Anand Mahindra, Ambani, Bumped Into Sunita Williams Epic Selfie Viral - Sakshi
Sakshi News home page

అమెరికాలో అంబానీ, మహీంద్ర ఉబెర్‌ కష్టాలు: మిలియన్‌ డాలర్ల సెల్ఫీ వైరల్‌

Published Sun, Jun 25 2023 2:51 PM | Last Updated on Sun, Jun 25 2023 3:24 PM

Anand Mahindra Ambani bumped into Sunita Williams epic selfie viral - Sakshi

భారతదేశంలోని అత్యంత సంపన్న వ్యక్తులు ఉబెర్ కోసం ప్రయత్నించారంటే నమ్ముతారా? కానీ ఇటీవల అమెరికాలో అదే జరిగింది. ఈ సందర్భంగా బిలియనీర్ ముఖేష్ అంబానీ, పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా ఎపిక్‌ సెల్ఫీవైరల్‌గా మారింది. ఏమీ అర్థం కాలేదు కదా? అసలేం జరిగిందో తెలియాలంటే.. ఈ స్టోరీ చదవాల్సిందే. (రెస్టారెంట్ టూ స్టార్టప్ ఫండింగ్: సురేష్‌ రైనా నెట్‌వర్త్‌ తెలిస్తే షాకవుతారు)

మహీంద్రా గ్రూప్ చైర్మన్ , రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ఇద్దరూ వైట్‌హౌస్‌లో  ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గౌరవార్థం ఏర్పాటు చేసిన డిన్నర్‌కి హాజరైన సంగతి తెలిసిందే. స్టేట్ డిన్నర్ తర్వాత, ఇండియా యుఎస్ మధ్య జరిగిన హైటెక్ హ్యాండ్‌షేక్ సమావేశానికి  కూడా వీరు హాజరయ్యారు. వీరితోపాటు ఓపెన్‌ ఏఐ  సీఈవో సామ్ ఆల్ట్‌మాన్, గూగుల్‌ సీఈవో సుందర్ పిచాయ్‌, యాపిల్‌ సీఈవో టిమ్ కుక్ తదితర దిగ్గజాలు కూడా ఈ మీటింగ్‌నకు హాజరైనారు. 

అయితే అంబానీ  ఆనంద్ మహీంద్రా యూఎస్‌  సెక్రటరీ ఆఫ్ కామర్స్ గినా రైమోండో  3rdiTech సహ వ్యవస్థాపకురాలు బృందా కపూర్‌తో మాటల్లో పడి  , తర్వాతి లంచ్ అపాయింట్‌మెంట్‌కి వెళ్లాలన్న విషయాన్ని మర్చిపోవడంతో వీరిందరినీ అక్కడికి చేర్చాల్సిన గ్రూపు షటిల్‌ను మిస్‌ అయిపోయారు. చివరికి ఉబెర్‌ కోసంప్రయత్నిస్తుండగా హై-టెక్ హ్యాండ్‌షేక్ కాన్ఫరెన్స్‌కు హాజరైన నాసా వ్యోమగామి సునీతా విలియమ్స్‌ ని  కలిశారు. (సింగిల్‌ బ్రాండ్‌తో 100 కోట్ల డీల్‌ కుదుర్చుకున్న తొలి ఇండియన్‌ క్రికెటర్‌ ఎవరో తెలుసా? )

ఈ సందర్భాన్ని ట్విటర్‌లో అభిమానులతో పంచుకున్న ఆనంద్‌ మహీంద్ర బహుశా దీన్ని వాషింగ్టన్‌ మూమెంట్‌ అంటారేమో. ఇదే శక్తివంతమైన సెల్ఫీకి దారితీసింది అంటూ అంబానీ, సునీతా విలియమ్స్, బృందా కపూర్‌లతో ఉన్న సెల్ఫీని ట్వీట్ చేశారు. ఉబెర్‌కి కాల్ చేయడానికి ప్రయత్నిస్తున్నాం. కానీ ఉబర్‌కు బదులుగా సునీతా  స్పేస్ షటిల్‌లో వెళదామా అని సునీతాని  అడిగామంటూ  వెల్లడించారు. ఈ సెల్ఫీపై పలువురు నెటిజన్లు సంతోషంగా స్పందించారు.  ఇది 10 లక్షలకు పైగా వ్యూస్‌, 40 వేలకు పైగా లైక్స్‌తో వైరలైంది. (వైట్‌హౌస్‌ స్టేట్ డిన్నర్‌: నీతా అంబానీ చీరల విశేషాలేంటో తెలుసా?)

చాలా అరుదుగా కలుసుకున్నప్పుడు సాధారణంగా ఏం మాట్లాడుకుంటారు నిజంగా తెలుసుకోవాలని ఉంది..వ్యాపారం, ప్రయాణం, ఈవెంట్ ఏదైనా.. ఎలాంటి జోకులు వేసుకుంటారంటూ జేకే జ్యుయలర్ల్‌ వినీత్‌ చమత్కరించారు. గొప్ప వక్తులు.. ఒకే ఫ్రేమ్‌లో.. ప్రైడ్‌ ఆఫ్‌ ఇండియా అంటూ మరొకరు  కామెంట్‌ చేయడం విశేషం.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement