సాక్షి, హైదరాబాద్: అసెంబ్లీ ఎన్నికలు వస్తున్నాయనే 270 కి.మీ. మెట్రో రైలు నిర్మాణం చేస్తామంటూ బీఆర్‌ఎస్ సర్కార్ నిర్ణయించిందని, రియల్ ఎస్టేట్ వ్యాపారుల కోసమే ఈ మెట్రో విస్తరణ అని అందరూ అనుకుంటున్నారని బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్‌రావు ఆరోపించారు. తొమ్మిదేళ్లలో కనీసం పాతబస్తీలో 5.5 కి.మీ మైట్రోరైలు సదుపాయం కల్పించలేని రాష్ట్ర ప్రభుత్వం, ఒకేసారి రూ.69 వేల కోట్ల అంచనా వ్యయంతో దీనిని నిర్మిస్తామనడం పలు అనుమానా లకు తావిస్తోందన్నారు.
పార్టీ రాష్ట్ర కార్యాల యంలో మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ... వరదలో మునిగిపోయి ప్రజ లు అల్లాడుతుంటే ముఖ్యమంత్రి వరద ప్రాంతాల్లో పర్యటించకుండా బీఆర్‌ఎస్ పార్టీ విస్తరణ కోసం మహారాష్ట్ర వెళ్లారన్నారు.
Comments
Please login to add a commentAdd a comment