
వన్డే వరల్డ్‌కప్-2023లో ఓటమి తర్వాత తొలిసారి టీమిండియా సాంప్రాదాయ క్రికెట్‌లో ఆడనుంది. దక్షిణాఫ్రికాతో రెండు టెస్టుల సిరీస్‌లో తలపడేందుకు భారత జట్టు సిద్దమైంది. సఫారీ గడ్డపై ఇప్పటివరకు టెస్టు సిరీస్ గెలవని భారత జట్టు.. ఈసారి ఎలాగైనా సొంతం రెడ్ బాల్ సిరీస్‌ను సొంతం చేసుకుని చరిత్ర సృష్టించాలని పట్టుదలగా ఉంది. ఈ సిరీస్‌లో భాగంగా భారత్-దక్షిణాఫ్రికా మధ్య తొలి టెస్టు మ్యాచ్ డిసెంబర్ 26న ప్రారంభం కానుంది.
అయితే ఈ మ్యాచ్ తొలి రోజు ఆటకు వర్షం అంతరాయం కలిగించే ఛాన్స్ ఉంది. సోమవారం(డిసెంబర్ 25)న ఉదయం నుంచి సెంచూరియన్‌లో భారీ వర్షం కురుస్తోంది. దీంతో పిచ్‌ను కవర్లతో కప్పి ఉంచారు. వర్షం కారణంగా టీమిండియా తమ ఆఖరి ప్రాక్టీస్ సెషన్‌కు దూరమైనట్లు తెలుస్తోంది.
అంతేకాకుండా మ్యాచ్ జరిగే సమయంలో ఉరుములు, మెరుపులతో భారీ వర్షం కురిసే అవకాశం ఉందని అక్కడ వాతావరణ శాఖ ఓ ప్రకటనలో వెల్లడించింది. ఈ క్రమంలో తొలి రోజు ఆట పూర్తిగా రద్దు అయ్యే సూచనలు కన్పిస్తున్నాయి. గూగుల్ వెదర్ రిపోర్ట్ ప్రకారం.. రెండో రోజు కూడా 70 శాతం వర్షం కురిసే అస్కారం ఉంది.
చదవండి: IPL 2024: పాండ్యా కోసం రూ. 100 కోట్లు చెల్లించిన ముంబై? బంగారు బాతు కదా!