థ్యాంక్యూ మహేష్.. | Akkineni Akhil thans to Mahesh babu | Sakshi
Sakshi News home page

థ్యాంక్యూ మహేష్..

Published Mon, Sep 21 2015 3:38 PM | Last Updated on Fri, Jul 12 2019 4:40 PM

థ్యాంక్యూ మహేష్.. - Sakshi

థ్యాంక్యూ మహేష్..

తన మొదటి సినిమా 'అఖిల్' ఆడియో లాంచ్కు విచ్చేసినందుకు హీరో మహేష్ బాబుకు థ్యాంక్యూ అంటూ అఖిల్ ట్వీట్ చేశారు. ఆడియో లాంచ్కు మహేష్ రావడం, తనలాంటి కొత్త నటుడిని ప్రోత్సహించడం అమేజింగ్గా అనిపించిందని..  హర్షం వ్యక్తం చేశారు. అలాగే అఖిల్ సినిమాకి సంబంధించి సహకారం అందించిన ఎస్.ఎస్.కార్తికేయ(రాజమౌళి తనయుడు) పట్ల కూడా తన అభిమానాన్ని అఖిల్ ట్వీట్ రూపంలో చాటారు. అలాగే తనను ఎంకరేజ్ చేసి, ఆడియో రిలీజ్ ఫంక్షన్ను ఇంత పెద్ద సక్సెస్ చేసిన ప్రేక్షకులకు, అభిమానులకు కూడా థ్యాంక్యూ చెప్తూ ట్వీట్ చేశారు.

ఇక సినిమా రిలీజ్ కోసమే తన ఎదురుచూపులని, అక్టోబర్ 22వ తేదీన ఆ బిగ్ డే రానుందని చెప్పుకొచ్చారు. సెప్టంబర్ 24 నుంచి పూర్తి స్థాయిలో సినిమా ప్రమోషన్ ఉంటుందని అఖిల్ ట్విట్టర్లో వెల్లడించారు. కాగా అక్కినేని నాగేశ్వరరావు జయంతి సందర్భంగా ఆదివారం 'అఖిల్'  ఆడియో రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement