T20 World Cup 2022: Afghanistan-Ireland Match Abandoned Due To Rain At MCG - Sakshi
Sakshi News home page

T20 WC 2022: ప్రపంచకప్‌ను వెంటాడుతున్న వరుణుడు.. మరో మ్యాచ్‌ రద్దు

Published Fri, Oct 28 2022 11:29 AM | Last Updated on Fri, Oct 28 2022 12:07 PM

IRELAND vs Afghanistan Match abandoned without a ball being bowled due to rain - Sakshi

టీ20 ప్రపంచకప్‌-2022ను వరుణుడు వెంటాడుతూనే ఉన్నాడు. గ్రూప్‌-1లో భాగంగా మెల్‌బోర్న్‌ వేదికగా ఐర్లాండ్‌, ఆప్ఘనిస్తాన్ మధ్య జరగాల్సిన మ్యాచ్‌ కూడా వర్షం కారణంగా రద్దయ్యింది. ఒక బంతి  కూడా పడకుండానే అంపైర్లు ఈ మ్యాచ్‌ను రద్దు చేశారు.

దీంతో ఈ మెగా టోర్నీలో వరుణుడి ఖాతాలో మూడు మ్యాచ్‌లు చేరాయి. ఇక ఈ మ్యాచ్‌ రద్దు కావడంతో ఇరు జట్లకు చెరో పాయింట్‌ లభించింది. ఈ క్రమంలో పాయింట్ల పట్టికలో  గ్రూప్‌-1 నుంచి ఐర్లాండ్‌ 3 పాయింట్లతో  రెండో స్థానానికి చేరుకుంది.

ఇక వర్షం కారణంగా మ్యాచ్‌ ఆఫ్గానిస్తాన్‌కు ఇది రెండో సారి కావడం గమనార్హం. కాగా అంతకుముందు దక్షిణాఫ్రికా- జింబాబ్వే, ఆఫ్గానిస్తాన్‌-న్యూజిలాండ్‌ మ్యాచ్‌లు కూడా వర్షం కారణంగానే రద్దు  అయ్యాయి. ఇక ఇదే వేదికగా శుక్రవారం(ఆక్టోబర్‌ 28) జరగాల్సిన ఇంగ్లండ్‌-ఆస్ట్రేలియా మ్యాచ్‌పై కూడా నీలినీడలు కమ్ముకున్నాయి.


చదవండి: Ind Vs Ned: నాటి వరల్డ్‌కప్‌లో తండ్రి సచిన్‌ వంటి దిగ్గజాల వికెట్లు తీసి.. నేడు కొడుకు మాత్రం..

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement