బెంగళూరు: యాప్ ఆధారిత క్యాబ్ సేవలు అందించే సంస్థలైన ఓలా, ఉబర్, రాపిడోలకు కర్ణాటక హైకోర్టులో ఊరట లభించింది. అధిక ధరలు వసూలు చేస్తున్నారని ఆ రాష్ట్ర ప్రభుత్వం ఆటో సర్వీసులపై విధించిన నిషేధంపై మధ్యంతర స్టే విధిస్తూ తీర్పు వెలువరించింది. సంబంధిత చట్టాల ప్రకారం ఆటో సర్వీసు ధరలను నిర్ణయించాలని కర్ణాటక ప్రభుత్వాన్ని ఆదేశించింది.
అదనపు ఛార్జీల వసూళ్లపై 10-15 రోజుల్లో నివేదిక సమర్పించాలని, అప్పటి వరకు రైడ్-హెయిలింగ్ ప్లాట్‌ఫారమ్‌లైన ఓలా, ఉబర్, ర్యాపిడోలపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని అధికారులకు సూచించింది. తదుపరి విచారణను 2022, నవంబర్ 7కు వాయిదా వేసింది. అధికారులు ధరలు నిర్ణయించే వరకు ఆటో సేవలపై కనీస ఛార్జీలపై 10 శాతం అదనపు ధరతో పాటు 5 శాతం జీఎస్‌టీ విధించుకోవచ్చని యాప్ అగ్రిగేటర్స్‌కు అనుమతులిచ్చింది. గతంలో గతంలో ఆటో అగ్రిగేటర్లు ఒక్కో రైడ్‌కు 40 కన్వీనియన్స్ ఫీజుగా వసూలు చేసేవారు.
కోర్టు ఆదేశాలను తాము స్వాగతిస్తున్నామని, దీని ద్వారా యాప్ ఆధారితంగా ఆటో డ్రైవర్లు సేవలందించేందుకు వీలు కలుగుతుందని ఉబర్ ఓ ప్రకటన చేసింది. ఉబర్ వంటి యాప్ ఆధారిత సంస్థలు తమ సేవలకు ఛార్జీలు వసూలు చేస్తాయనేదానికి గుర్తింపు లభిస్తుందని పేర్కొంది.మరోవైపు.. బెంగళూరులో సేవలను నిలిపిసేన బైక్ టాక్సీ అగ్రిగేటర్ రాపిడో ఎలాంటి పిటిషన్ దాఖలు చేయలేదు. కర్ణాటక ప్రభుత్వం అక్టోబర్ 6 ఇచ్చిన నోటీసులు ఆటో డ్రైవర్స్ హక్కులను కాలరాస్తున్నాయని ఓలా, ఉబర్ న్యాయ ప్రతినిధులు పేర్కొన్నారు.
ఇదీ చదవండి: సంచలనం: ఓలా, ఉబెర్, ర్యాపిడో ఆటో సర్వీసులపై నిషేధం
Comments
Please login to add a commentAdd a comment