ఆన్‌లైన్‌లో ఫుడ్ ఆర్డర్ చేయటం ఒకెత్తయితే.. దారి మర్చిపోయిన డెలివరీ బాయ్‌కి అడ్రస్ చెప్పటం మరో ఎత్తు. రాత్రి వేళల్లో అయితే ఈ పని మరింత కష్టంగా ఉంటుంది. మనం చెప్పే దానికి చీకట్లో అతడు చూసే దానికి పొంతన లేక.. ఆకలి చచ్చిపోయేవరకు అతడికి రూటు చెబుతూ కూర్చోవాల్సి వస్తుంది. ఇలాంటి సమస్యను ఎదుర్కోవటానికి ఓ చక్కటి ఉపాయం ఆలోచించాడు ఓ కస్టమర్. ఫుడ్ డెలివరీ బాయ్‌కి అడ్రస్ చెప్పటానికి బ్లూ బీమ్ లైట్‌ను వాడాడు. కొద్దిరోజుల క్రితం ఓ రాత్రి ‘‘ఎస్పీఎక్స్‌సీ’’ ట్విటర్ ఖాతాదారుడు ఊబర్ ఫుడ్స్‌లో ఫుడ్ ఆర్డర్ చేశాడు. ఫుడ్ డెలివరీ బాయ్ ఆయన ఇంటిని కనుక్కోలేక ఫోన్ చేశాడు. దీంతో డెలివరీ బాయ్‌కి అడ్రస్ చెప్పటానికి బ్లూ బీమ్ లైట్‌ను ఉపయోగించాడాయన.
అతడు వస్తున్న వైపు లైటు వేసి ‘ఆకాశాన్ని చూడు.. బ్లూ లైటు వెంబడి రా!’ అని చెప్పాడు. డెలివరీ బాయ్ మొదట తికమకకు గురైనా తర్వాత బ్లూ లైటు వెంట ఇంటికి వచ్చేశాడు. ఇందుకు సంబంధించిన విషయాన్ని ఎస్పీఎక్స్‌సీ తన ట్విటర్ ఖాతాలో షేర్ చేశాడు. దీంతో ఈ హ్యాకింగ్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీనిపై స్పందిస్తున్న నెటిజన్లు.. ‘‘ నేను కూడా ఇలాంటి హ్యాక్‌ను వాడతాను..’’ ‘‘నా జీవితంలో ఇలాంటి బీమ్ లైట్‌లు చాలా అవసరం’’ .. ‘‘ఇలాంటి ఐడియాలు ఎలా వస్తాయ్ మీకు!’’.. ‘‘ సూపర్: ఇలా కూడా అడ్రస్ చెప్పొచ్చా?’’ అంటూ కామెంట్లు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment