District Consumer Forum
-
డాక్టర్ చేసిన పనికి.. దిగొచ్చిన ఉబర్!
ఉబర్, ఓలా వంటి క్యాబ్ సర్వీసులు అందుబాటులోకి వచ్చిన తరువాత.. ఎప్పుడు ఎక్కడికి వెళ్లాలన్నా, క్యాబ్ బుక్ చేసుకుని వెళ్లిపోతున్నారు. క్యాబ్ బుక్ చేసుకున్న నిమిషాల్లో డ్రైవర్లు మన ముందు వాలిపోతుంటారు. అయితే కొంతమంది డ్రైవర్లు చేసే నిర్లక్ష్యం వల్ల వినియోగదారులు ఇబ్బందులకు గురవుతూ ఉంటారు.ఒక డాక్టర్ (Doctor) తెల్లవారుజామున 3.15 గంటలకు ఉబర్ రైడ్(Uber Ride) బుక్ చేసాడు. కానీ డ్రైవర్ ఎంతసేపటికీ రాకపోవడమే కాకుండా.. ఏ మాత్రం స్పందించలేదు. ఈ విషయాన్ని ఉబర్ కస్టమర్ సపోర్ట్‌కు తెలియజేయడానికి ప్రయత్నించినా ఫలితం లేకుండా పోయింది. దీంతో మరో క్యాబ్ బుక్ చేసుకుని ఆ డాక్టర్ విమానాశ్రయానికి చేరుకున్నాడు. అయితే ఆయన ప్రయాణించాల్సిన ఫ్లైట్ అప్పటికే వెళ్లిపోయింది.తాను వెళ్లాల్సిన ఫ్లైట్ మిస్ అవ్వడంతో.. మరో ఫ్లైట్‌కు టికెట్ బుక్ చేసుకుని గమ్యాన్ని చేరుకున్నాడు. అయితే తనకు కలిగిన అసౌకర్యానికి.. డాక్టర్ జిల్లా వినియోగదారుల కమిషన్‌లో కేసు దాఖలు చేశాడు. అయితే ఈ కేసు విచారణకు ఉబర్ ఇండియా హాజరు కాలేదు. చివరికి ఉబర్ ఇండియా వల్ల కలిగిన అసౌకర్యానికి కోర్టు.. డాక్టరుకు అనుకూలంగా తీర్పునిచ్చింది. ఈ తీర్పు రావడానికి మూడేళ్ళ సమయం పట్టింది.ఇదీ చదవండి: ఫోన్ మారితే ఉబర్ ఛార్జ్ మారుతోంది - ఫోటోలు వైరల్జిల్లా వినియోగదారుల కమిషన్ ఇచ్చిన తీర్పును తప్పుపడుతూ.. ఉబర్ ఇండియా ఢిల్లీ స్టేట్ కమీషన్ ముందు అప్పీల్ దాఖలు చేసింది. ఢిల్లీ స్టేట్ కన్స్యూమర్ కమిషన్ కూడా జిల్లా వినియోగదారుల కమిషన్ తీర్పును సమర్థిస్తూ.. ఉబర్ ఇండియా (Uber India) 45 రోజుల్లో 54,100 రూపాయలు డాక్టరుకు చెల్లించాలని ఆదేశించింది. ఈ డబ్బు చెల్లించడంలో ఆలస్యమైతే 6 శాతం వడ్డీ చెల్లించాలని వెల్లడించింది. ఇందులో రూ. 24100 అదనంగా టికెట్ కొనుగోలు చేసినందుకు, అతని మానసిక ఒత్తిడికి రూ. 30,000 అని తెలిపింది. -
ట్రాన్స్‌కోకు ‘ఫోరం’ షాక్
సంగారెడ్డి క్రైం : విద్యుత్ పనులు సకాలంలో చేపట్టడంలో నిర్లక్ష్యం ప్రదర్శించిన ట్రాన్స్‌కోకు జిల్లా వినియోగదారుల ఫోరం షాకిచ్చింది. వివరాల్లోకి వెళితే.. కరీంనగర్ జిల్లా హుస్నాబాద్‌కు చెందిన కూస వీరారెడ్డి కుటుంబంతో సిద్దిపేటలో నివాసముంటున్నాడు. తన పొలంలో కరెంట్ తీగలు ప్రమాదకరంగా మారిందని, వాటికి మరమ్మతులు చేపట్టాలని సిద్దిపేటలోని ట్రాన్స్‌కో శాఖ అధికారులకు పలుమార్లు విన్నవించారు. అయినా వారు పట్టించుకోలేదు. ఈ క్రమంలో 2011 జూన్ 18న పొలంలో బోరు మోటారు స్విచ్ ఆన్ చేయబోయిన వీరారెడ్డి విద్యుదాఘాతానికి గురై మృతి చెందాడు. తన భర్తకు విద్యుత్ శాఖ నిర్లక్ష్యమే కారణమని ఆరోపిస్తూ, తనకు నష్టపరిహారం చెల్లించాలని మృతుడి భార్య కూస పద్మ ట్రాన్స్‌కో శాఖపై వినియోగదారుల ఫోరాన్ని 2013 ఫిబ్రవరి 8వ తేదీన ఆశ్రయించింది. కేసు పూర్వాపరాలు పరిశీలించిన అనంతరం బాధితురాలికి రూ. 5 లక్షల నగదుతో పాటు రూ. 2వేలు ఖర్చుల నిమిత్తం చెల్లించాలని ఫోరం అధ్యక్షుడు పాటిల్ విఠల్‌రావు ఆదేశాలు జారీ చేశారు. ఇన్సూరెన్స్ కంపెనీపై..... ఇన్సూరెన్స్ కిస్తీలు చెల్లించినప్పటికీ పాలసీని రద్దు చేసిన బజాజ్ అలయంజ్ ఇన్సూరెన్స్ కంపెనీపై జిల్లా వినియోగదారుల ఫోరం ఆగ్రహం వ్యక్తం చేసింది. జహీరాబాద్ మండలం బూచినెల్లి గ్రామానికి చెందిన బ్యాగరి మల్లమ్మ సంగారెడ్డిలోని బజాజ్ అలయంజ్ ఇన్సూరెన్స్ కంపెనీ, సంగారెడ్డిలో 2009 అక్టోబర్ 10న సంవత్సరానికి రూ. 10 వేలు చొప్పున రెండేళ్లకు కలిపి మొత్తం రూ. 20 వేలు చెల్లించి ఇన్సూరెన్స్ తీసుకుంది. మూడో ప్రీమియం రూ. 10 వేలు ఏజెంట్‌కు చెల్లించింది. కాగా 2013 అక్టోబర్ 12వ తేదీన పాలసీ రద్దు అయినట్లు కంపెనీ నుంచి ఆమెకు లేఖ ద్వారా సమాచారం అందించారు. తాను ఏజెంట్ ద్వారా రూ. 10 వేలు చెల్లించినప్పటికీ పాలసీ ఎలా రద్దు చేస్తారని ఆమె జిల్లా వినియోగదారుల ఫోరాన్ని ఆశ్రయించింది. కేసు పూర్వాపరాలు పరిశీలించిన అనంతరం బాధితురాలికి రూ. 30 వేలు నష్టపరిహారంతో పాటు 9 శాతం వడ్డీ, రూ. 5 వేలు ఖర్చుల నిమిత్తం చెల్లించాలని ఫోరం అధ్యక్షుడు పాటిల్ విఠల్‌రావు ఆదేశాలు జారీ చేశారు.