Old City
-
హైదరాబాద్ పాతబస్తీలో మరోసారి ఐసిస్ కలకలం
-
హైదరాబాద్ పాతబస్తీలో పేలుడు
-
పాతబస్తీలో ముజ్ర పార్టీ.. వీడియోలు లీక్
-
లాల్ దర్వాజా బోనాలు..
-
కాలిబాటలో కదిలే స్తంభాలు
సాక్షి, సిటీబ్యూరో : చార్మినార్ పరిసరాలను ముస్తాబు చేస్తున్న జీహెచ్ఎంసీ మరో అడుగు ముందుకేసింది. అమృత్‌సర్‌లోని స్వర్ణ దేవాలయం మాదిరిగా ఇక్కడ పాదచారులు తప్ప వాహనాలు వెళ్లేందుకు వీల్లేకుండా ‘బొల్లార్డ్స్’(కదిలే స్తంభాలు) ఏర్పాటు చేసేందుకు రంగం సిద్ధమైంది. వివిధ మార్గాల నుంచి వచ్చి చార్మినార్‌కు చేరుకునే మార్గాల్లో వాహన నిషేధిత పాదచారుల జోన్లో వాహనాలు ముందుకు వెళ్లకుండా ఉండేందుకు వీటిని ఏర్పాటు చేస్తారు. ఇందులో భాగంగా స్థిరంగా ఉండేవి.. కదిలేవి(హైడ్రాలిక్)కూడా ఏర్పాటు చేయనున్నారు. అత్యవసర సమయాల్లో అంబులెన్స్‌లు, ఫైరింజన్లు వంటి వాహనాలు ప్రయాణించేందుకు, వీవీఐపీలు వచ్చేందుకు అనువుగా భూమిలోకి వెళ్లిపోయేలా వీటిని బిగిస్తారు. స్థిరంగా ఉండే వాటితోపాటు హైడ్రాలిక్ బొల్లార్డ్స్ ఏర్పాటుకు రూ. 2.38 కోట్లు ఖర్చు కానుంది. ఇందుకు స్టాండింగ్ కమిటీ సైతం ఆమోదం తెలిపింది. పాదచారుల పథకంలో భాగంగా చార్మినార్ నాలుగువైపులా వాహనాల్ని నిషేధిస్తూ పాదచారుల జోన్‌ను గ్రానైట్ కాబుల్స్తో ప్రత్యేకంగా రూపొందించడం తెలిసిందే. వాహనాల నిరోధంతో పాటు వాయు కాలుష్యం లేకుండా చేసేందుకు బొల్లార్డ్స్‌ను ఏర్పాటు చేయాల్సిందిగా కొంతకాలం క్రితం చార్మినార్‌ను సందర్శించిన మున్సిపల్ పరిపాలనశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ అర్వింద్‌కుమార్ అధికారులకు సూచించారు. అమృత్‌సర్‌లోని స్వర్ణదేవాలయం వద్ద బొల్లార్డ్‌లను ఏర్పాటు చేసిన అహ్మదాబాద్ కంపెనీని సంప్రదించారు. దాని కొటేషన్ల మేరకు రూ.2.38 కోట్లు ఖర్చు చేయనున్నారు. రూ.47.10 కోట్లతో ఆర్ఓబీ.. ఫలక్‌నుమా వద్ద ప్రస్తుతం ఉన్న ఆర్ఓబీకి సమాంతరంగా మరో ఆర్ఓబీని నిర్మించేందుకు రూ.47.10 కోట్ల ప్రతిపాదనలకు సైతం స్టాండింగ్ కమిటీ ఆమోదం తెలిపింది. సికింద్రాబాద్– ఫలక్‌నుమా బ్రాడ్‌గేజ్ మార్గంలో ఫలక్‌నుమా వద్ద ప్రస్తుతం ఉన్న ఆర్ఓబీ అక్కడి రద్దీకి సరిపోవడం లేదు. దాంతో తరచూ ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఈ సమస్య పరిష్కరించాలని ప్రజలతో పాటు స్థానిక ప్రజా ప్రతినిధులు సైతం ఎంతోకాలంగా కోరుతున్నారు. అందుకు స్టాండింగ్ కమటీ ఆమోదం తెలిపింది. త్వరలో పనులు చేపట్టనున్నారు. వీటితోపాటు ప్రస్తుతం డిప్యూటీ కమిషనర్లుగా పనిచేస్తున్న వారిని సర్కిల్ కమిషనర్లుగా రీ–డిజిగ్నేట్ చేస్తూ ప్రభుత్వానికి ప్రతిపాదన పంపేందుకు ఆమోదం తెలిపారు. మూడో సారీ అతడు.. ప్రస్తుత స్టాండింగ్ కమిటీ సమావేశం గడువు ముగిసిపోవడంతో పాటు కొత్త స్టాండింగ్ కమిటీ ఎన్నికను నామినేషన్ల గడువు కూడా గురువారంతో ముగిసింది. ఎప్పటిలాగే తొమ్మిది మంది టీఆర్ఎస్, ఆరుగురు ఎంఐఎం సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యేందుకు వీలుగా ఆయా పార్టీల నుంచి నామినేషన్లు దాఖలైనట్లు తెలిసింది. గడచిన రెండు స్టాండింగ్ కమిటీల్లో సభ్యుడిగా ఉన్న రామ్‌నగర్ కార్పొరేటర్ శ్రీనివాసరెడ్డి మూడో స్టాండింగ్ కమిటీకి నామినేషన్ వేసినట్లు సమాచారం. శ్రీనివాస్‌రెడ్డి హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి అల్లుడనే విషయం తెలిసిందే. నామినేషన్లు దాఖలు చేసిన వారి వివరాలు శుక్రవారం అధికారికంగా ప్రకటించనున్నారు. గురువారం సమావేశానికి మేయర్ రామ్మోహన్ అధ్యక్షత వహించగా కమిషనర్ జనార్దన్‌రెడ్డి, జోనల్, అడిషనల్ కమిషనర్లు పాల్గొన్నారు. -
పాత ‘బస్తీ మే సవాల్’..!
సాక్షి, హైదరాబాద్: మజ్లిస్ పార్టీతో అమీతుమీకి కాంగ్రెస్ పార్టీ సిద్ధమైంది. ఎంఐఎంకు పట్టున్న పాతబస్తీలో సత్తా చాటేందుకు హస్తం పార్టీ వ్యూహం రచిస్తోంది. ఇన్నాళ్లూ ఎంఐఎంతో అవగాహన కుదుర్చుకుని పాతబస్తీ రాజకీయాలు చేసిన కాంగ్రెస్ ఇప్పుడు ఆ పార్టీని లక్ష్యంగా చేసుకుని పావులు కదుపుతోంది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు, అనంతర పరిణామాలతో పాటు దేశవ్యాప్తంగా ఎంఐఎం అనుసరిస్తున్న తీరును దృష్టిలో ఉంచుకుని మజ్లిస్‌తో తాడోపేడో తేల్చుకోవాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా వచ్చే ఎన్నికల్లో మజ్లిస్ గెలిచే అవకాశమున్న అసెంబ్లీ స్థానాల్లో కనీసం నాలుగింటికైనా ఎసరు పెట్టేలా ప్రణాళికలు రచిస్తోంది. ఇప్పటి నుంచే అభ్యర్థుల వేటలో దిగిన పీసీసీ పెద్దలు.. దారుస్సలాంను దెబ్బతీసే బాధ్యతలను భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ మహ్మద్ అజారుద్దీన్‌కు అప్పగించనున్నారు. ఆ నాలుగింటిలో.. పాతబస్తీలో ఎంఐఎం ఆధిపత్యానికి గండికొట్టడం అంత సులువైన పనేమీ కాదు. దశాబ్దాలుగా ఆ పార్టీకి అండగా నిలుస్తున్న ఆరేడు నియోజకవర్గాల్లో దారుస్సలాం మాటే వేదం. అలాంటి చోట ఇన్నాళ్లూ మిత్రపక్షంగా ఉండి ఇప్పుడు టార్గెట్ చేయాల్సి రావడాన్ని కాంగ్రెస్ సవాల్‌గా తీసుకుంది. మజ్లిస్ గెలిచే అవకాశమున్న యాకుత్‌పుర, బహుదూర్‌పుర స్థానాల్లో కదిలించడం కష్టమేననే అంచనాకు వచ్చిన కాంగ్రెస్ మిగిలిన స్థానాలపై గురిపెట్టింది. ఎంఐఎంకు ఆయువుపట్టు లాంటి చార్మినార్, చాంద్రాయణగుట్ట, నాంపల్లి అసెంబ్లీ స్థానాలను కైవసం చేసుకోవాలని, ఆయా స్థానాల్లో సామాజిక, రాజకీయ పరిస్థితులు తమకు కలసి వస్తాయని అంచనా వేస్తోంది. చార్మినార్‌లో ఎంఐఎంకు చెందిన మాజీ కార్పొరేటర్ మహ్మద్‌గౌస్, చాంద్రాయణగుట్టలో ఎంఐఎం బద్ధశత్రువు మహ్మద్ పహిల్వాన్‌ను రంగంలోకి దింపాలని భావిస్తోంది. నాంపల్లి స్థానం నుంచి మంచి పట్టున్న ఇటీవలే పార్టీలో చేర్చుకున్న ఫిరోజ్ఖాన్కు నాంపల్లి టికెట్ ఇచ్చే అవకాశం ఉంది. కార్వాన్, మలక్‌పేట స్థానాల్లో ఇతర పార్టీలు గట్టిపోటీ ఇచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో నేరుగా బరిలోకి దిగాలా.. లేక గట్టి అభ్యర్థులకు మద్దతిచ్చి ముందుకు నడిపించాలా అనే దానిపై పీసీసీ పెద్దలు మల్లగుల్లాలు పడుతున్నారు. అజారుద్దీన్ నేతృత్వంలో.. పాతబస్తీ రాజకీయాలను పూర్తిగా మార్చేయాలనుకుంటున్న కాంగ్రెస్ పార్టీ మాజీ క్రికెటర్ అజారుద్దీన్‌ను తురుపుముక్కగా భావిస్తోంది. ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ సూచన మేరకు హైదరాబాద్‌లోని ఎంఐఎం ప్రభావిత నియోజకవర్గాల పార్టీ బాధ్యతలను పూర్తిగా ఆయనకు అప్పగించే అవకాశాలున్నాయి. దీనిలో భాగంగానే పీసీసీ చేపట్టిన బస్సుయాత్రలోనూ అజర్‌కు తగిన ప్రాధాన్యమిస్తున్నారు. బస్సు యాత్ర ప్రారంభమైన చేవెళ్లలో జరిగిన తొలి బహిరంగసభలో అజారుద్దీన్‌తో మాట్లాడించడమే కాక.. రాహుల్ సూచన మేరకు ఈసారి అజర్ కీలకపాత్ర పోషిస్తారని బహిరంగంగా ప్రకటించారు. అజారుద్దీన్ పట్ల ఎంఐఎంకు మద్దతు పలికే వర్గాల్లోనూ సానుభూతి ఉంటుందని, ఆయనను హైదరాబాద్ పార్లమెంటు బరిలోకి దింపితే అసెంబ్లీ అభ్యర్థులకూ బలం చేకూరుతుందని కాంగ్రెస్ యోచిస్తోంది. త్వరలోనే అజర్‌తో పాతబస్తీలో కార్యక్రమాలు నిర్వహించాలని ప్లాన్ చేస్తోంది. అయితే ఎంఐఎంను లక్ష్యంగా చేసుకోవాలనేది రాహుల్ నిర్ణయమేనని గాంధీభవన్ వర్గాలంటున్నాయి. కొన్ని రాష్ట్రాల్లో ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఎంఐఎం వైఖరి తమను దెబ్బతీసిందని ఏఐసీసీ పెద్దలు భావించారని, అందుకే ఎంఐఎంను ప్రత్యర్థిగా భావించాలని రాహుల్ డైరెక్షన్ ఇచ్చినట్టు పీసీసీ నేతలు చెబుతున్నారు. -
పాత బస్తీలో మెట్రో కోసం పోరాడతాం: బీజేపీ లక్ష్మణ్
సాక్షి, హైదరాబాద్: పాత బస్తీలో మెట్రో పనులు వెంటనే ప్రారంభించాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ డిమాండ్ చేశారు. ఎంఐఎం ఒత్తిడికి ప్రభుత్వం తలొగ్గుతోందని, పాత బస్తీలో మెట్రో రైలు కోసం రాజకీయ పోరాటం చేస్తామని హెచ్చరించారు. తార్నాక నుంచి అమీర్‌పేట్ వరకు ఆయన మెట్రో రైలులో ఆదివారం ప్రయాణించారు. ఈ సందర్భంగా మెట్రోలో ప్రయాణికులతో మాట్లాడి వారి అభిప్రాయాలు తెలుసుకున్నారు. మెట్రో ప్రయాణం సామాన్యులకు భారం అవుతోందని, చార్జీలు తగ్గించాలని కోరారు. మెట్రో స్టేషన్ లలో పార్కింగ్ లేదంటూ పార్కింగ్ వసతులను కల్పించాలని సూచించారు. -
పాతబస్తీలో ఆడపిల్లల ఆక్రందనలు
ఏడాదిగా బాలికతో వ్యభిచారం డబ్బుల కోసం దారుణానికి ఒడిగట్టిన తల్లి, అక్క, బావ పీయూసీఎల్ సహకారంతో ఫలక్‌నుమాలో కేసు నమోదు చాంద్రాయణగుట్ట: పాతబస్తీలో అరబ్ షేక్‌ల పెళ్లిళ్ల భాగోతం మూడు పువ్వులు ఆరు కాయలుగా సాగుతోంది. ముక్కుపచ్చలారని బాలిక జీవితాలను కన్నవాళ్లు, బ్రోకర్లు, అరబ్ షేక్‌లు మొగ్గలోనే తుంచేస్తున్నారు. రాష్ట్ర రాజధాని ఇప్పుడు అమ్మాయిల అంగడిగా మారింది. అరబ్ షేక్‌లతో పెళ్లి పేరుతోను.. గల్ఫ్ దేశాల్లో ఉద్యోగాల పేరుతో అమ్మాయిల ఎగుమతి కొనసాగుతూనే ఉంది. గద్దల్లా తిరిగే బ్రోకర్లు ముస్లిం కుటుంబాలపై వాలి వారి పేదరికాన్ని ఆసరా చేసుకుని ఆడ పిలల్లకు వెలకట్టి అరబ్ షేక్‌లకు అమ్మేస్తున్నారు. షేక్‌ల మోజు తీరాక వారిని వ్యభిచార గృహాలకు అప్పగిస్తున్నారు. ఎన్ని ఉదంతాలు వెలుగులోకి వచ్చినా పోలీసులు మాత్రం తూతూ మంత్రంగా దర్యాప్తు చేసి చేతులు దులుపుకుంటున్నారు. నాలుగు నెలల క్రితం ఒమన్ దేశానికి చెందిన రషీద్(61) వారం రోజుల వ్యవధిలో పాతబస్తీలో బ్రోకర్ల ద్వారా ఇద్దరు బాలికలను నిఖా(వివాహం) చేసుకుని పట్టుబడ్డాడు. ఈ ఉదంతం మరచిపోక ముందే తాజాగా ఓ మైనర్ బాలికతో బలవంతంగా వ్యభిచారం చేయిస్తున్న సంఘటన ఫలక్‌నుమా పోలీస్‌స్టేషన్ పరిధిలో వెలుగుజూసింది. ఏడాది నుంచి తల్లి, అక్క, బావ ఈ బాలికను భయపెట్టి ఈ దారుణానికి ఒడిగడుతూ వస్తున్నారు. ఫలక్‌నుమా ఏసీపీ మహ్మద్ అబ్దుల్ బారీ గురువారం తెలిపిన వివరాల ప్రకారం.. ఫలక్‌నుమా వట్టేపల్లి నైస్ హోటల్ ప్రాంతానికి చెందిన ముర్తుజా బేగం (48), జాఫర్ ఖురేషీ (50) భార్యభర్తలు. వీరికి ముగ్గురు పిల్లలు సంతానం. పెద్ద కుమార్తె సుమయ (28)ను బాబానగర్‌కు చెందిన మహ్మద్ అక్బర్(40)కిచ్చి వివాహం చేశారు. ఏడాది నుంచి అక్బర్ అత్తారింటి వద్దే ఉంటున్నాడు. ముర్తుజా బేగం రెండో కుమార్తెకు భర్త విడాకులివ్వడంతో తల్లిదండ్రుల వద్దే ఉంటోంది. కాగా డబ్బులుకు కక్కుర్తి పడ్డ ముర్తుజా బేగం తన చిన్న కుమార్తె(15)ను కుమార్తె సుమయ, అల్లుడు అక్బర్ సాయంతో ఏడాది కాలంగా వ్యభిచారం చేయించసాగింది. దీనికి బాలిక ప్రతిఘటించిన ప్రతిసారి చితకబాద సాగారు. ఈనెల 9న బాలికను అక్బర్ దుబాయ్‌కి చెందిన ఓ షేక్ చేతుల్లో పెట్టాడు. అతడు బాలికను గోవాకు తీసుకెళ్లి ఓ హోటల్లో ఆరు రోజులు గడిపారు. బాలిక వెళ్లిపోతానని