
5 మ్యాచ్‌ల సిరీస్‌లో 1-2తో వెనుకపడినప్పటికీ అద్భుతమైన పోరాటపటిమ కనబరుస్తూ.. యాషెస్‌ను కైవసం చేసుకునే దిశగా పయనిస్తున్న ఇంగ్లండ్‌కు వరుణుడు అడ్డు తగులుతున్నాడు. విజయానికి కేవలం 5 వికెట్ల దూరంలో ఉన్న ఇంగ్లండ్ పాలిట వర్షం విలన్‌లా మారింది. నాలుగో టెస్ట్ తొలి మూడు రోజులు ఏమాత్రం ఇబ్బంది పెట్టని వర్షం నాలుగో రోజు నుంచి ఇంగ్లండ్‌కు సినిమా చూపిస్తుంది.
Spot the irony ☔️#Ashes pic.twitter.com/Tb2QGYjAws
— England's Barmy Army 🏴🎺 (@TheBarmyArmy) July 23, 2023
నిన్న పూర్తి ఆట సాగి ఉంటే నిన్ననే ఇంగ్లండ్ మ్యాచ్ గెలిచి, సిరీస్ సమం చేసుకుని ఉండేది. నిన్న ఆఖరి సెషన్‌లో ఇంగ్లండ్‌పై జాలి చూపించిన వర్షం కాసేపు ఎడతెరిపినిచ్చింది. వరుణుడు కరుణించినా లబూషేన్ (111) కనికరించకపోవడంతో నాలుగో రోజు ఇంగ్లండ్ కేవలం ఒక్క వికెట్‌తోనే సరిపెట్టుకుంది. నిన్న జరిగిన 27 ఓవర్ల ఆటలో ఆసీస్ 101 పరుగులు స్కోర్ చేసి, నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి 5 వికెట్ల నష్టానికి 214 పరుగులు చేసింది.
ఐదో రోజైనా వరుణుడు కరుణిస్తాడని గంపెడాశలు పెట్టుకున్న ఇంగ్లీష్ టీమ్‌కు మరోసారి ఆశాభంగం కలిగింది. వర్షం కారణంగా ఐదో రోజు తొలి సెషన్ మొత్తం తుడిచి పెట్టుకుపోయింది. లంచ్ సమయం తర్వాత కూడా వర్షం ఎడతెరిపి లేకుండా కురుస్తుంది. ఇదే పరిస్థితి మరో 2 గంటలు కొనసాగితే మ్యాచ్ జరిగడం దాదాపుగా అసంభవమని అక్కడి వారు చెబుతున్నారు.
మరి ఈ మధ్యలో వరుణుడు ఇంగ్లండ్‌ను కరుణిస్తాడో లేక కనికరం లేకుండా వ్యవహరిస్తాడో వేచి చూడాలి. లంచ్ తర్వాత మైదాన ప్రాంతంలో కుంభవృష్టి కురుస్తున్నట్లు స్థానిక ప్రజలు సోషల్‌మీడియా ద్వారా తెలియజేస్తున్నారు. ఆసీస్.. ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్ స్కోర్‌కు ఇంకా 61 పరుగులు వెనుకపడి ఉంది. కనీసం 30 ఓవర్ల ఆట సాధ్యపడినా ఇంగ్లండ్ తమ అదృష్టాన్ని పరీక్షించుకునే అవకాశం ఉంది.