మళ్లీ వచ్చావా.. జర ఆగు.. నీకు రెండు పంచ్లిస్తా!
ఎక్కడైనా ఎవరైనా కొట్లాటకు దిగితే కోడి పుంజుల్లా ఢీకొంటున్నారనో, పొట్టేళ్ల తరహాలో తలపడుతున్నారనో అనడం సర్వసాధారణం. ఇవి తలపడితే ఎలా ఉంటుందో అందరికీ తెలుసు కాబట్టే మనుషుల కొట్లాటను వీటితో పోల్చుతూ ఉంటారు. పొట్టేళ్ల పందాలు ఏదైనా పండుగ వచ్చిన సందర్భంలోనే ఎక్కువగా నిర్వహిస్తూ ఉంటారు. పొట్టేళ్ల కొట్లాట అంటే జనానికి కూడా మహా సరదాగా ఉంటుంది.
మరి పండుగలప్పుడే కాకుండా ఎక్కడైనా పొట్టేళ్లు తలపడటం మన కంటపడితే కాసేపి ఆగి చూసి ముచ్చటపడిపోతూ ఉంటాం. ఇలా విజయనగరం జిల్లా, కురుపాం ఏజెన్సీ లో రెండు పొట్టేళ్లు కొట్లాడుకోవడం కెమెరాకు చిక్కడమే కాదు.. వైరల్‌గా కూడా మారింది. ముందు ఒక పొట్టేళు.. మరొక పొట్టేళు డొంకల్లోకి తోసేస్తే, ఆ తర్వాత ఆ పొట్టేళు కూడా సమరానికి సై అంటుంది. ఈసారి తానేంటో చూపెడతా అనే విధంగా పైకి ఎగిరి మరీ తలతో రెండు పంచ్‌లు ఇస్తుంది.