సాక్షి, హైదరాబాద్: పాత బస్తీలో మెట్రో పనులు వెంటనే ప్రారంభించాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ డిమాండ్ చేశారు. ఎంఐఎం ఒత్తిడికి ప్రభుత్వం తలొగ్గుతోందని, పాత బస్తీలో మెట్రో రైలు కోసం రాజకీయ పోరాటం చేస్తామని హెచ్చరించారు. తార్నాక నుంచి అమీర్పేట్ వరకు ఆయన మెట్రో రైలులో ఆదివారం ప్రయాణించారు. ఈ సందర్భంగా మెట్రోలో ప్రయాణికులతో మాట్లాడి వారి అభిప్రాయాలు తెలుసుకున్నారు. మెట్రో ప్రయాణం సామాన్యులకు భారం అవుతోందని, చార్జీలు తగ్గించాలని కోరారు. మెట్రో స్టేషన్ లలో పార్కింగ్ లేదంటూ పార్కింగ్ వసతులను కల్పించాలని సూచించారు.
Comments
Please login to add a commentAdd a comment