జోహన్నెస్‌బర్గ్ వేదికగా ఆదివారం దక్షిణాఫ్రికాతో తొలి వన్డేలో తలపడేందుకు టీమిండియా సిద్దమైంది. ప్రోటీస్‌తో టీ20 సిరీస్‌ను సమం చేసిన భారత జట్టు.. వన్డే సిరీస్‌ను ఎలాగైనా సొంతం చేసుకోవాలని వ్యూహాలు రచిస్తోంది. ఈ సిరీస్‌లో భారత జట్టు కెప్టెన్‌గా స్టార్ వికెట్ కీపర్ బ్యాటర్ కేఎల్ రాహుల్ వ్యవహరించనున్నాడు. ఇప్పటికే జోహన్నెస్‌బర్గ్‌కు చేరుకున్న రాహుల్ సేన తొలి మ్యాచ్ కోసం తీవ్రంగా శ్రమించింది.
అయితే ఈ మ్యాచ్‌కు వర్షం అంతరాయం కలిగించే ఛాన్స్ ఉంది. ఆదివారం మ్యాచ్ జరిగే జోహన్నెస్‌బర్గ్ తెలికపాటి జల్లు కురిసే అవకాశముందని అక్కడ వాతావారణ శాఖ తెలిపింది. వర్షం పడటానికి 51 శాతం ఆస్కారం ఉందని వాతావారణ శాఖ వెల్లడించింది.
అయితే కాగా సెకెండ్ ఇన్నింగ్స్ సమయానికి పెద్దగా వర్ష సూచనలు లేవు. కాగా టీ20 సిరీస్‌లో కూడా తొలి రెండు మ్యాచ్‌లకు వర్షం ఆటంకం కలిగించిన సంగతి తెలిసిందే. మొదటి టీ20 వర్షం కారణంగా పూర్తిగా రద్దు కాగా.. రెండో టీ20 డక్‌వర్త్ లూయిస్ పద్దతి ద్వారా ఫలితం తేలింది. కాగా ఈ వన్డే సిరీస్‌కు విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ, శుబ్‌మన్ గిల్, సూర్యకుమార్ యాదవ్, జడేజా, బుమ్రా వంటి స్టార్ ఆటగాళ్లు దూరమయ్యారు.
తొలి వన్డేకు భారత తుది జట్టు(అంచనా)
రుతురాజ్ గైక్వాడ్, సాయి సుదర్శన్, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్(కెప్టెన్), సంజు శాంసన్, రింకూ సింగ్, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, ముఖేష్ కుమార్, అర్ష్‌దీప్ సింగ్, అవేష్ ఖాన్
చదవండి: ENG vs WI: ఎస్‌ఆర్‌హెచ్ వదిలేసింది.. అక్కడ విధ్వంసం సృష్టించాడు! కేవలం 7 బంతుల్లోనే
Comments
Please login to add a commentAdd a comment