గుంతకల్లు: ముంబైలో కురుస్తున్న భారీ వర్షం, వరదల ధాటికి పలు రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయని గుంతకల్లు రైల్వే డివిజన్ వర్గాలు తెలిపాయి. ముఖ్యంగా ముంబై – చెన్నై మార్గంలో గుంతకల్లు రైల్వే జంక‌్షన్ మీదుగా నడిచే అన్ని రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయన్నారు. వర్ష ప్రభావం మరో రెండు రోజులుండటం వల్ల రైళ్ల సమయాలు చెప్పలేమని అధికారులు పేర్కొన్నారు.