క్రికెట్ అంటే చాలా ఇష్టం: యువ హీరో | akkineni akhil as startup cricket league brand brand ambassador | Sakshi
Sakshi News home page

క్రికెట్ అంటే చాలా ఇష్టం: యువ హీరో

Published Thu, Jul 21 2016 10:24 AM | Last Updated on Mon, Sep 4 2017 5:41 AM

క్రికెట్ అంటే చాలా ఇష్టం: యువ హీరో

క్రికెట్ అంటే చాలా ఇష్టం: యువ హీరో

స్టార్టప్ క్రికెట్ బ్రాండ్ అంబాసిడర్‌గా అఖిల్
మాదాపూర్: క్రికెట్ అంటే తనకెంతో ఇష్టమని యువ సినీహీరో అక్కినేని అఖిల్ అన్నాడు. కొత్తగా రూపుదిద్దుకున్న స్టార్టప్ క్రికెట్ లీగ్‌కు అతను బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్నాడు. ఈ నేపథ్యంలో బుధవారం మాదాపూర్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో అఖిల్ మాట్లాడుతూ స్టార్టప్ కంపెనీలు క్రికెట్‌ను ప్రోత్సహించేందుకు ముందుకు రావడం సంతోషంగా ఉందన్నాడు.

నాలుగు నగరాల్లో ఈ క్రికెట్‌ను ఆడతారని, గెలుపొందిన వారికి లక్ష రూపాయలు నగదు బహుమతిని అందజేయనునున్నట్లు వెల్లడించాడు. స్టార్టప్ క్రికెట్ లీగ్ వ్యవస్థాపకులు సాయికిరణ్ మాట్లాడుతూ స్టార్టప్ కంపెనీలకు ఇదో సదావకాశమని తెలిపాడు. వచ్చే నెల 6వ తేదీ నుంచి ఈ క్రికెట్ లీగ్ మ్యాచ్‌లు జరుగుతాయని ఆయన తెలిపాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement