
మియాపూర్ మెట్రో స్టేషన్
హైదరాబాద్ : మెట్రో స్టేషన్లలో పని చేసే స్టేషన్ అసిస్టెంట్ ఉద్యోగులను ముందస్తు నోటీసులు ఇవ్వకుండా తీసివేయడంతో వారు మియపూర్ మెట్రో స్టేషన్ వద్ద ఆందోళనకు దిగారు. సుమారు 300 మంది నగరంలోని మెట్రో స్టేషన్లలో అసిస్టెంట్లుగా పనిచేస్తున్నారు. ట్రిగ్ అనే సంస్థ తమను చేర్చుకుని మెట్రోస్టేషన్లలో అసిస్టెంట్లుగా నియమించిందని బాధితులు చెబుతున్నారు.
ఎలాంటి సమాచారం లేకుండా తొలగించడంపై బాధితులు ఆందోళన చెందుతున్నారు. ఉద్యోగం కల్పిస్తామని ఒక్కొక్కరి వద్ద లక్ష రూపాయలు తీసుకున్నారని బాధితులు ఆరోపిస్తున్నారు. ప్రభుత్వమే కల్పించుకుని తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment