fourth Ashes test
-
ఇంగ్లండ్ యాషెస్ అవకాశాలను నీరుగారుస్తున్న వరుణుడు
5 మ్యాచ్‌ల సిరీస్‌లో 1-2తో వెనుకపడినప్పటికీ అద్భుతమైన పోరాటపటిమ కనబరుస్తూ.. యాషెస్‌ను కైవసం చేసుకునే దిశగా పయనిస్తున్న ఇంగ్లండ్‌కు వరుణుడు అడ్డు తగులుతున్నాడు. విజయానికి కేవలం 5 వికెట్ల దూరంలో ఉన్న ఇంగ్లండ్ పాలిట వర్షం విలన్లా మారింది. నాలుగో టెస్ట్ తొలి మూడు రోజులు ఏమాత్రం ఇబ్బంది పెట్టని వర్షం నాలుగో రోజు నుంచి ఇంగ్లండ్‌కు సినిమా చూపిస్తుంది. Spot the irony ☔️#Ashes pic.twitter.com/Tb2QGYjAws — England's Barmy Army 🏴🎺 (@TheBarmyArmy) July 23, 2023 నిన్న పూర్తి ఆట సాగి ఉంటే నిన్ననే ఇంగ్లండ్ మ్యాచ్ గెలిచి, సిరీస్ సమం చేసుకుని ఉండేది. నిన్న ఆఖరి సెషన్లో ఇంగ్లండ్‌పై జాలి చూపించిన వర్షం కాసేపు ఎడతెరిపినిచ్చింది. వరుణుడు కరుణించినా లబూషేన్ (111) కనికరించకపోవడంతో నాలుగో రోజు ఇంగ్లండ్ కేవలం ఒక్క వికెట్‌తోనే సరిపెట్టుకుంది. నిన్న జరిగిన 27 ఓవర్ల ఆటలో ఆసీస్ 101 పరుగులు స్కోర్ చేసి, నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి 5 వికెట్ల నష్టానికి 214 పరుగులు చేసింది. ఐదో రోజైనా వరుణుడు కరుణిస్తాడని గంపెడాశలు పెట్టుకున్న ఇంగ్లీష్ టీమ్‌కు మరోసారి ఆశాభంగం కలిగింది. వర్షం కారణంగా ఐదో రోజు తొలి సెషన్ మొత్తం తుడిచి పెట్టుకుపోయింది. లంచ్ సమయం తర్వాత కూడా వర్షం ఎడతెరిపి లేకుండా కురుస్తుంది. ఇదే పరిస్థితి మరో 2 గంటలు కొనసాగితే మ్యాచ్ జరిగడం దాదాపుగా అసంభవమని అక్కడి వారు చెబుతున్నారు. మరి ఈ మధ్యలో వరుణుడు ఇంగ్లండ్‌ను కరుణిస్తాడో లేక కనికరం లేకుండా వ్యవహరిస్తాడో వేచి చూడాలి. లంచ్ తర్వాత మైదాన ప్రాంతంలో కుంభవృష్టి కురుస్తున్నట్లు స్థానిక ప్రజలు సోషల్‌మీడియా ద్వారా తెలియజేస్తున్నారు. ఆసీస్.. ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్ స్కోర్‌కు ఇంకా 61 పరుగులు వెనుకపడి ఉంది. కనీసం 30 ఓవర్ల ఆట సాధ్యపడినా ఇంగ్లండ్ తమ అదృష్టాన్ని పరీక్షించుకునే అవకాశం ఉంది. -
అప్పుడు, ఇప్పుడు అతడే.. ఆండర్సన్, బ్రాడ్‌లకు ఒకడే లక్కీ హ్యాండ్..!
మాంచెస్టర్ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న యాషెస్ సిరీస్ నాలుగో టెస్ట్‌లో ఇంగ్లండ్ వెటరన్ పేసర్ స్టువర్ట్ బ్రాడ్ 600 వికెట్ల మైలురాయిని అందుకున్న విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌లో ట్రావిస్ హెడ్ (48) వికెట్ పడగొట్టడం ద్వారా బ్రాడ్ ఈ అత్యంత అరుదైన ఘనత సాధించాడు. క్రికెట్ చరిత్రలో బ్రాడ్ సహా కేవలం ఐదుగురు మాత్రమే టెస్ట్‌ల్లో 600 వికెట్ల మార్కును అందుకున్నారు. బ్రాడ్‌కు ముందు మురళీథరన్ (800), షేన్ వార్న్ (708), జేమ్స్ ఆండర్సన్ (688), అనిల్ కుంబ్లే (619) 600 వికెట్ల ల్యాండ్ మార్క్‌ను దాటారు. వీరిలో బ్రాడ్, అతని సహచరుడు ఆండర్సన్ మాత్రమే పేసర్లు కావడం విశేషం. కాగా, టెస్ట్‌ల్లో 600 వికెట్ల మార్కును దాటిన ఇద్దరు పేసర్ల విషయంలో ఓ కామన్ ఇష్యూ వెలుగులోకి వచ్చింది. అదేంటంటే.. ఆండర్సన్ 600వ వికెట్లో, బ్రాడ్ 600వ వికెట్లో వీరి సహచరుడు జో రూట్ పాత్ర ఉంది. ఆండర్సన్, బ్రాడ్‌లకు చిరకాలం గుర్తుండిపోయే ఈ సందర్భాల్లో రూట్ భాగమయ్యాడు. ఇద్దరి 600వ వికెట్ల క్యాచ్‌లను రూటే అందుకున్నాడు. Joe Root 🤝 Getting Anderson and Broad to 600 Test wickets#CricketTwitter #Ashes #ENGvAUS pic.twitter.com/LAjtRmbp1p — ESPNcricinfo (@ESPNcricinfo) July 20, 2023 ఆండర్సన్ 600వ వికెట్ పాక్ ఆటగాడు అజహర్ అలీ క్యాచ్‌ను, బ్రాడ్ 600వ వికెట్ ట్రవిస్ హెడ్ క్యాచ్‌ను రూటే పట్టుకున్నాడు. ఇక్కడ మరో విశేషమేమిటంటే, బ్రాడ్ తన 600వ వికెట్‌ను ఆండర్సన్ సొంత మైదానంలో అండర్సన్ ఎండ్ నుంచి బౌలింగ్ చేస్తూ సాధించాడు. ఈ విషయాన్ని బ్రాడ్ తొలి రోజు ఆట అనంతరం ప్రస్తావిస్తూ.. తన సహచరుడి ఎండ్ నుంచి బౌలింగ్ చేస్తూ ఈ అరుదైన ఘనత సాధించడం ఆనందంగా ఉందని అన్నాడు. ఇదిలా ఉంటే, నాలుగో టెస్ట్ తొలి రోజు ఇంగ్లండ్ పేసర్లు రాణించడంతో ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌లో 8 వికెట్ల నష్టానికి 299 పరుగులు చేసింది. మిచెల్ మార్ష్ (51), లబుషేన్ (51) అర్ధ సెంచరీలు సాధించగా, హెడ్ (48), స్టీవ్ స్మిత్ (41) రాణించారు. ఇంగ్లండ్ బౌలర్లలో క్రిస్ వోక్స్ (4/52) ప్రత్యర్థిని దెబ్బ తీయగా, బ్రాడ్ 2 వికెట్లు పడగొట్టాడు. అత్యధిక వికెట్లు సాధించిన బౌలర్‌గా.. ఆస్ట్రేలియాతో జరిగిన టెస్ట్‌ల్లో ఇంగ్లండ్ తరఫున అత్యధిక వికెట్లు సాధించిన బౌలర్ల జాబితాలో స్టువర్ట్ బ్రాడ్ (149) అగ్రస్థానానికి ఎగబాకాడు. ఈ మ్యాచ్‌కు ముందు ఈ రికార్డు ఇయాన్ బోథమ్ (148) పేరిట ఉండేది. ఈ జాబితాలో ఆండర్సన్ (115) నాలుగో స్థానంలో ఉన్నాడు. -
రోజర్స్ సెంచరీ
చెస్టర్ లీ స్ట్రీట్: ఇంగ్లండ్‌తో జరుగుతున్న యాషెస్ నాలుగో టెస్టులో ఆస్ట్రేలియా తడబడి పుంజుకుంది. ఓపెనర్ రోజర్స్ (233 బంతుల్లో 101 నాటౌట్; 13 ఫోర్లు) అజేయ సెంచరీకి తోడు వాట్సన్ (68) సమయోచితంగా రాణించడంతో శనివారం రెండో రోజు ఆట ముగిసే సమయానికి ఆసీస్ 74.4 ఓవర్లలో 5 వికెట్లకు 222 పరుగులు చేసింది. రోజర్స్‌తో పాటు హాడిన్ (12) క్రీజులో ఉన్నాడు. ప్రస్తుతం క్లార్క్‌సేన తొలి ఇన్నింగ్స్‌లో ఇంకా 16 పరుగులు వెనుకబడి ఉంది. వార్నర్ (3), ఖాజా (0), క్లార్క్ (6), స్మిత్ (17) స్వల్ప వ్యవధిలో అవుట్ కావడంతో కంగారు జట్టు 76 పరుగులకు 4 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. అయితే రోజర్స్, వాట్సన్‌లు ఐదో వికెట్‌కు 129 పరుగులు జోడించి ఇన్నింగ్స్‌ను గాడిలో పెట్టారు. బ్రాడ్‌కు 4, బ్రెస్నన్కు ఒక్క వికెట్ దక్కింది. అంతకుముందు 238/9 ఓవర్‌నైట్ స్కోరుతో రెండో రోజు ఆట కొనసాగించిన ఇంగ్లండ్ అదే స్కోరు వద్ద రెండు ఓవర్లు ఆడి ఆలౌటైంది. బ్రెస్నన్ (12 నాటౌట్) నిలబడ్డా... అండర్సన్ (16) అవుటయ్యాడు. లియోన్‌కు 4, హారిస్, బర్డ్లకు చెరో రెండు వికెట్లు దక్కాయి. రివ్యూలో అవుట్... కానీ నాటౌట్! యాషెస్‌లో డీఆర్ఎస్ వివాదాలు సృష్టిస్తూనే ఉంది. తాజాగా నాలుగో టెస్టులో ఆసీస్ ఇన్నింగ్స్‌లో ఓపెనర్ రోజర్స్ అవుట్ వివాదాస్పదమైంది. బ్రాడ్ వేసిన ఇన్నింగ్స్ 8వ ఓవర్లో రోజర్స్ క్యాచ్ అవుటైనట్లు అంపైర్ టోనీ హిల్స్ ప్రకటించారు. దీనిపై బ్యాట్స్‌మన్ రివ్యూ కోరగా... హాట్ స్పాట్లో బంతి బ్యాట్ అంచుకు తగల్లేదని స్పష్టమైంది. అయితే బంతి ప్యాడ్లను తాకుతూ కీపర్ చేతిలోకి వెళ్లడంతో ఎల్బీడబ్ల్యూ అయినట్లు నిర్ధారణ అయ్యింది. నిబంధనల ప్రకారం క్యాచ్ అవుట్ కోసమే రివ్యూ అడిగారు కాబట్టి అంపైర్... రోజర్స్‌ను నాటౌట్‌గా ప్రకటిస్తూ ఎల్బీడబ్ల్యూని పరిగణనలోకి తీసుకోలేదు. దీంతో ఇంగ్లండ్ కెప్టెన్ కుక్ అంపైర్‌తో వాగ్వాదానికి దిగాడు.