ఏజెన్సీలో ఏనుగుల బీభత్సం | elephants damages to villages in vizianagaram agency area | Sakshi
Sakshi News home page

ఏజెన్సీలో ఏనుగుల బీభత్సం

Published Tue, Dec 22 2015 10:07 AM | Last Updated on Sun, Sep 3 2017 2:24 PM

elephants damages to villages in vizianagaram agency area

కురుపాం: విజయనగరం జిల్లా కురుపాం ఏజెన్సీలో ఏనుగులు బీభత్సం సృష్టించాయి. కురుపాం మండలం తిత్తిరి పంచాయతీ పరిధిలోని ఎగువగుండాం, దిగువగుండాం, గిరిశిఖర గ్రామాల్లో నాలుగు ఏనుగులు సంచరిస్తున్నాయి.

శ్రీకాకుళం జిల్లా సీతంపేట ఏజెన్సీ నుంచి ఏనుగులు ఇక్కడకు వచ్చినట్లు గిరిజనులు చెప్పుతున్నారు. వీటి దాడిలో ఇళ్లు, చర్చి పూర్తిగా ధ్వంసమయ్యాయి. కురుపాం అటవీ రేంజి అధికారి మురళీ కృష్ణ మంగళవారం ఉదయం ఇక్కడకు వచ్చి గిరిజనులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. స్థానికులు అప్రమత్తంగా ఉండాలని అటవీ అధికారులు సూచించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement