ముగిసిన ఖేలో ఇండియా క్రీడా పోటీలు
వర్షం కారణంగా ఆగిన అండర్–14, 17 ఫుట్‌బాల్ బాలుర పోటీలు
అనంతపురం సప్తగిరి సర్కిల్ : ఖేలో ఇండియా క్రీడా పోటీలు శనివారం ముగిశాయి. వర్షం కారణంగా అండర్–14, 17 ఫుట్‌బాల్ బాలుర పోటీలు ఆగిపోయాయి. తిరిగి ఆదివారం నిర్వహించనున్నట్లు డీఎస్‌డీఓ బాషామోహిద్దీన్ తెలిపారు. శనివారం స్థానిక ఆర్ట్స్ కళాశాల క్రీడా మైదానంలో హాకీ, ఫుట్‌బాల్, తైక్వాండో క్రీడా పోటీలను నిర్వహించారు. ఈ పోటీల్లో 14 నియోజకవర్గాల క్రీడాకారులు పాల్గొన్నారు. అట్టహాసంగా సాగిన క్రీడా పోటీలు శనివారంతో ముగియాల్సి ఉండగా వర్షం వల్ల అర్ధంతరంగా ముగిశాయి. ఆల్‌రౌండ్ ప్రతిభలో ఉరవకొండ, రాప్తాడు నియోజకవర్గాల క్రీడాకారులు జిల్లాస్థాయి క్రీడా పోటీల్లో ప్రతిభను కనబరిచారు.
ఈ క్రీడా పోటీలు కబడ్డీ, అథ్లెటిక్స్, వెయిట్ లిఫ్టింగ్, ఖో–ఖో, ఆర్చరీ, వాలీబాల్, బాక్సింగ్, ఫుట్‌బాల్, హాకీ, తైక్వాండో పోటీలను నిర్వహించారు. మండల స్థాయిలో ప్రతిభ కనబరిచిన క్రీడాకారులను నియోజకవర్గ స్థాయికి, నియోజకవర్గాలలో ప్రతిభ కనబరిచిన క్రీడాకారులను జిల్లా స్థాయి క్రీడా పోటీలకు ఎంపిక చేశారు. జిల్లా స్థాయి క్రీడా పోటీల్లో విజేతలుగా నిలిచిన క్రీడాకారులను రాష్ట్రస్థాయి క్రీడా పోటీలకు ఎంపిక చేశారు. గతంలో జిల్లా స్థాయి పోటీల్లో ప్రతిభ కనబరిచిన క్రీడాకారులను ఎంపిక చేసే విధానం ఉండేది.
ఈ ఏడాది జిల్లా స్థాయిలో విజేతలుగా నిలిచిన జట్లను రాష్ట్రస్థాయికి ఎంపిక చేశారు. రాష్ట్రస్థాయి క్రీడా పోటీల తేది, పోటీలు జరిగే ప్రదేశాలను ఎంపిక ప్రక్రియ జరగలేదు. వాటిని త్వరలోనే ఏర్పాటు చేయనున్నట్లు డీఎస్‌డీఓ బాషామోహిద్దీన్ తెలిపారు. అనంతపురం, రాప్తాడు నియోజకవర్గాల హాకీ జట్టు విషయంలో స్వల్ప ఉద్రిక్తత నెలకొంది. ఆర్డీటీ అకాడమీ క్రీడాకారులు అనంతపురం నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహించడంతో పీఈటీలు అభ్యంతరాన్ని వ్యక్తం చేశారు. డీఎస్‌డీఓ అక్కడికి చేరుకొని సమస్య పరిష్కరించారు.
మూడో రోజు విజేతలు వీరే
అండర్–14 బాలురు
18 కేజీల విభాగం–రాజీవ్‌లోచన్ (అనంతపురం), గౌతంకృష్ణారెడ్డి(అనంతపురం), ఙానశ్రీపతి (తాడిపత్రి)
21–సుజీత్ చౌదరి (తాడిపత్రి), శ్రావణ్ (అనంతపురం), రవికాంత్‌రెడ్డి (శింగనమల).
23–కార్తీక్(రాప్తాడు), నందకిషోర్ (గుంతకల్), గైబుబాషా(తాడిపత్రి).
25–నందకిషోర్ (తాడిపత్రి), జునేద్‌అహమ్మద్ (శింగనమల), మాలిక్‌బాషా (శింగనమల).
27–కౌశిక్(తాడిపత్రి), మోక్షిత్‌రామ్ (అనంతపురం), యర్రంకిరెడ్డి(శింగనమల).
బాలికలు
16–సర్తాజ్‌బేగం (శింగనమల).
18–నిహారిక (శింగనమల), రుక్సాన (శింగనమల), సాయివినోదిని (తాడిపత్రి).
20–నీతుశ్రీసాయి (అనంతపురం), చరిత (శింగనమల), సాయిశ్రీ(రాప్తాడు).
22–జోత్స్న (అనంతపురం), పూజిత(శింగనమల), డీ.పూజిత(శింగనమల).
24–వెన్నెల (అనంతపురం), గౌతమి (శింగనమల), లాశ్రీరెడ్డి(శింగనమల).
అండర్–17 బాలురు
35–మహర్షి (అనంతపురం).
41–ఫిరోజ్ (తాడిపత్రి), దస్తగిరి (గుంతకల్), మహేష్ (గుంతకల్).
44–నాగగుర్రప్ప (అనంతపురం), అమీర్ (అనంతపురం), పవన్‌కళ్యాణ్ (తాడిపత్రి).
48–రూపేష్ (పెనుకొండ), శాంతకుమార్ (రాయదుర్గం), మోహమ్మద్ జునేద్ (గుంతకల్).
బాలికలు
32–అశ్విని (గుంతకల్).
35–దుర్గ (అనంతపురం).
38–సాయిదీప్తి (రాప్తాడు), కళ్యాణి (గుంతకల్), చాముండేశ్వరి(గుంతకల్).
41–స్రవంతి (అనంతపురం), రామాంజినమ్మ(గుంతకల్),ప్రశాంతి(గుంతకల్).
44–యశశ్విణి (అనంతపురం), మాధురి (తాడిపత్రి), హేమ(అనంతపురం).
ఫుట్‌బాల్ అండర్–14 బాలికలు
రాప్తాడు–1, కళ్యాణదుర్గం–2, రాయదుర్గం–3.
అండర్–17 బాలికలు
ఉరవకొండ–1, కళ్యాణదుర్గం–2, ధర్మవరం–3.
హాకీ అండర్–14 బాలురు
ధర్మవరం–1, ఉరవకొండ–2, రాప్తాడు–3.
బాలికలు
రాప్తాడు–1, ధర్మవరం–2, పుట్టపర్తి–3.
అండర్–17 బాలురు
రాప్తాడు–1, ధర్మవరం–2, పుట్టపర్తి–3.
బాలికలు
రాప్తాడు–1, ధర్మవరం–2, ఉరవకొండ–3