ఫుల్ క్లారిటీ ఇచ్చేసిన నాగ చైతన్య
హైదారాబాద్ : అక్కినేని నాగార్జున తనయుడు నాగచైతన్య తన పెళ్లి గురించి ఫుల్ క్లారిటీ ఇచ్చేశాడు. హీరోయిన్ సమంత, చైతు ప్రేమించుకుంటున్న విషయం తెలిసిందే. అయితే వివాహం ఎప్పుడనే దానిపై స్పష్టత లేని విషయం తెలిసిందే. తమ పెళ్లి వచ్చే ఏడాది జరుగుతుందని, అది కూడా తన సోదరుడు అఖిల్ వివాహం తర్వాతే అని నాగచైతన్య తెలిపారు.
ఓ ప్రయివేట్ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో అతడు పేర్కొన్నాడు. త్వరలోనే ముహుర్తం వివరాలు తెలుపుతామని, తాను, సమంత కొంతకాలంగా మంచి స్నేహితులమని తెలిపాడు. ఇక పెళ్లి తర్వాత సమంత నటిస్తుందా, లేదా చిత్ర పరిశ్రమగు గుడ్బై చెబుతున్న అన్న వందతులకు నాగచైతన్య తెర దించాడు. పెళ్లి తర్వాత కూడా సమంత నటిస్తుందని స్పష్టం చేశాడు. దీంతో చైతు, సమంతల పెళ్లిపై వదంతులు, పుకార్లకు పుల్స్టాప్ పడ్డట్లే. కాగా అఖిల్... ఫ్యాషన్ డిజైనర్ శ్రియ భూపాల్ను ప్రేమ వివాహం చేసుకోబోతున్న విషయం తెలిసిందే. డిసెంబరు 9 వ తేదీన అఖిల్ నిశ్చితార్థం జరగనుందని సమాచారం.