పిల్లలు ఆకలి అనడంతో ఆన్‌లైన్‌లో ఫుడ్ ఆర్డర్ చేసింది ఓమహిళ. ఆర్డర్ పెట్టిన తర్వాత తన అడ్రస్ బదులు స్నేహితురాలి ఇంటి చిరునామా ఇచ్చినట్లు గుర్తించింది. వెంటనే డెలివరీ బాయ్‌కు కాల్ చేసి.. ఆర్డర్‌లో ఉన్న అడ్రస్‌కు కాకుండా.. తన ఇంటికి ఫుడ్ తీసుకురమ్మని కోరింది. అందుకు అంగీకరించని డెలివరీ బాయ్.. ఆమె ఆర్డర్ చేసిన ఆహారాన్ని చెత్తలో పడేసి వెళ్లిపోయాడు. ఈ విషయాన్ని ఆమె సోషల్ మీడియాలో షేర్ చేయడంతో సదరు డెలివరీ బాయ్‌పై విమర్శలు కురిపిస్తున్నారు నెటిజనులు. ఆ వివరాలు..
ఈ సంఘటన ఎక్కడ జరిగింది అనే వివరాలు తెలియవు. జీనెట్ ఎరిక్సన్-గ్రే అనే మహిళ తన ఏడు సంవత్సరాల కుమార్తె కోసం ఉబర్ ఈట్స్‌లో మెక్‌డోనాల్డ్స్ హ్యాపీ మీల్స్ ఆర్డర్ చేసింది. ఆ తర్వాత అడ్రస్‌లో తన ఇంటి చిరునామాకు బదులు.. ఫ్రెండ్ అడ్రస్ ఉన్నట్లు గుర్తించింది. వెంటన్ డెలివరీ బాయ్‌కు కాల్ చేసి.. అడ్రస్ తప్పుగా ఉంది.. అందులో ఉన్న చిరునామాకు కాకుండా.. ఇప్పుడు తాను చెప్పబోయే అడ్రస్‌కు ఆర్డర్ తీసుకురావాల్సిందిగా కోరింది.
(చదవండి: కాఫీ లేట్ అవుతుందని చెప్పినందుకు ఎత్తి పడేసింది.. అంతా షాక్!)
అందుకు డెలివరీ బాయ్ ఒప్పుకోలేదు. ‘‘మొదట ఇచ్చిన అడ్రస్‌కే ఆర్డర్ తీసుకువచ్చి ఇస్తాను అన్నాడు. కావాలంటే మీరే మీ స్నేహితురాలి ఇంటికి రండి’’ అని తెలిపాడు. అందుకు ఆ మహిళ బయట వర్షం వస్తుంది.. ఆర్డర్‌లో ఉన్న అడ్రస్‌కు సమీపంలోనే మా ఇల్లు ఉంది.. దయచేసి రండి.. కావాలంటే ఎక్స్‌ట్రా మనీ పే చేస్తాను అని తెలిపింది. తన ఇంటి అడ్రస్‌ని సెండ్ చేసింది. కానీ డెలివరీ బాయ్ అందుకు ససేమీరా అన్నాడు.
ఆ తర్వతా సదరు డెలివరీ బాయ్ జీనెట్‌కు ఓ ఫోటో షేర్ చేశాడు. మీ ఆర్డర్‌ని ఇక్కడ పడేశాను.. వెళ్లి తీసుకోండి అని మెసేజ్ చేశాడు. తీరా చూస్తే అది తన స్నేహితురాలి ఇల్లు కూడా కాదు.. ఎక్కడో రోడ్డు పక్కన చెత్తలో తాను ఆర్డర్ చేసిన ఫుడ్‌ని పడేసి వెళ్లాడు. ఇక చేసేదేం లేక జీనెట్ తన పిల్లలను తీసుకుని.. డెలివరీ బాయ్ పంపిన ఫోటోలోని చోటకు వెళ్లింది. కానీ అక్కడ వారికి తాము ఆర్డర్ చేసిన ఫుడ్ కనిపించలేదు. చేసేదేం లేక ఉత్త చేతులతో అక్కడ నుంచి వచ్చేశారు.
(చదవండి: ఆమె కోపం.. రూ.8కోట్లు తెచ్చింది)
ఇక దీని గురించి జీనట్ ఉబర్ యాప్‌లో ఫిర్యాదు చేసింది. డబ్బులు వెనక్కి ఇవ్వాల్సిందిగా కోరింది. కానీ వారు అంగీకరించలేదు. జరిగిన సంఘటన గురించి జీనట్ సోషల మీడియాలో షేర్ చేయగా.. సదురు డెలివరీ బాయ్‌ని ట్రోల్ చేస్తున్నారు నెటిజనులు. వ్యవహారం కాస్త ముదరడంతో ఉబర్ యాజమాన్యం దీనిపై స్పందించింది.
‘‘మా డెలివరీ బాయ్ ప్రవర్తించిన తీరు పట్ల విచారం వ్యక్తం చేస్తున్నాం. జీనట్‌కు క్షమాపణలు తెలుపుతున్నాం. ఆమె డబ్బులను పూర్తిగా తిరిగి ఇవ్వడమేకాక.. ఉబర్ ఈట్స్ క్రెడిట్‌ని జీనట్‌కు టిప్‌గా ఇస్తున్నాం’’ అని తెలిపారు. కానీ జీనట్ మాత్ర మళ్లీ జన్మలో ఉబర్‌లో ఫుడ్ ఆర్డర్ చేయనని తెలిపింది.
చదవండి: మెక్‌డొనాల్డ్స్ ఫుడ్ ఆర్డర్ చేసుకోండి: బర్గర్ కింగ్
Comments
Please login to add a commentAdd a comment