుక్కునూరు 14, వేలేరుపాడు 41.8, టీ.నర్సాపురం 39.6, చింతలపూడి 31.4, లింగపాలెం 25.6, కామవరపుకోట 41.2, ద్వారకాతిరుమల 18.2, నల్లజర్ల 20.8, దేవరపల్లి 26.8, చాగల్లు 19.2, కొవ్వూరు 22.2, నిడదవోలు 23.8, తాడేపల్లిగూడెం 22, ఉంగుటూరు 41, భీమడోలు 37 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది.