ఆస్ట్రేలియాలో ఉబెర్‌కు ఎదురుదెబ్బ | Uber is a setback to Australia | Sakshi
Sakshi News home page

ఆస్ట్రేలియాలో ఉబెర్‌కు ఎదురుదెబ్బ

Published Sat, May 4 2019 12:50 AM | Last Updated on Sat, May 4 2019 12:50 AM

Uber is a setback to Australia - Sakshi

న్యూఢిల్లీ: ఐపీవోకు సిద్ధమవుతున్న ట్యాక్సీ సేవల సంస్థ ఉబెర్‌కు ఆస్ట్రేలియాలో ఎదురుదెబ్బ తగిలింది. చట్ట విరుద్ధంగా అనుచిత ప్రయోజనాలను పొందుతూ తమ ఉపాధిని నాశనం చేసిందని వేల మంది స్థానిక ట్యాక్సీ డ్రైవర్లు ఆస్ట్రేలియాలో క్లాస్‌ యాక్షన్‌ దావా వేశారు. సరైన లైసెన్సులు లేని డ్రైవర్ల ద్వారా పర్మిట్లు లేని వాహనాలు నడిపి ఉబెర్‌ చట్టాలను ఉల్లంఘించిందని వారు ఆ దావాలో పేర్కొన్నారు. ఉబెర్‌ చర్యల కారణంగా తాము కోల్పోయిన మొత్తం ఆదాయాన్ని తిరిగి చెల్లించాలని ట్యాక్సీ డ్రైవర్లు ఆ దావాలో కోరినట్లు వారి తరఫున కేసు వేసిన లా సంస్థ మారీస్‌ బ్లాక్‌బర్న్‌ పేర్కొంది. ఇది ఆస్ట్రేలియా చరిత్రలోనే అతి పెద్ద క్లాస్‌ యాక్షన్‌ దావాగా మారుతున్నట్లు సంస్థ తెలియజేసింది. ఆస్ట్రేలియాలో ఉబెర్‌ చట్టవిరుద్ధ కార్యకలాపాల విషయంలో కోర్టు ఇచ్చే తీర్పు మైలురాయిగా నిలిచిపోతుందని పేర్కొంది.

నిజంగానే ఉబెర్‌కు వ్యతిరేకంగా తీర్పు వస్తే కంపెనీపై ఎంత మేర ప్రతికూల ప్రభావం ఉంటుందన్న దానిపై ఇంకా స్పష్టత లేదు. ఉబెర్‌ కేసు ఓడిపోయి పరిహారాలు చెల్లించాల్సి వచ్చినా.. బిలియన్ల కొద్దీ డాలర్ల ఆదాయమున్న కంపెనీకి మిలియన్ల డాలర్ల పరిహారం చెల్లింపు పెద్ద సమస్య కాబోదని పరిశ్రమ వర్గాల అంచనా. అయితే ఉబెర్‌కు పొంచి ఉన్న చట్టపరమైన రిస్కుల గురించి ఇన్వెస్టర్లకు కనీసం హెచ్చరికలాంటిదైనా ఇచ్చినట్లవుతుందని సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. ఏది ఏమైనా అమెరికాలో 10 బిలియన్‌ డాలర్ల ఇనీషియల్‌ పబ్లిక్‌ ఇష్యూ (ఐపీవో)కు సిద్ధమవుతున్న తరుణంలో ఉబెర్‌కు ఇలాంటి పరిణామాలు ఇబ్బందికరమేనని ఆ వర్గాలు అభిప్రాయపడ్డాయి. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement