సాక్షి, హైదరాబాద్: ‘మెట్రోరైల్ ప్రాజెక్టు ఫేజ్–1లో పాత బస్తీ పరిధిలోని ఫలక్‌నుమా కారిడార్ కూడా ఉంది. నగరం మొత్తం ఫేజ్–1 పనులు జరుగుతున్నా పాతబస్తీలో మాత్రం ప్రారంభించలేదు. పాతబస్తీ వాసులు మెట్రో రైలు ఎక్కకూడదా?, మెట్రో రైలు చూడాలంటే కొత్త నగరనికి రావాల్సిందేనా?’ అని ప్రభుత్వంపై బీజేపీ ఆగ్రహం వ్యక్తం చేసింది.
పాతబస్తీకి మెట్రో రాకుండా జరుగుతున్న నిర్లక్ష్యానికి కారణమేంటని బీజేఎల్పీ నేత కిషన్‌రెడ్డి ప్రశ్నించారు. అసెంబ్లీలో ప్రశ్నోత్తరాల సమయంలో ఎంఐఎం సభ్యులు అడిగిన ప్రశ్నకు మంత్రి కేటీఆర్ సమాధానం చెబుతున్న సమయంలో కిషన్‌రెడ్డి జోక్యం చేసుకుని పాతబస్తీపై జరుగుతున్న నిర్లక్ష్యంపై ప్రశ్నించారు. మంత్రి సమాధానానికి సంతృప్తి చెందని బీజేపీ సభ్యులు సభ నుంచి వాకౌట్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment