
తుపాకీతో పట్టుబడిన వ్యక్తి సతీష్
హైదరాబాద్ : ఉప్పల్ మెట్రో స్టేషన్లో మంగళవారం రాత్రి తుపాకీ కలకలం రేగింది. ఓ వ్యక్తి ఉప్పల్ నుంచి కూకట్ పల్లికి మెట్రోరైలులో వెళ్లే సమయంలో మెట్రో సిబ్బంది బంధించి ఉప్పల్ పోలీసులకి సమాచారం ఇచ్చారు. ఎనిమిది రౌండ్లు కల్గిన తుపాకీని పోలీసులు స్వాధీన పరుచుకుని నిందితుడిని ఉప్పల్ పీఎస్‌కి తరలించారు. నిందితుడు తన పేరు సతీష్ అని చెప్పాడు.
తాను భూపాలపల్లి జిల్లా కాటారం జెడ్పీటీసీ చల్లా నారాయణ రెడ్డి కారు డ్రైవర్‌నని పోలీసులకు చెప్పాడు. నారాయణ రెడ్డి వ్యాపార పనుల నిమిత్తం పూణె వెళ్లడంతో తనకు తుపాకీ ఇచ్చి వెళ్లాడని చెప్పాడు. పోలీసుల విచారణలో నారాయణరెడ్డి పేరు మీదే తుపాకీ రిజిస్టరై ఉన్నట్లు తెలిసింది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Comments
Please login to add a commentAdd a comment