ఏడవడంతో ఈనెల 16న తీసుకొచ్చి అక్బర్‌కు అప్పగించగా అతడు ఇంటికి తీసుకొచ్చాడు. మరుసటి రోజు ఉదయం మరొకరి వద్దకు పంపేందుకు బేరం ఆడుతుండడాన్ని గమనించిన బాలిక స్థానికంగా ఉండే ఓ యువకుడి సాయంతో పౌర హక్కుల ప్రజా సంఘం (పీయూసీఎల్) తెలంగాణ అధ్యక్షురాలు జయ వింధ్యాలను కలిశారు. బాలికకు జరిగిన అన్యాయాన్ని తెలుసుకున్న జయ బుధవారం అర్ధరాత్రి ఫలక్‌నుమా ఏసీపీ కార్యాలయానికి చేరుకుని ఫిర్యాదు చేశారు. మహిళా అధికారులు లేని కారణంగా గురువారం రావాలని సిబ్బంది చెప్పడంతో జయ గురువారం ఉదయమే బాలికను స్టేషన్‌కు తీసుకొచ్చి మహిళా పోలీస్ అధికారితో విచారణ చేయించారు. ఏడాది కాలంగా తనపై జరుగుతున్న దారుణాన్ని సదరు బాలిక వారికి తెలిపింది. ఈ ఘటనపై బాలిక తల్లి ముర్తుజా బేగం, అక్క సుమయ, బావ అక్బర్‌పై నిర్భయ, అత్యాచారం, అక్రమ రవాణ కేసులను నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కూతురునే విక్రయించిన ఘనుడు అక్బర్ బాలిక జీవితాన్ని నాశనం చేసిన అక్బర్ నాలుగు నెలల క్రితం తన కన్న కూతురుకు ఆరు కాంట్రాక్ట్ వివాహాలు జరిపించాడు. కరి కాంట్రాక్ట్ ముగిసాక తలాక్ చెప్పించి మరొకరికి అంటగట్టాడు. ఈ విషయమై కంచన్‌బాగ్ పోలీసులు అతన్ని అరెస్ట్ చేసి జైలుకు పంపించారు. అంతటితో ఆగని అక్బర్ తన చిన్న మరదలితో ఏడాది కాలంగా బలవంతంగా వ్యభిచారం చేయిస్తున్నాడు. తన రెండో మరదలిని కూడా ఇదే వృత్తిలోకి దించేందుకు ప్రయత్నించి విఫలమయ్యాడు. కాగా, ఈమెను పెళ్లి చేసుకుంటానని ముందుకొచ్చిన ఓ యువకుడి నుంచి కొన్నాళ్లుగా నిందితులు డబ్బు గుంజుతున్నట్టు పీయూసీల్ సభ్యులు తెలిపారు. ఇతనిపై పహాడీషరీఫ్ పోలీస్‌స్టేషన్‌లో కూడా కేసు పెండింగ్‌లో ఉంది. బెంగళూరుకు చెందిన ఓ గృహిణిని సైతం షాయిన్‌నగర్‌కు చెందిన మహిళ సాయంతో దుబాయికి అమ్మేశాడు. ఆడ పిల్లలకు రక్షణ కరవు: జయ వింధ్యాల పాత నగరంలో ఆడపిల్లకు రక్షణ కరువైందని పీయూసీఎల్ తెలంగాణ అధ్యక్షురాలు జయ వింధ్యాల అన్నారు. గురువారం ఫలక్‌నుమా పోలీస్‌స్టేషన్‌కు వచ్చిన ఆమె నిందితులను కఠినంగా శిక్షించాలని ఏసీపీని కోరారు. అనంతరం ఆమె విలేకర్లతో మాట్లాడుతూ.. పాత నగరంలో పేదరికం, నిరక్ష్యరాస్యత కారణంగా ప్రజలు తమ పిల్లలను వ్యభిచార కూపంలోకి దించుతున్నారన్నారు. రాష్ట్ర ప్రభుత్వం పాతబస్తీని దత్తత తీసుకుని అభివృద్ధి చేయాలని కోరారు. -
హడలెత్తించిన పేలుడు
ఉలిక్కిపడిన పాతబస్తీ భారీ శబ్దంతో విస్ఫోటం.. మంటలు బెంబేలెత్తిన స్థానికులు నాటుబాంబుగా భావిస్తున్న పోలీసులు యాకుత్‌పురా, న్యూస్‌లైన్: పాతబస్తీలో పేలుడు ఘటన కలకలం రేపింది. మంగళవారం అర్ధరాత్రి భవానీనగర్ ఠాణా పరిధిలోని సాలెం చౌక్ 1వ నంబర్ గల్లీలో ఓ ఇంటి ముందు విద్యుత్ స్తంభం వద్ద భారీ శబ్దంతో పేలుడు సంభవించింది. భారీగా మంటలు చెలరేగాయి. ఒక్క క్షణం బెంబేలెత్తిన స్థానికులు.. ఆపై తేరుకుని ఘటనా స్థలానికి భారీగా చేరుకున్నారు. గల్లీలోని ఓ గోడ పక్కన భారీ శబ్దంతో పేలుడు సంభవించినట్టు గుర్తించారు. పేలుడు అనంతరం మంటలు చెలరేగడంతో పక్కనే ఉండే ఇంటి గోడలతో పాటు ఓ ఇంటి పరదా, వంటసామగ్రి కాలిపోయాయి. అక్కడికి సమీపంలో ఇంటి ముందు తోపుడు బండిపై నిద్రిస్తున్న మహ్మద్ సల్మాన్ చేతికి స్వల్ప గాయమైంది. పోలీసులు, డాగ్ స్క్వాడ్, క్లూస్ టీమ్‌లు ఘటన స్థలానికి చేరుకుని పేలుడు శకలాలను సేకరించాయి. పక్కనే ఉన్న రైల్వేట్రాక్ పరిసర ప్రాంతాల్లోనూ క్షుణ్ణంగా తనిఖీలు చేశారు. గన్‌ఫౌడర్, మేకులు, ఇతర వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. ఆధారాలను బట్టి పేలింది నాటుబాంబు అయి ఉండొచ్చనే నిర్ధారణకు వచ్చారు. గన్‌పౌడర్, మేకుల్ని పరీక్షల నిమిత్తం ఫొరెన్సిక్ ల్యాబ్‌కు తరలించారు. సాలెం చౌక్ ప్రాంతంలో నేరారోపణలు ఎదుర్కొంటూ గతంలో జైలుకు వెళ్లి వచ్చిన వారి వివరాలను పోలీసులు ఆరా తీస్తున్నారు. నగర అదనపు కమిషనర్(శాంతిభద్రతలు) అంజనీ కుమార్, అదనపు కమిషనర్ (సిట్ అండ్ క్రైమ్) సందీప్ శాండిల్యా, దక్షిణ మండల డీసీపీ సర్వశ్రేష్ఠ త్రిపాఠి, సీబీసీఐడీ ఎస్పీ రామ్మోహన్ రావు, నగర టాస్క్‌ఫోర్స్ అదనపు డీసీపీ లింబారెడ్డి, దక్షిణ మండలం అదనపు డీసీపీ బాబురావు ఘటన స్థలాన్ని సందర్శించారు. అకస్మాత్తుగా పేలుడు.. పెద్ద శబ్దంతో పేలుడు సంభవించింది. అంతలోనే మంటలు చెలరేగాయి. ఎటు నుంచి వచ్చిందో, ఎవరూ వేశారో తెలియదు కానీ విద్యుత్ స్తంభం వద్ద పేలుడు పదార్థం పడి మంటలు చెలరేగడంతో మా ఇంట్లోని కర్టెన్ కాలిపోయింది. - అబ్దుల్, ప్రత్యక సాక్షి భయమేసింది.. అర్ధరాత్రి ఇంటి బయట కూర్చుండగా, పేలుడు సంభవించింది. మంటలు వ్యాపించడంతో భయంతో పారిపోయాను. మొదట ఎవరైనా యువకులు టపాసులు పేల్చారేమోనని భావించాను. కానీ, అక్కడ ఎవరూ లేరు. - షేక్ నబీ, స్థానికుడు -
పాతబస్తీలో రియల్ ఎస్టేట్ వ్యాపారిపై కాల్పులు
హైదరాబాద్ : పాతబస్తీలో రియల్ ఎస్టేట్ వ్యాపారిపై జరిగిన కాల్పుల ఘటన కలకలం సృష్టించింది. కరీంముల్లాఖాన్ అనే రియల్ ఎస్టేట్ వ్యాపారిపై కాల్పులు జరిగాయి. సమీప బంధువులే అతనిపై కాల్పులు జరిపారు. తనపై ఇర్ఫాన్, అహ్మద్‌లు కాల్పులు జరిపారని కరీంముల్లాఖాన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కాల్పులకు కారణం కుటుంబకలహాలేనని పోలీసులు చెబుతున్నారు.