
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ప్రయాణ సేవలు అందిస్తున్న ఉబర్ టెక్నాలజీస్ ఈ ఏడాది డిసెంబర్ నాటికి కొత్తగా 500 మంది సాంకేతిక నిపుణులను నియమించుకోనుంది. హైదరాబాద్, బెంగళూరులోని సంస్థ కార్యాలయాల్లో ఇప్పటికే 1,000 మంది సిబ్బంది పనిచేస్తున్నారు. 2021లో 250 మందిని చేర్చుకున్నట్టు కంపెనీ ప్రకటించింది. భారత్ పట్ల సంస్థ నిబద్ధతను, దేశంలోని ఇంజనీరింగ్ ప్రతిభను గుర్తించడాన్ని ఈ నియామక ప్రణాళిక నొక్కి చెబుతుందని ఉబర్ ఒక ప్రకటనలో తెలిపింది.
చదవండి: క్యాబ్ అగ్రిగేటర్లపై కేంద్రం సీరియస్
Comments
Please login to add a commentAdd a comment