వేగవంతంగా మెట్రో భూసేకరణ పనులు
200 ఆస్తులకు డిక్లరేషన్ ఇచి్చన కలెక్టర్
ఎంజీబీఎస్ నుంచి చాంద్రాయణగుట్ట వరకు పనులు
కూలి్చవేతల తొలగింపునకు హెచ్‌ఎంఆర్‌ఎల్ బిడ్డింగ్
సాక్షి, హైదరాబాద్: మెట్రో రెండో దశ విస్తరణకు క్షేత్రస్థాయిలో పనులు మొదలయ్యాయి. ఎంజీబీఎస్ నుంచి చాంద్రాయణగుట్ట వరకు చేపట్టనున్న పాతబస్తీ మెట్రో కారిడార్‌లో భూసేకరణ పనులు చేపట్టారు.ఈ కారిడార్‌లో రోడ్ల విస్తరణ, మెట్రో అలైన్‌మెంట్ కోసం తొలగించవలసిన నిర్మాణాలను ఇప్పటికే గుర్తించిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా 200 ఆస్తుల డిక్లరేషన్‌కు (100 ఎల్‌హెచ్‌ఎస్, 100 ఆర్‌హెచ్‌ఎస్) హైదరాబాద్ జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి శనివారం ఆమోదం తెలిపారు. ఈ డిక్లరేషన్‌కు అనుగుణంగా అవార్డు డిసెంబర్ నెలాఖరు నాటికి ఆమోదించనున్నట్లు పేర్కొన్నారు.
మరోవైపు ఎంజీబీఎస్ నుంచి చాంద్రాయణగుట్ట వరకు నిర్మించనున్న 7.2 కిలోమీటర్ల మెట్రో అలైన్‌మెంట్‌లో భాగంగా కూలి్చవేతలను తొలగించేందుకు హైదరాబాద్ మెట్రో రైల్ ఆసక్తి గల సంస్థల నుంచి దరఖాస్తులను ఆహా్వనించింది. ఈ మేరకు తాజాగా టెండర్ నోటిఫికేషన్ వెల్లడించింది. ఇందుకోసం సుమారు రూ.1.3 కోట్లు వెచి్చంచనున్నట్లు అధికారులు తెలిపారు. అలాగే మెట్రో కోసం ఆస్తులు కోల్పోయిన వారికి జనవరి నుంచి పరిహారం చెల్లించే అవకాశం ఉంది. హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంతో పాటు పలు మార్గాల్లో మెట్రో రెండో దశ విస్తరణకు ప్రభుత్వం కార్యాచరణ చేపట్టిన సంగతి తెలిసిందే.
కేబినెట్ ఆమోదం అనంతరం మెట్రో రెండో దశకు పరిపాలనాపరమైన అనుమతులు కూడా లభించాయి. అలాగే కేంద్రం ఆమోదం కోసం కూడా రెండో దశ ప్రాజెక్టు డీపీఆర్‌ను అందజేశారు. సుమారు రూ.24 వేల కోట్లకు పైగా నిధులతో చేపట్టనున్న ఈ ప్రాజెక్టును కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అందజేయనున్న నిధులతో పాటు ప్రైవేట్ సంస్థల భాగస్వామ్యంతో చేపట్టాలని ప్రభుత్వం భావిస్తోంది. కాగా మెట్రో మొదటి దశలోనే జూబ్లీబస్‌స్టేషన్ నుంచి ఫలక్‌నుమా వరకు నిరి్మంచవలసి ఉండగా వివిధ కారణాల వల్ల వాయిదా పడింది. ఎంజీబీఎస్ వరకే అది పరిమితమైంది. దీంతో ఈ కారిడార్‌ను రెండో దశలో చేర్చి చాంద్రాయణగుట్ట వరకు పొడిగించారు.ఈ మేరకు ఈ ఏడాది మార్చి 7వ తేదీన ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఫలక్‌నుమా వద్ద శంకుస్థాపన కూడా చేశారు.
Comments
Please login to add a commentAdd a comment