టీమిండియా- పాకిస్తాన్‌ మ్యాచ్‌.. అభిమానులకు ‍బ్యాడ్‌ న్యూస్‌!? India Vs Pakistan match in ICC T20 World Cup 2024 in New York may be rained out. Sakshi
Sakshi News home page

T20 WC 2024: టీమిండియా- పాకిస్తాన్‌ మ్యాచ్‌.. అభిమానులకు ‍బ్యాడ్‌ న్యూస్‌!?

Published Sat, Jun 8 2024 11:20 AM | Last Updated on Sat, Jun 8 2024 11:49 AM

T20 WC: India vs Pakistan Match Weather Forecast 60 Percent Chances

టీ20 వ‌ర‌ల్డ్‌క‌ప్‌-2024లో హై వోల్టేజ్ క్రికెట్ స‌మ‌రానికి రంగం సిద్ద‌మైంది. ఈ మెగా టోర్నీలో భాగంగా జూన్ 9 న్యూయ‌ర్క్ వేదిక‌గా భార‌త్‌-పాకిస్తాన్ జ‌ట్లు అమీతుమీ తెల్చుకోనున్నాయి. ఈ చిరకాల ప్ర‌త్య‌ర్థుల పోరును వీక్షించేందుకు అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు.  

అయితే ఈ మ్యాచ్‌కు ముందు ఇరు జట్ల అభిమానులకు బ్యాడ్ న్యూస్. ఈ మ్యాచ్‌కు వరుణుడు ఆటంకం కలిగించే ఛాన్స్ ఉంది.  ఆదివారం మ్యాచ్ జరిగే సమయంలో న్యూయర్క్‌లో వర్షం పడే అవకాశం ఉందని ‘అక్యూ వెదర్’ రిపోర్ట్ ప్రకటించింది. 

అమెరికా కాలమానం ప్రకారం ఉదయం 10.30 గంటలకు (భారత కాలమానం ప్రకారం రాత్రి 8 గంటలు) ఈ మ్యాచ్  ప్రారంభం కానుంది. టాస్ సమయంలో 40 శాతం నుంచి 50 శాతం వరకు వర్షం పడే అవకాశం ఉందని అక్యూ వెదర్ తమ రిపోర్ట్‌లో పేర్కొంది.

వర్ష సూచన మధ్యాహ్నం 1 గంట సమయానికి 10 శాతానికి తగ్గి.. ఆ తర్వాత మధ్యాహ్నం 3 గంటలకు మళ్లీ 40 శాతానికి పెరగనుందని అంచనా వేసింది. ఒక వేళ వర్షం కారణంగా మ్యాచ్ రద్దు అయితే ఇరు జట్లకు చెరో పాయింట్ లభిస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement